రంగారెడ్డి

2019లో రాష్ట్రంలో బిజెపి గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, మే 24: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుపు ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బుధవారం గుడిమల్కాపూర్ క్రిస్టల్ గార్డెన్‌లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేసిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా మారిందని చెప్పారు. సర్జికల్ స్ట్రెక్‌తో ప్రత్యర్థులకు భారత్ సత్తా తెలియజేశామని తెలిపారు. జన్‌ధన్ యోజనతో ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతా తెరిపించిన ఘనత నరేంద్ర మోదీదేనని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 16కోట్ల మంది ఇళ్లల్లో మరుగుదొడ్లు లేవని, 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు మూడేళ్ల కాలంలో మోదీ చేసి చూపారని చెప్పారు. మూడేళ్లలో నాలుగున్నర కోట్ల పేదల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మాంచామని పేర్కొన్నారు. 106 పథకాలను నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఘనత బిజెపిదేనని కొనియాడారు. వౌలిక సదుపాయల కోసం రూ.40800కోట్లు ఇచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పోలింగ్ బుత్‌ల పరిధుల్లో ప్రచారం కొనసాగిస్తున్నట్లు వివరించారు. మోదీ సర్కార్ వచ్చాకా తెలంగాణకు కేంద్ర సహాయం పదింతలు పెరిగిందని చెప్పారు. ఒబిసి కమిషన్‌కు చట్టబద్ధత కల్పించామని, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ తమ విధానమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయకుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అమిత్ షా పర్యటిస్తున్నారని తెలిపారు. బిజెపిఎల్‌పి నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు బెదరమని అన్నారు. తెలంగాణ సాధనలో బిజెపి పోరాటం మరువలేనిదని, దళితుడిని సిఎం చేయనందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సర్వేయర్ పోస్టుల భర్తీకి చర్యలు
రెవెన్యూ అధికారుల సమీక్షలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ వెల్లడి
వికారాబాద్, మే 24: రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉన్నందున త్వరలో 277 సర్వేయర్ల పోస్టుల నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారులతో పలు సమస్యలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖలో ఉన్న ఖాళీలను రెండు నెలల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన సాదా బైనామాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, కావాల్సిన భూముల సర్వేల పనులను వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో జిల్లా విస్తీర్ణం తగ్గిందని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు సమస్యల పరిష్కారం త్వరితగతమవుతుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల విషయంలో అధికారులు.. పెళ్లికి ముందే డబ్బులు అందజేస్తే ఎలాంటి అప్పులు చేసుకోకుండా పెళ్లిళ్లు చేస్తారని, ఈ విషయంలో అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు. శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున షాదీఖానాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వికారాబాద్ జిల్లాలో నీటిపారుదల లేకపోవడంతో జిల్లా వెనుకబడి ఉన్నందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామని వివరించారు. జిల్లాలో కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి రైతుల సమస్యలను పరిష్కరించడంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌ను అభినందించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ దివ్య మాట్లాడుతూ జిల్లాలో సాదాబైనామాలకు నాలుగు వేల దరఖాస్తులు రాగా 854 దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. మిగతా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జూన్ రెండో తేదీలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు భూముల సర్వే నిమిత్తం 1358 దరఖాస్తులు రాగా 207 దరఖాస్తులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏడు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున సర్వే పనులు వేగవంతం కాలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పనులు చేపట్టినట్లు వివరించారు. సమీక్షలో వికారాబాద్, చేవెళ్ల శాసనసభ్యులు బి.సంజీవరావు, కె.యాదయ్య, జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, సబ్ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డిఆర్‌వో జి.సంధ్యారాణి, ఆర్డీవో విశ్వనాథం, తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
ఘనంగా నిర్వహించాలి
కీసర, మే 24: జూన్ రెండవ తేదీన జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన గౌరవ అతిథిచే కీసర చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించటం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులతో, సాంస్కృతిక సారధి కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు త్రాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. కలెక్టరేట్‌తో పాటు, ఒఆర్‌ఆర్ జంక్షన్‌ను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్బగా డెయిరీ, హార్టికల్చర్, జనరిక్ మెడిసిన్‌లు, ఎల్‌ఇడి బల్బులు, స్వయం సహాయక గ్రూపుల ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. హరితహారం కింద కలెక్టరేట్‌లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. అవార్డుల ఎంపికకు సంబంధించి ఉత్తమ వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌వో సురేందర్‌రావు, డిపిఒ సురేశ్‌మోహన్ పాల్గొన్నారు.

పేదల ఆరోగ్య భారం ప్రభుత్వ వైద్యులపైనే..
సర్కారు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి * వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎంవి రెడ్డి
కీసర, మే 24: పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యులపై ఉందని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ నుండి వైద్యాధికారులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే అధికంగా వస్తారని, వారితో గౌరవంగా మెలిగి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరుగుదొడ్లు, వార్డులు, గదులు, మురికి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఆసుపత్రులకు నిరంతరాయంగా నీటి సరఫరా ఉండాలని, అందుకు గ్రామపంచాయతీ నుండి గాని, మిషన్ భగీరథ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోగాలు ప్రబలకుండా ప్రజల్లో ప్రచారాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, అనాథ ఆశ్రమ పాఠశాలల్లో పేద విదార్థులకు వైద్య సహాయం అందించాలని అన్నారు. సీరియస్ ఉన్న కేసులను రిజిస్టర్ చేసినట్లయితే నగరంలోని ఆసుపత్రులకు వైద్య సహాయ నిమిత్తం పంపిస్తామన్నారు. ఆసుపత్రులకు వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు జరుపుతామన్నారు. ప్రతి మూడు నెలలకోసారి సలహాసంఘ సమావేశాలు నిర్వహించాలని, ఇందులో అంగన్‌వాడీ కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలను సభ్యులుగా నియమించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఒ దాస్యానాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి తుకారాం పాల్గొన్నారు.

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు * అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం
అగ్నిగుండం
* వడగాలులకు ప్రజలు అతలాకుతలం
* బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న వైనం
* ఉపశమనం కోసం చల్లటి ప్రాంతాలకు పరుగులు
షాద్‌నగర్ రూరల్, మే 24: ఎండలు తీవ్రరూపం దాల్చడంతో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి కాలంలో భానుడు ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గత 15 రోజులుగా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుం డడంతో ప్రజలు ఉపశమనం కోసం చల్లటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఉదయం ఏడు గంటలు దాటిందంటే చాలు జనం ఇళ్లల్లో నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో వడగాలులు వీస్తుండటంతో ఊపిరి ఆడక ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఘన ఆహార పదార్థాల వైపు దృష్టి తక్కువగా పెట్టి ద్రవ పదార్థాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎండల వేడిమి తట్టుకోలేక ప్రజలు మధ్యాహ్నం సమయాల్లో శీతల పానీయాలు తీసుకుంటూ సేద తీరుతున్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని జన సంద్రంగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. భానుడి ప్రతాపం నుండి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు ఎక్కువగా ఎసిలు, కూలర్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారస్థులు ఉన్న ధర కంటే రెట్టింపు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు శీతల పానీయాల వ్యాపారం సైతం జోరందుకుందని చెప్పవచ్చు. ఎండల వేడిమి తట్టుకునేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు పెరిగాయి. మే 21వ తేదిన గరిష్టం 43 డిగ్రీలు, కనిష్టం 32 డిగ్రీలు, 22వ తేదిన గరిష్టం 42 డిగ్రీలు, కనిష్టం 30 డిగ్రీలు, 23వ తేదిన గరిష్టం 43 డిగ్రీలు, కనిష్టం 31 డిగ్రీలు, 24వ తేదిన గరిష్టం 43 డిగ్రీలు, కనిష్టం 30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా విపరీతంగా పెరగడంతో అటు ప్రజానీకం.. ఇటు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల వేడిమికి భూగర్భ జలాల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో చుక్కనీటి కోసం సుదూర తీరం పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పదేపదే హెచ్చరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు ఎప్పుడు వస్తాయోనంటూ ప్రజానీకం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ః
వడగాలులతో జాగ్రత్త
- డాక్టర్ చంద్రకళ
వడగాలుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ చంద్రకళ వివరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం సమయంలో ఓహెచ్‌ఆర్ ప్యాకెట్లను గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే కొంతమేరకు ఉపశమనం లభిస్తుందని వివరించారు. దీంతో వడగాలులకు గురికాకుండా ఉంటారని తెలిపారు. సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి ఓహెచ్‌ఆర్ ప్యాకెట్లను తీసుకోవాలని సూచించారు. ఏమైన ఇబ్బందులు కలిగితే త్వరగా వైద్యశాలకు చేరుకొని చికిత్సలు చేయించుకోవాలని వివరించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలని ఆమె కోరారు.

‘తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేద్దాం’
ఉప్పల్, మే 24: తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి, స్వచ్ఛ బోడుప్పల్ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుదామని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ ద్వారకానగర్‌లో తడి, పొడి చెత్తను వేరు చేయడానికి ఇంటికి వంద రూపాయలకు రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పురపాలక సంఘం కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాలనీ ప్రజలు 30శాతం నిధులు కాంట్రిబ్యూషన్ చేస్తే మిగితా 70 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చి మొత్తం నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే పురపాలక సంఘంలోని బోడుప్పల్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించుకోగలిగామని తెలిపారు. అనుమతికి విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా సెట్‌బ్యాక్ ఉంచాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షం నీటిని పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సాయినగర్‌లో వర్మీకంపోస్టు సెంటర్‌ను సందర్శించారు. ఎరువుల తయారీ విధానం, మొక్కల పరిరక్షణ పార్కును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కలను నాటారు. కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటింటికి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ పురపాలక సంఘంలో ఆరు జోన్లుగా విభజించి వంద శాతం పరిశుభ్రతను పాటించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేయడానికి మహిళల్లో అవగాహన కల్పించామని వివరించారు. చెత్త చెదిరిన సంపదని, వృథాగా పోనివ్వకుండా ఎరువులను తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఘట్‌కేసర్ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటిసి సంజీవరెడ్డి, ఎంపిటిసి శారద, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చర్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మూడు గంటలు ఆలస్యంగా రావడంతో కార్యక్రమానికి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు.

మహానాడుకు తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు
షాద్‌నగర్ రూరల్, మే 24: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివెళ్లారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహానాడుకు టిడిపి మండల అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది నాయకులు తరలివెళ్లారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెల్లి టిడిపి పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చెంది తిరుపతిరెడ్డి, లష్కర్‌నాయక్, నందిగామ రాంచందర్, మెడికల్ శ్రీను, ఎండి సాబేర్, పాషా, విఠ్యాల అంజయ్య, చెన్నయ్య, అనంతయ్య పాల్గొన్నారు.
వనస్థలిపురం: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టిడిపి రాష్ట్ర మహానాడుకు ఎల్బీనగర్ నేతలు భారీ ర్యాలీతో తరలివెళ్లారు. రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎల్బీనగర్ టిడిపి సమన్వమయకర్త సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తరలివెళ్లారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద కార్యకర్తలు తరలివెళ్తున్న ర్యాలీని సామ రంగారెడ్డి ప్రారంభించారు. మహానాడుకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి రెండువేల మంది కార్యకర్తలు తరలివెళ్లినట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల నర్సింహరెడ్డి, చింతల సురేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, డివిజన్ టిడిపి అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, నాంపల్లి శంకరయ్య, వెంకట్ గాంధీ, సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డి, తూర్పాటి కృష్ణ, గుండెగిరి బాబు, అశోక్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, ఉట్టి అశోకప్ప, నక్క రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
బాలాపూర్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ మహానాడుకు బుధవారం బాలాపూర్ మండల టిడిపి అధ్యక్షుడు ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ అధ్వర్యంలో మీర్‌పేట్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీల నుంచి తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్దఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో మీర్‌పేట్, జిల్లెలగూడ మున్సిపాలిటీ