రంగారెడ్డి

ప్రపంచ స్థాయిలోనే మేటిగా నిలిచిన ‘్భల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి: ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకుని పవర్ ప్లాంట్ పరికరాల తయారీలో భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ మేటిగా నిలిచిందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. బాలకృష్ణన్ అన్నారు. మంగళవారం భెల్ టౌన్‌షిప్‌లోని స్టేడియంలో నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐఎస్‌ఎఫ్ బలగాలు, పాఠశాల విద్యార్థుల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు, సాధించాల్సిన లక్ష్యాలను ఇడి బాలకృష్ణన్ వివరించారు. ప్రధాన మంత్రి శ్రమవీర్ అవార్డును సాధించిన డిప్యూటీ ఇంజనీర్లు సిహెచ్ బాలాజీ , ఆర్. వెంకటేశ్వరరావు, విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్‌ను గెలుచుకున్న ఉద్యోగులు ఇ. చంద్రయ్య, పి. దేవేంద్ర, ఎస్. నజీర్ అహ్మద్, పి. సురేష్‌బాబు, సిహెచ్ కిష్టయ్యలను అభినందించారు. ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.