రంగారెడ్డి

అయూబ్‌ఖాన్‌కు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, సెప్టెంబర్ 22: తెరాస మైనారిటీ నాయకుడు అయూబ్‌ఖాన్ మృతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఐదు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలగాలను రప్పించి తాండూరులో మోహరించారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తల మధ్య అయూబ్‌ఖాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. తాండూరుతో పాటు, జిల్లాలో అందరికీ సుపరిచితుడయిన అయూబ్ ఖాన్ కుల మతాలకు అతీతంగా అందరి మేలు కోసం పరితపించేవాడని స్థానికులు, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, అయూబ్ ఖాన్ తన సొంత లాభం చూసుకోకుండా తన అనుచరులు, సహచరులకు మేలు జరిగేలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల పేదలకు అందేలా పరితపించేవాడని.. అయూబ్‌తో సాన్నిహిత్యంగా మెలిగే మిత్రులు అనుచరులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మంత్రి ఇంటి వద్ద పోలీస్ పహారా
రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నివాసం వద్ద అన్ని వైపుల రహదారులను మూసి వేసి మంత్రి ఇంటి వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. అదే విధంగా అయూబ్ ఇంటి పరిసరాలలో ఇందిరా నగర్ అంతటా ఎటు చాసినా పోలీసు బలగాలను మోహరించారు. అయూబ్ మృతదేహాన్ని తాండూరుకు తరలించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. అంబులెన్స్ నుండి ఇంట్లోకి తరలించక ముందే అక్కడి నుండి వెళ్లిపోయారు. భద్రత కారణాల దృష్ట్యా మంత్రిని పోలీస్ అధికారులు అక్కడి నుండి తరలింప జేసినట్లు సమాచారం. అయతే, అయూబ్ అంత్యక్రియల్లో డిప్యూటీ సిఎం మహామూద్ అలీ పాల్గొన్నారు. స్థానిక జామ మసీదులో జిరిగిన ప్రార్థనల్లో డిప్యూటీ సిఎం పాల్గొన్నారు. ఆయన అయూబ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయూబ్ అంత్యక్రియల్లో చేవెళ్ల ఎం.పి కొండా విశే్వశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవ రావు, టిఆర్‌ఎస్ యువ నేత పైలెట్ రోహిత్ రెడ్డి, చెవేళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితర టి ఆర్ ఎస్ నేతలు, పార్టీ నాయకులు, తాండూరుకు చెందిన అన్ని పార్టీల నాయకులు అంతక్రియలకు హాజరయ్యారు.
ఆత్మాహుతి బాధాకరం: డిప్యూటీ సిఎం
తెలంగాణ ఉద్యమ పోరాటంలో తాండూరు ప్రాంతంతో పాటు అప్పటి రంగారెడ్డి జిల్లాలో కీలక పాత్ర పోషించిన మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్ ఆత్మాహుతికి పాల్పడటం చాలా బాధాకరమని అని డిప్యూటీ సి. ఎం మహామూద్ అలీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయూబ్ తనను పలుసార్లు కలిసి తాండూరు ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ కారులకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతుండే వారన్నారు. ఉద్యమకారులు ఎవ్వరూ నిరాశ నిస్పృహలకు గురి కావద్దని, సిఎం కేసిఆర్ సమయానుకూలంగా ఉద్యమ కారులందరికీ తగిన న్యాయం చేస్తారని ఎన్నోసార్లు తాను భరోసా ఇచ్చినట్లు డిప్యూటీ సి. ఎం అంత్యక్రియల సందర్భంగా వెల్లడించారు. కాగా, అయూబ్ మనస్తాపానికి గురై తన ప్రాణాల మీదకు తెచ్చుకోవటం చాలా బాధాకరం అన్నారు.