రంగారెడ్డి

బతుకమ్మ చీరల పంపిణీపె సమగ్ర విచారణకు డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేకుండా ఉన్నాయని, అందుకు గల కారణాలను విచారణ జరిపించి దోషులను శిక్షించాలని రంగారెడ్డి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరిరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టి ఆర్ ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను ఎక్కడి నుంచి తెచ్చారో, ప్రజలకు ఎలా పంచారో వివరించాలన్నారు.
చేనేత కార్మికుల వద్ద విక్రయించి ప్రజలకు పంచుతామని తెలిపి నాసిరకం చీరలను పంచారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ఆమెతో పాటు కలెక్టర్‌ను కలిసిన వారిలో బిజెపి నాయకులు వై.శ్రీ్ధర్ ఉన్నారు.

వికారాబాద్ జిల్లాలో మద్యం దుకాణాలు వీరికే..!
* మొత్తం దరఖాస్తులు 446 *తాండూర్‌లో దుకాణాన్ని దక్కించుకున్న కర్ణాటక వాసి
వికారాబాద్, సెప్టెంబర్ 22: వికారాబాద్ జిల్లాలోని 45 మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్దతిన పూర్తయింది. 45 దుకాణాలకుగాను 446 దరఖాస్తులు రావడంతో రూ.4.46 లక్షల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 45 దుకాణాల్లో ఏడు దుకాణాలు మహిళలకు దక్కడం గమనార్హం, తాండూర్ పట్టణం ఏడో వార్డులోని దుకాణం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసన్నగౌడ్‌కు దక్కింది. పదో నెంబరు వార్డులోని షాప్ నెంబరు ఒకటి సుధాకర్, రెండోది మహేందర్‌గౌడ్, మూడోది శ్రవణ్‌కుమార్‌గౌడ్, 20వ నెంబరు వార్డులోని దుకాణం గోవింద్‌గౌడ్, 21వ వార్డులోని దుకాణం ఇ.ఆంజనేయులు, 29వ వార్డులోని మొదటి నెంబరు దుకాణం పాండప్పగౌడ్, రెండో దుకాణం ఇ.శ్రీనివాస్, వార్డు నెంబరు 30లోని దుకాణం లగిశెట్టి క్రాంతికుమార్, మల్కాపూర్ గ్రామ దుకాణం దొడ్ల శ్రీనివాస్‌గౌడ్, కరణ్‌కోట్ దుకాణం కొట్ట సుమలత, పెద్దెముల్ దుకాణం ప్రభావతి, కోట్‌పల్లి చిప్ప సంగమేశ్, బషీరాబాద్ దుకాణం చంద్రిక, యాలాల్ దుకాణం అశోక్‌కుమార్‌లకు దక్కింది. వికారాబాద్ పట్టణం ఏడో వార్డులోని దుకాణాన్ని బాల్‌రాజ్‌గౌడ్, 24వ వార్డులోని దుకాణాన్ని పి.శ్రీ్ధర్‌రెడ్డి, 20వ వార్డులోని మొదటి దుకాణం సి.ప్రశాంత్‌గౌడ్, రెండో దుకాణం ఎ.రాజేందర్‌గౌడ్, మూడో దుకాణం ఎ.శ్రీనివాస్‌రెడ్డి, 24వ వార్డులోని దుకాణం పి.సుభాష్‌చంద్రారెడ్డి, 21వ వార్డు దుకాణం కె.విజయభాస్కర్‌రెడ్డి, మనె్నగూడలోని మొదటి నెంబరు దుకాణం మేడిశెట్టి మల్లేశం, రెండో దుకాణం నారాయణకు, నవాబ్‌పేట దుకాణం పుష్పలత, ధారూర్ దుకాణం స్వప్న, మర్పల్లి ఒకటో నెంబరు దుకాణం ఎం.రమేష్, రెండో నెంబరు దుకాణం ఆంజనేయులు, మోమిన్‌పేట మొదటి దుకాణం బి.రాజేష్, రెండో దుకాణం పి.కృష్ణగౌడ్, బంట్వారం దుకాణం ఎం.శంకర్, పరిగి ఒకటో దుకాణం ఎం.ప్రభాకర్, రెండో దుకాణం అంజయ్య, మూడో దుకాణం ప్రసన్నలక్ష్మి, నాలుగో నెంబరు దుకాణం ఎన్.రామ, ఐదో నెంబరు దుకాణం వెంకటేశం, ఆరో నెంబరు దుకాణం కేతావత్వ్రి, దోమ దుకాణం ఎం.రాజేందర్, కులకచర్ల మొదటి దుకాణం కె.జగన్, రెండో దుకాణం ఎస్.శ్రీనివాస్, కొడంగల్ దుకాణం కె.నరేష్, రెండో దుకాణం వెంకట్‌రెడ్డి, మూడో దుకాణం ఎ.్భరత్‌కుమార్, దౌల్తాబాద్ దుకాణం రాఘవేందర్, బొంరాస్‌పేట దుకాణం ఎ.రామకృష్ణలు దక్కించుకున్నారు.

భూ రికార్డులను ఫోర్జరీ చేసి అమ్మిన
నలుగురికి జైలు, జరిమాన
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 22: తక్కువ భూమిని ఎక్కువ భూమిగా రికార్డులను ఫోర్జరీ చేసి అమ్మకాలు జరిపిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష జరిమాన విధించినట్లు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న కొట్టి కృష్ణారెడ్డి కుమారులు కొట్టి రవిందర్‌రెడ్డి, కొట్టి సుధాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, కొట్టి వెంకట్‌రెడ్డిలు తమకు చెందిన సర్వే నెంబర్ 27లోని మూడున్నర ఎకరాల భూమికి గాను నాలుగు ఎకరాల భూమిగా పట్టాదారు పాసు పుస్తకాలను ఫోర్జరీ చేసి నగరానికి చెందిన కిరణ్‌గుప్తకు 2012లో అమ్మినట్లు తెలిపారు. తాను కొనుగోలు చేసిన భూమికి హద్దురాళ్లు ఏర్పాటు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొట్టి అంజిరెడ్డి తన భూమిలో ఎలా చేస్తున్నారని అడ్డుకున్నారు. దీంతో తాము కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపటంతో పట్టాదారు పాసు పుస్తకాలలో ఫోర్జరీ జరిగినట్లు గమనించిన అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పై వ్యక్తులపై 120బి, 420, 468, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టి రవిందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డిలకు నెల రోజుల పాటు జైలు శిక్షను అమలు చేయటంతో పాటు వెయ్యి రూపాయల చొప్పున జరిమాన విధించినట్లు చెప్పారు. నిందితుల్లో కొట్టి వెంకట్‌రెడ్డి ఇటీవల మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు.