రంగారెడ్డి

సభ్యత్వ నమోదులో ముందంజ : కొప్పుల పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, మార్చి 18: ప్రతి కార్యకర్త కృషి చేసి రాష్ట్రంలోనే జిల్లాను సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో ఉంచాలని టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి సూచించారు. శనివారం పరిగి కెఎస్‌ఆర్ గార్డెన్‌లో నియోజకవర్గం టిఆర్‌ఎస్ కార్యకర్త సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. హరీశ్వర్ రెడ్డి 70వ జన్మదినం వేడుకలను కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. హరీశ్వర్‌రెడ్డి దంపతులు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని.. జీవితంలో చాల పదవులు అనుభవించానని కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా ముందంజలో ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. పదవులు లేక పోయినా పనులు చేయవచ్చునని.. నాకు పదవి లేదని కార్యకర్తలు ఎవరూ కూడా సభ్యత్వ నమోదులో వెనుకంజ వేయకూడదని.. పార్టీ తల్లి లాంటిదని పేర్కొన్నారు. ఎంపి కొండ విశే్వశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో టిఆర్‌ఎస్ పరిగిలో బలంగా ఉన్నదని అనుకోవడంతో టిఆర్‌ఎస్ ఓటమి చెందినదని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా టిఆర్‌ఏస్ అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ పరిగిలోని టిఆర్‌ఏస్ కార్యకర్తల ఆవేదన సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. పరిగి మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, పరిగి సర్పంచ్ విజయమాల, మండల సీనియర్ నాయకులు అంతిగారి సురేందర్, అనూష, ఆంజనేయులు, టిఆర్‌ఏస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రహమత్‌నగర్‌లో
దోపిడీ దొంగల బీభత్సం
ఖైరతాబాద్, మార్చి 18: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే... రహమత్‌నర్‌లో నివాసం ఉండే వెంకటయ్య, అరుణ దంపతులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. వీరికి 11 ఏళ్ల నవ్య అనే కుమార్తె ఉంది. శనివారం మధ్యాహ్నం పక్కింటిలో ఉండే మరో చిన్నారి నవ్యతో కలిసి స్కూల్‌కు వెళ్లేందుకు వారి ఇంటికి వచ్చింది. రక్తస్త్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న నవ్యను చూసి భయాందోళనకు గురైన చిన్నారి విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు వెంటనే తల్లిదండ్రులు, స్థానికులకు తెలియజేయగా హుటాహుటిన అక్కడికి చేరుకొని పాపను చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దోపిడీ కోసం వచ్చిన దొంగలు పాప అడ్డుగా ఉండటంతో దాడి చేసి ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకొని వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా ఈవిషయమై పోలీసులను సంప్రదించగా చిన్నారి వైద్య చికిత్సలు పొందుతున్నందున పూర్తిగా కోలుకున్న అనంతరం చిన్నారి ఇచ్చే సమాచారం ఆధారంగానే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు.

బిసిలకు పెద్ద పీట
సంక్షేమానికి రూ. 8 వేల కోట్లు: ఎంపి కేశవరావు
ఇబ్రహీంపట్నం మార్చి 18: రాష్ట్ర బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి తెరాస ప్రభుత్వం బిసిలకు పెద్ద పీట వేస్తోందని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భవన ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ బిసిలంతా ఆర్థికంగా ఎదగాలని అదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత ప్రభుత్వాలకు బిసిల సంక్షేమానికి కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించేవని, ప్రస్తుత తెరాస ప్రభుత్వం రూ. 8 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని చెప్పారు. సబ్‌ప్లాన్ మాదిరిగా రుణాలను కేటాయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా జనాభా కలిగిన మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపి వి హనుమంతరావు మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలోమున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కోసం కృషి చేసిన నాయకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేష్, బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, పోరెడ్డి నర్సింహారొడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పురుషోత్తమరావు, తెరాస నాయకులు కెసి శేఖర్‌రెడ్డి, ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ క్యాబ్ డ్రైవర్లకు రివార్డులు

గచ్చిబౌలి, మార్చి 18: ఐటి కారిడార్‌లో ఉత్తమ సేవలందించే క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు రివార్డులు అందించనున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య చెప్పారు. సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని ఐటి కారిడార్‌లో క్యాబ్ అండ్ టాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులను గమ్యస్థానాలకు చేర్చడంలో క్యాబ్ డ్రైవర్‌లే కీలకపాత్ర పోషిస్తున్నారని సిపి గుర్తు చేశారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. మహిళలను ఐటి కంపెనీల నుండి హస్టల్‌కు గాని ఇంటికి జగ్రత్తగా తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమ అభివృద్ధిలో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల పాత్ర చాల ఉందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి క్యాబ్ డ్రైవర్లలే ప్రచారకర్తలని తెలిపారు. సందర్శకులైన విదేశీ పర్యాటకులైన ముందు కలిసేది క్యాబ్ డ్రైవర్లనేనని గుర్తు చేశారు. అతిథులను గౌరవంగా చూడాలని.. సినీ, ఐటి కారిడార్‌లో తిరిగే క్యాబ్ డ్రైవర్ల క్యాబ్ రిజిస్టేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. మై క్యాబ్ సేఫ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ జతచేసి రిజిస్టేషన్ చేయించుకోవాలని కమిషనర్ తెలిపారు.
సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి భరణి మాట్లాడుతూ నగరలోని ఐటి పరిశ్రమ 75వేల కోట్ల నుండి లక్షా 50వేల కోట్లు ఎగుమతులకు క్యాబ్ డ్రైవర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులను సకాలంలో కార్యాలయాలకు తీసుకుని వచ్చి ఐటి ఉత్పత్తులు పెరగడానికి కృషి చేశారని తెలిపారు. అందరూ కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. నగరం శాంతియుతంగా ఉంటే పరిశ్రమలు వస్తాయని అని చెప్పారు. ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటివరకు 75వేల క్యాబ్‌లకు రిజిస్టేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఐటి ఉద్యోగుల సూచనలు సలహలు తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్య తీసుకుంటున్నామని తెలిపారు.
క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నిజాముద్దీన్ మాట్లాడుతూ ఎవరైనా చిన్న పొరపాటు చేసినా క్యాబ్ డ్రైవర్లు అందరిపై పడుతుందని మంచి పేరు తీసుకొచ్చేందుకుకృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్య మంది క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. క్యాబ్ డ్రైవర్లతో క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తామని ప్రమాణం చేయించారు.

గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

ఘట్‌కేసర్, మార్చి 18: ప్రతి విద్యార్ధి అన్ని రంగాలలో గెలుపే లక్ష్యంగా పట్టుదలతో కృషి చేసి రాణించాలని గ్లోబల్ సప్లై చైన్ హెచ్‌ఆర్ ఏజిఎం సర్వేష్‌పరబ్ అన్నారు. మండల పరిధి సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆగామా-2కే17 జాతీయ స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్ధి తాను ఎదగటంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలని చెప్పారు. అంగ్లవిద్యలో పట్టు సాదించటంతో పాటు అన్ని రంగాల పట్ల నైపుణ్యతను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని సాదించటంలో విఫలం అయినప్పుడు కృంగి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్ధిని, విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏజిఐ డైరక్టర్ కే ఎస్ రావు, డీన్ ముత్తారెడ్డి, ఆగామా కోకన్వీనర్ హరిప్రియ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫిసర్ సి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత
ఇద్దరు నిందితులు అరెస్ట్
జీడిమెట్ల, మార్చి 18: స్కోడా కారులో గంజాయి తరలిస్తుండగా జీడిమెట్ల పోలీసులు పట్టుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సిఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బాలానగర్, పద్మారావునగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు (40) గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. సూరారంలో నివాసముండే సతీశ్‌తో కలిసి శ్రీనివాస్‌రావు రెండు వందల కిలోల గంజాయిని ఎపి 09 బిఎం 4400 నంబరు గల స్కోడా కారులో పాడేరు నుండి నాసిక్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కుత్బుల్లాపూర్ చౌరస్తాలో పట్టుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కారులో రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన శ్రీనివాస్‌రావు ఎనిమిది సంవత్సరాలుగా గంజాయి వ్యాపారం చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు. నిందితునిపై నాలుగుసార్లు గంజాయి కేసు నమోదైందని తాజాగా ఐదవసారి తాము అరెస్ట్ చేశామని సిఐ శంకర్‌రెడ్డి తెలిపారు. గంజాయిని తరలిస్తున్న శ్రీనివాస్‌రావు, సతీశ్‌లను అరెస్టు చేసి రెండు క్వింటాళ్ల గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శంషాబాద్, మార్చి 18: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సురేష్ కథనం ప్రకారం శేరిలింగంపల్లికి చెందిన చాకలి నరేష్ (30) అతని స్నేహితుడు శేఖర్ ఇద్దరు కలిసి శేఖర్ కాలుకు గాయం కావడంతో ఆయుర్వేదిక చికిత్స చేయించుకోవడానికి షాద్‌నగర్ వెళ్లారు. తిరిగి శంషాబాద్ వైపు వస్తుండగా మండలంలోని మదన్‌పల్లి గ్రామ సమీపంలో బైకు డివైడర్‌ను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను వేధిస్తున్న భర్త అరెస్టు
నేరేడ్‌మెట్, మార్చి 18: తాగుడికి బానిసై భార్యను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్త పై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం మల్కాజిగిరి బిజెఆర్‌నగర్‌లో నివసించే గౌసియాబేగం కు పాతబస్తీకి చెందిన ఎండి.నూర్‌ద్దీన్(32)తో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా తాగుడికి బానిసైన నూర్ నిత్యం భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో
తల్లీ పిల్లల అత్మహత్యాయత్నం
అల్వాల్, మార్చి 18: కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లికూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిథిలోని మచ్చబొల్లారంలో జరిగింది. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం మచ్చబొల్లారం నివాసి స్వప్న (40 ) కూతురు గాయత్రి (17) కుమారుడు (14) లతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులు, కలహాలు భరించలేక ఆమె ఇద్దరు పిల్లలకు ఎలుకల మందులో భోజనం పెట్టి తాను కూడ తిని అత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలిసిన ఇరుగు పొరుగు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో 108 అంబులెన్స్ పిలిచి ప్రథమ చికిత్స నిర్వహహించి మెరుగైన చికిత్త నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు.

పోలీసుల చొరవతో బాలికలు సురక్షితం

చాంద్రాయణగుట్ట, మార్చి 18: అంబర్‌పేట అదృశ్యమైన ఐదుగురు బాలికలు క్షేమంగా ఈస్ట్ మండలం పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి డిసిపి వి.సత్యనారాయణ విలేఖరులకు వెల్లడించారు. అంబర్‌పేటలోని బాపునగర్‌లో గల ప్రగతి విద్యానికేతన్ స్కూల్‌లో చదువుకుంటున్న తన కూతురు ఇ.శ్రీనిధి (12) కనబడుటలేదని చెన్నారెడ్డినగర్‌కు చెందిన ఇసుంపల్లి సవిత ఈనెల 16వ తేదీన ఫిర్యాదు చేసింది. ఏడవ తరగతి చదువుతున్న శ్రీనిధి తన ఫ్రెండ్ ప్రతిభ ఇంట్లో ఫేర్‌వెల్ పార్టీ ఉందని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ప్రతిభ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువు ఇళ్లలో ఇతర ప్రాంతాల్లో వెతికినా అచూకీ దొరకలేదు. దీంతో ప్రతిభ తల్లి సవిత ఫిర్యాదు చేయడంతో ప్రతిభ స్నేహితులైన జి.నంధీని (12), వి.ప్రీతి (12), సంజీత (13)లు కూడా వారి ఇళ్ల నుండి పారిపోయిన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక పోలీసు టీమ్‌లను రంగంలోకి దింపారు. తప్పిపోయిన బాలికలకు సంబంధించి టివిల్లో, పత్రికల్లో ప్రచురించడం జరిగింది. తప్పిపోయిన ఐదుమంది విద్యార్థినిలకు సంబంధించిన సమాచారాన్ని విశాఖపట్నం జూపార్క్‌లోని క్యాంటిన్ మేనేజర్ అంబర్‌పేట పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్ విశాఖపట్నంలోని అరిలోవ పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడి పోలీసులు ఐదుమంది విద్యార్థినిలు అదుపులోకి తీసుకుని విశాఖపట్నంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో సురక్షితంగా ఉంచారు. వెంటనే అంబర్‌పేట ఎస్‌ఐ సత్యనారాయణ తన సిబ్బందితో విశాఖపట్నం చేరుకుని ఐదు మంది విద్యార్థినిలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ఐదు మంది విద్యార్థులు కలిసి గత నెల క్రితం కాసికి వెళ్లెందుకు పేరెంట్స్‌కు చెప్పకుండా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఐదు మంది విద్యార్థినిలు కలిసి ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి విశాఖపట్నంకు ట్రెయిన్‌లో జనరల్ కాంపార్ట్‌మెంట్‌లో బయలుదేరివెళ్లారు. మలక్‌పేట ఎసిపి సిహెచ్.సుధాకార్, ఇన్‌స్పెక్టర్ ఎపి ఆనాంద్‌కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు సిబ్బందిని ఈస్ట్‌జోన్ ఇంచార్జి డిసిపి వి.సత్యనారాయణ అభినందించారు.

ఓయూ పోలీసుల అదుపులో ఘరానా నిందితుడు

సికిందరాబాద్, మార్చి 18: అమాయకులకు నమ్మిస్తూ కుచ్చుటోపీ పెడుతున్న ఘరానా నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఓయు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..