రంగారెడ్డి

కిక్కే..కిక్కు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 28: మంచినీటిలా మద్యాన్ని తాగేస్తున్నారు.. సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. కిక్కు ఎక్కాల్సిందే.. ఇలా మద్యం ప్రియులు ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని సేవిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు ప్రస్తుతం భారీగా పెరిగాయ.
షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, షాద్‌నగర్ పట్టణం పరిధిలో 24 వైన్స్ షాపులు, రెండు బార్లు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్యం దుకాణాల విక్రయాలన్నీ కలిపి ప్రతి నెల 10 కోట్ల వరకు ఉంటుంది. జాతీయ రహదారి, పారిశ్రామికవాడ, రియల్ ఎస్టేట్ రంగం కలిగిన షాద్‌నగర్ ప్రాంతంలో వైన్స్ దుకాణాలు మద్యం ప్రియులతో నిత్యం కిక్కిరిసిపోవడం సహజమే. ఎక్సైజు శాఖ టార్గెట్‌లకు అనుగుణంగా మద్యం విక్రయాలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. మండే ఎండల కారణంగా మద్యం షాపుల్లో చల్లటి బీర్లకు డిమాండ్ పెరిగింది. మద్యం ప్రియుల తాకిడికి వైన్స్ షాపుల్లో బీర్ల కొరత ఏర్పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిక్కు విషయం పక్కనే పెడితే చల్లదనాన్ని కోరుకుంటున్న మద్యం ప్రియులు బీర్లపై మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చల్లటి బీర్లకు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడిందని చెప్పవచ్చు.షాద్‌నగర్ నియోజకవర్గంలోని మద్యం దుకాణాల్లో ప్రతి నెల 10కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 10శాతం మేర విక్రయాలు పెరిగాయి. దీంతో ఏడాదికి మద్యం దుకాణాల ద్వారా 120కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయిస్తూ ఎక్సైజ్ శాఖ ఆదాయం గడిస్తోంది. మద్యం విక్రయాల్లో గ్రామాలలో ఉన్న బెల్టు షాపులే ముఖ్య భూమిక పోషిస్తున్నాయని చెపవచ్చు. ప్రతి గ్రామంలో ఐదు నుంచి 10వరకు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం విక్రయాల ద్వారా ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయాన్ని ఏడాదికి.. ఏడాది తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యతపై ఎక్సైజ్ అధికారులపై ఉంచారు. ఎక్సైజ్ శాఖకు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు కింది స్థాయి సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. ఈ కోవలోనే గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

కృష్ణాపైపులైన్ లీకేజీ
పానీ పానీ
పోతే..పోనీ

ఇబ్రహీంపట్నం, మే 28: ఒకవైపు తాగునీటి కోసం కట కట ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో కృష్ణాపైపులైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. కృష్ణాపైపులైన్ లీకేజీలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో భారీగా కృష్ణానీరు రోడ్లపై వృథాగా పారుతోంది.
ఆదివారం మండల పరిధిలోని పోచారం - ఉప్పరిగూడ గ్రామాల మధ్య కృష్ణాపైపులైన్ వాల్వు వద్ద లీకేజీ ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పారుతోంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు సంబందిత అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో వరుస లీకేజీలతో నీరు వృథాగా రోడ్లుపాలైంది.

రైల్వేలైన్‌ను పరిశీలించిన అధికారులు
వికారాబాద్, మే 28: రైతులు పొలాలకు వెళ్ళేందుకు అవసరమైన మార్గం కోసం అధికారులు రైల్వేలైన్‌ను ఆదివారం పరిశీలించారు. వివరాలలోకి వెళితే వికారాబాద్ పట్టణ పరిధిలోని గంగారంకు చెందిన రైతులు పంటపొలాలకు వెళ్ళాలన్నా, వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా, పండించిన పంటను ఇంటికి చేరవేయాలన్నా వికారాబాద్- బీదర్ రైల్వేలైన్ అడ్డంకిగా ఉందని ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశం మేరకు వికారాబాద్ తహశీల్దార్ చినప్పలనాయుడు, రైల్వే డివిజనల్ సహాయ ఇంజనీర్ లింగారెడ్డి రైల్వే మార్గాన్ని పరిశీలించి, రైతులతో విచారణ చేశారు. రైల్వేలైను కింది నుండి ఆర్‌యుబికి అనుకూలంగా ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేస్తామని తెలిపారు. పరిశీలనలో రైతు నాగసాన్‌పల్లి రాములు, విఆర్‌వో సురేష్, రాములు, పెద్దరాములు, నర్సింలు, పట్ల నర్సింలు, గ్రామస్థులు నాగసాన్‌పల్లి వినోద్‌కుమార్ వున్నారు.

మంత్రులను అడ్డుకుంటాం

వెటర్నరీ విద్యార్థుల హెచ్చరిక
రాజేంద్రనగర్, మే 28: పశువైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్టవ్య్రాప్తంగా మంత్రులను తిరుగనివ్వకుండా చేస్తామని వెటర్నరీ విద్యార్థులు హెచ్చరించారు. రాజేంద్రనగర్‌లోని పివి నర్సింహారావు పశువైద్య కళాశాల విద్యార్థులు 35 రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. గ్రామీణ పశుసంపద కేంద్రాలను పశువైద్య శాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పశువైద్య విద్యార్థులు మాట్లాడుతూ.. పశువైద్య అధికారులను టిఎస్‌పిఎస్సీ ద్వారా కాకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు నోటిఫికేషన్ జివోనెంబర్ 5ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈనెల 25వ తేదిలోపు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపి ముఖం చాటేసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడుతుందనుకుంటే ఆశిస్తే.. కెసిఆర్ వాటిపై నీళ్లు చల్లారని అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి చూస్తే మరింత రెట్టింపు చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘం అద్యక్షుడు కే.శ్రీ్ధర్, నాయకులు అభిలాష్, అనిల్, శశాంక్, రాజిరెడ్డి, వసంత్, మహేష్, జితేందర్, సాయిప్రసాద్, వౌనిక, లావణ్య ఉన్నారు.

కలుషిత జలాలతో చేపల మృత్యువాత
కీసర, మే 28: కలుషిత వ్యర్థ జలాలు చెరువులో చేరటంతో చేపలు మృత్యువాత పడిన సంఘటన రాంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాంపల్లిలోని పాత చెరువుదాదాపు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. మత్య్సకారులు చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఇటీవల చర్లపల్లి, నాగారం, ఆర్‌ఎల్‌నగర్ గ్రామాల్లోని డ్రైనేజీ నీటిని చెరువులోకి కలపటంతో, నీటిలో ఆదివారం దాదాపు పది లక్షల రూపాయల విలువజేసే చేపలు మృత్యువాత పడ్డాయి. చేపలు నీటిపై తేలటం చూసిన మత్య్సకారులు, గ్రామస్థులు.. చెరువు వద్దకు చేరుకొని చనిపోయిన చేపలను పరిశీలించారు. రాంపల్లి మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు స్వామి.. జిల్లా మత్య్సశాఖ అధికారి బాలయ్యకు సమాచారం అందించారు. బాలయ్య, తహశీల్దార్ ఉపేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని చేపలు మృత్యువాత పడటానికి కారణాలను అనే్వషించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మత్య్సకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆరుగాలం చెరువులో చేపలను పెంచి, లాభాలు వచ్చే సమయానికి చేపలు మృత్యువాత పడటంతో ఆర్థికంగా నష్టపోయామని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రధాన రహదార్లలో ఎక్కడి గుంతలు అక్కడే ప్రమాదాలకు కారణమవుతున్న
వాటర్ పైపులైన్ల గుంతలు
కళ్లలో దుమ్ముతో పరేషానీ
నిత్యం ట్రాఫిక్ తిప్పలు
వాహనదారుల ఆందోళన

ఉప్పల్, మే 28: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లోని ప్రధాన రహదార్లలో వాటర్ పైపులైన్ల కోసం తవ్విన గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దినం విడిచి దినం నీటిని అందించేందుకు మెరుగైన నీటి సరఫరా కోసం కాలం చెల్లిన పైపుల స్థానంలో కొత్త కాలనీలలో, డ్రైనేజీ నీరు కలుషితమవుతున్న ప్రాంతాలలో జల మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కొత్త పైపులైన్లు నత్తనడక సాగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం అధికారుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలతో జరుగుతున్న పనుల కోసం తవ్విన గుంతల్లో పైపులు వేసి తిరిగి మట్టి పోసి మరమ్మతులు చేపట్టడకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తూ ప్రజల పాలిటి శాపంగా తయారయ్యాయి. ప్రధాన రహదార్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. ఎక్కడబడితే అక్కడ రోడ్లను తవ్వడంతో మట్టి కళ్లలోకి, దుమ్ము నోట్లోకి పోయి శ్వాసకోశ వ్యాధుల భారిన పడి ఆసుపత్రులపాలవుతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. చిల్కానగర్ ప్రధాన రహదారిలో మురికికాలువ కల్వర్టు నుంచి కావేరినగర్, గణేష్‌నగర్, ఆదర్శనగర్, న్యూరాంనగర్ పెట్రోల్ పంపు వరకు, అన్నపూర్ణకాలనీలో రోడ్డు మధ్యలో తవ్విన గుంతలు సకాలంలో మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్ డివిజన్, రామంతాపూర్ డివిజన్‌లోని పలు కాలనీలలో పైపుల కోసం తవ్విన గుంతలకు సకాలంలో మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాలనీల ప్రజలకు తిప్పలు తప్పడంలేదు.
కొన్ని సందర్భాలలో ద్విచక్ర వాహనాదారులు, కార్లు.. తవ్విన గుంతలో పడి గాయపడిన సంఘటనలు ఉన్నాయి. వచ్చే వర్ష కాలం దృష్ట్య సకాలంలో పనులు పూర్తి చేయాలని, లేదంటే పనులను నిలిపివేయాలని జిహెచ్‌ఎంసి అధికారులు ఆదేశాలు జారీ చేసినా పనులు సకాలంలో పూర్తికాకపోవడం శోచనీయమన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మల్యే ప్రభాకర్.. ఉన్నతాధికారులతో కలిసి బస్సు యాత్ర ద్వారా పైపులైన్ పనులను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని చెప్పిన మాటలు ఎంత వరకు నెరవేరుతాయో వేచి చూద్దాం.

బిసి కార్పొరేషన్‌కు
వంద కోట్లు కేటాయించాలి
- కేంద్ర మంత్రి దత్తాత్రేయ
దిల్‌సుఖ్‌నగర్, మే 28: బిసి కార్పోరేషన్‌కు వంద కోట్లు కేటాయించి బిసిల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఎల్‌బినగర్‌లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిసి శంఖారవానికి ముఖ్య అతిధులుగా బండారు దత్తాత్రేయ, మంత్రి జోగు రామన్న, ఎంపి బూర నర్సయ్య గౌడ్, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ల కల్పించాలని అన్నారు. చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో బిసిల ఓట్లు కీలకంగా మారనున్నాయని అన్నారు. కలవృత్తుల కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు కార్డులను జారీచేసే ప్రక్రియ చేపడతామని చెప్పారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలు వివక్షతకు గురికావడం దురదుష్టకరమని అన్నారు. బిసిల అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జ్యోతిరావు పూలే కమిటి కుందాల గణేష్ చారి, బిసి నేషనల్ కమిషనర్ మాజీ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య పాల్గొన్నారు.
సైకాలజిస్ట్‌లను డాకర్లుగా గుర్తించాలి
కాచిగూడ, మే 28: సైకాలజిస్ట్‌లను డాకర్లుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రాంచందర్ అన్నారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాంచందర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సైకాలజిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కొంతమంది స్వార్థరాజకీయాల కోసం అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సైకాలజిస్ట్‌లు అందరూ ఐక్యంగా శక్తిగా ఎదగాలని అన్నారు. సమాజంలో సైకాలజిస్ట్ రంగానికి ఉన్న విలువ దేనికి లేదని కానీ ప్రభుత్వం వారిని గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో సైకాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆత్మహత్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామని వివరించారు. నగరంలో సభ్యత్వ సమోదు కార్యక్రమాని చేపడుతున్నట్లు తెలిపారు. ఎంతో మంది గుర్తింపు లేని సైకాలజిస్ట్‌లు ఉన్నారని వారిని వెలుగులోకి తీసుకోచ్చి ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సమావేశంలో అసోసియోషన్ కార్యదర్శులు వి.శైలజ, నాగేశ్వరరావు, కోశాధికారి హిమబిందు, కన్వీనర్ శ్రీదేవి పాల్గొన్నారు.

నరేష్ హత్య కేసును
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

కాచిగూడ, మే 28: యాద్రాది భువనగిరి జిల్లాలో జరిగిన నరేష్ హత్య కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్డిచేత న్యాయ విచరణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. హత్య వెనుక ఉన్న కుట్రను సర్కారు బయట పెట్టాలన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘చాకలి ఎస్సీ సాధన సమితి’ అవిర్భావ సభ కొత్తకొండ్ల శ్రీలక్ష్మీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గద్దర్ మాట్లాడుతూ.. సురేష్‌ను శ్రీనివాస్‌రెడ్డి అతిదారుణంగా హత్య చేశాడని మండిపడ్డారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడంతో ఎస్సీలకు నష్టం లేదని దీంతో బలం పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎస్సీలే అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ నరేష్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ వారసులుగా రాజ్యాధికారం పొందేందుకు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలి, బివి.రాఘవులు, ఎ.పున్నయ్య, రాచకొండ వెంకన్న, హన్మంతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం చేసింది గోరంత... చెప్పేది కొండంత
* ప్రచార ఆర్భాటాలు తప్ప పనితీరు శూన్యం
* మాజీ మేయర్ కార్తీకారెడ్డి
సికిందరాబాద్, మే 28: తెరాస ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని గ్రేటర్ మాజీ మేయర్ పిసిసి నాయకురాలు బండ కార్తీకాచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా కెసిఆర్ సర్కార్ వ్యవహరిస్తుందని, చేసింది గోరంత చెప్పేది మాత్రం కొండంత అనే తీరుగా వీరి వ్యవహారశైలి ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేపడుతామని చెప్పి ఇప్పటి వరకు శిలాఫలకాలకే పరిమితం అయ్యారని తెలిపారు. తన ఇంటికి మాత్రం ఆఘమేఘాల మీద 50 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనంతో అంగరంగ వైభవంగా నిర్మించుకున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని నేడు మాటమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, రైతురుణమాఫీ కేవలం కాగితాలకే పరిమితం చేశారని తెలిపారు. మూసీ ప్రక్షాళన, నగరంలో క్రిష్టియన్ భవన్, బంజారాభవన్ నిర్మాణాలు ఏమయ్యాయని, మూడు సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటికి వాటికి మోక్షం లభించలేదని అన్నారు. ఇక సికిందరాబాద్ నియోజకవర్గానికి వస్తే గతంలో తాము చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పటికీ ఒనగూరింది ఏమి లేదని అన్నారు.
కేవలం ప్రచారం కోసం కెసిఆర్, కెటిఆర్, పద్మారావు ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏమి చేయలేకపోయారని తెలిపారు. సికిందరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు, షాదీఖానాలు ఏమయ్యాయో మంత్రి వివరించాలని కార్తీకారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి, సంబంధిత శాఖ మంత్రికి పట్టడం లేదని అన్నారు. తమ పాలన బేష్ అంటూ మార్కులు వేసుకోవడం కాదు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామాలు చేయించి గెలిపిస్తే అప్పుడు తెలిసిపోతుంది ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చే మార్కుల శాతం అని కార్తీకారెడ్డి తెలిపారు. మంత్రి పద్మారావుకు నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, ఇప్పటి వరకు తమ హయాంలో కొలిక్కి వచ్చిన రోడ్డు విస్తరణను సైతం నేటికి చేపట్టలేకపోయారని, లాలాపేట్‌లో ఇండోర్ స్టేడియాన్ని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తే చివరకు వరకు ప్రారంభోత్సవం కాకుండా కాలయాపన చేసి చివరకు తమకు మాటమాత్రం కూడ చెప్పకుండా ప్రారంభోత్సవాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామే అయినప్పటికీ.. కెసిఆర్ తానే ఒక్కడే తెలంగాణ సాధించినట్లు, తన కుమారుడు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు నాగులూరి కృష్ణకుమార్ పేర్కొన్నారు. బండ చంద్రారెడ్డి మాట్లాడుతూ సికిందరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, షాదీఖాణను నిర్మించకపోతే ఓట్లు అడగమని చెప్పగలరా అని సవాల్ విసిరారు.
కాగా జూన్ 1న సంగారెడ్డిలో జరగనున్న రాహుల్ గాంధీ భహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్దయెత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నామని బండ చంద్రారెడ్డి వివరించారు. కార్యక్రమంలో నాందేవ్, మైనారిటీ నాయకులు షాబుద్దీన్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు మణికంఠ, దామోదర్, ఖన్నా పాల్గొన్నారు.

బలహీనవర్గాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్

మేడ్చల్, మే 28: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని మేడ్చల్‌లో ఆదివారం టిడిపి శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ, కండ్లకోయ, మేడ్చల్, అత్వెల్లి, గిర్మాపూర్ తదితర గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నానరు. బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకు రావడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థకు చరమగీతం పాడి ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాలను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియడారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అంకితభావంలో కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. టిడిపికి తెలంగాణలో పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవకాశవాద రాజకీయాల కోసం నాయకులు పార్టీని వీడినా కార్యకర్తల బలం కొండంత అండగా ఉందని వాఖ్యానించారు. ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, నాయకులు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, చిన్న నర్సింహ్మ, చేపరాజు, కనకాల సూర్యం, ఎస్. రవీందర్‌గౌడ్, పద్మ, శివ, వౌలనా, దీపకళ, లింగం, రంజిత్, కిరణ్, లత, చంద్రశేఖర్‌రెడ్డి, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

అంబోజి, స్వాతి హత్య కేసులో నిందితులను శిక్షించాలి
గచ్చిబౌలి, మే 28: కులాంతర వివాహాం చేసుకున్నారని నరేష్, స్వాతిని హత్య చేసినవారిపై చర్య తీసుకోవాలని, ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిజి, నర్సింహారావు డిమాండ్ చేశారు. సిపిఎంతో పాటు సామాజిక సంఘల ఆధ్వర్యంలో గచ్చిబౌలి చౌరస్తాలో హోంమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోయిందని, నరేష్‌ను కాపాడడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి కుమారైను, అల్లుడిని అతికిరాతకంగా చంపాడని, ఆయనకు సహకరించిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావుతం కాకుండా చర్యలు తీసుకోవాని కోరారు. నరేష్, స్వాతి హత్యలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంబిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరేష్, సిపిఎం నాయకులు కృష్ణ, శోభన్ నాయక్, కెవిపిఎస్ నాయకులు దశరత్, అశోక్, పిఆర్‌ఎస్‌ఎస్ వృతి సంఘం నాయకలు కిరణ్, మహేందర్ ప్రసాద్, వెంకటరాములు పాల్గొన్నారు.

టిఆ