రంగారెడ్డి

శ్రీవాసవి కళాశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, మార్చి 1: వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలోని శ్రీవాసవి కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరుకుంది. విద్యార్థుల ఆందోళనలకు టిఎన్‌ఎస్‌ఎఫ్, ఏబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈసందర్బంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసమని వేలకువేలు పోసి కళాశాలలో చేర్పిస్తే ధనార్జనే ధ్యేయంగా అనుమతులు లేని కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి కళాశాలలు వెలుస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులతో పరీక్షలు రాయించాలని అన్నారు.
అధికారుల పర్యవేక్షణా లోపంతోనే
ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణా లోపంతోనే ఇలాంటి అనుమతులు లేని కళాశాలలు వెలుస్తున్నాయని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న సుధీర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పరీక్షకు ఆలస్యంగా వచ్చిన
23 మంది విద్యార్థినిలను పంపించివేసిన అధికారులు
జీడిమెట్ల: నిజాంపేట్ చైతన్య బాలికల కళాశాలకి చెందిన 23 మంది బాలికలు బుధవారం ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వచ్చారు. దీంతో పరీక్షా కేంద్రంలోకి అధికారులు రానివ్వకపోవడంతో విద్యార్థినులు వెనుదిరిగిపోయిన ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. విషయంపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కాలేజీ బస్సు రిపేర్ కావడంతో పరీక్షకు ఆలస్యమైనందున అధికారులు అనుమతించలేదని సమాధానమిచ్చారు. కాగా, కళాశాల నిర్లక్ష్య వైఖరిపై తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కండీషన్‌లో లేని బస్సుతో తమ బిడ్డల భవిష్యత్‌ను నాశనం చేశారని, కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.