రంగారెడ్డి

వక్కేసి.. పువ్వేసి చందమామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 23: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే బతకమ్మ పండుగతో రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించిందని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం మేడ్చల్ మండలం మైసమ్మగూడ గ్రామ పరిధిలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎంపి, ఎమ్మేలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించిన వారు ఉత్సాహంగా విద్యార్థినులతో కలిసి కోలాటం ఆడారు. ఎంపి మల్లారెడ్డి మరింత ఉత్సాహంతో విద్యార్థినులను ఉత్సాహ పరుస్తూ చిందేశారు. ఎంపి కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. విద్యార్థినులు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయి. అనంతరం ఎంపి, ఎమ్మేల్యే విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలను చైతన్య పర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ చీరలను కూడా అందజేస్తుందని చెప్పారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అతి పెద్ద పండుగ అన్నారు. నేడు దేశ, విదేశాల్లో సైతం బతుకమ్మను ఒక చరిత్రగా నిలిపిన ఘనత నిజామాబాద్ ఎంపి కవితకే దక్కుతుందని వివరించారు. బతుకమ్మతో తెలంగాణకు గుర్తింపే కాకుండా గౌరవం కూడా దక్కిందని ఎంపి, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో సుమారు 5వేల మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు మేడ్చల్‌లోని వివిధ కాలనీలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో సంప్రదాయబద్ధంగా ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని వాడవాడలా ప్రధాన కూడళ్ల వద్ద తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబైన మహిళలు తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలను మధ్యలో పేర్చి తెలంగాణ యాసలో పాటలు పాడి ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ ఆడారు. నాల్గవ రోజు అదే జోష్‌తో మహిళలు బతుకమ్మను జరుపుకోవడం విశేషం. మండలంలోని పూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలలో సర్పంచ్ కోల స్రవంతి, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉప్పల్: పూల గౌరమ్మా.. బంగారు బతుకునీయమ్మా అంటూ బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకుమ్మ ఉయ్యాలో అని తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలతో మహిళలు ర్యాలీగా వచ్చి పురవీధుల్లో ఆట పాటలతో అలరించారు. పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీనగర్, ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, అనఘాపురి కాలనీలలో నిర్వహించిన సంబురాల్లో జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, టిఆర్‌ఎస్ పురపాలక సంఘం అధ్యక్ష, కార్యదర్శిలు చర్ల ఆంజనేయులు, పులకండ్ల జంగారెడ్డి, అధ్యక్షురాలు కనకదుర్గ, ఎంపిటిసిలు, కాలనీ సంక్షేమ మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి దాండియా, కోలాటాల నృత్యాలతో అలరించారు.
కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో..
బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కాలనీల వారిగా మహిళలను ఏకం చేస్తూ వారితో తీరొక పూలతో తయారుచేసిన బతుకమ్మ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సమాఖ్య ముఖ్య సలహాదారులు రాపోలు రాములు, అధ్యక్షుడు బొమ్మక్ రమేశ్, నేతలు అశోక్‌రెడ్డి, సత్యనారాయణ, మల్లారెడ్డి, అనురాధ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలను మండల పరిధిలోని సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలల ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకృతి ప్రసాదించిన రంగు, రంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన కళాశాలల బోధన, బోధనేతర సిబ్బందితో పాటు, విద్యార్థినులు బతుకమ్మ సంబరాలలో అనందోత్సాహాల మధ్య పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆటలు ఆడారు.
కెపిహెచ్‌బి కాలనీ: బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బాలాజీనగర్ డివిజన్ కెపిహెచ్‌బి కాలనీ ఫేజ్ 4లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలకు స్థానిక కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్‌రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ ఉత్సవాలన్నారు.

పాన్ మసాల నిల్వలపై దాడులు
* రూ. రెండు లక్షలు సొత్తు స్వాధీనం * నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్, సెప్టెంబర్ 23: అక్రమంగా నిషేధిత పాన్‌మసాలాలు నిల్వవుంచిన ఓఇంటిపై సరూర్‌నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను శనివారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిఐ లింగయ్య వెల్లడించారు. వెంకటేశ్వర కాలనీ రోడు నెం.3 నివసించే తోట అశోక్ కుమార్ (45).. పాన్ షాప్‌లకు పాన్‌మసాలాలు సరఫరా చేస్తాడు. ప్రభుత్వం పాన్ మసాలాలపై నిషేధించిన విషయం విదితమే. అశోక్ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా భారీ స్థాయిలో పాన్‌మసాలాలు ఇంట్లో నిల్వఉంచాడు. పక్కా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు అశోక్ ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వవుంచిన రెండు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్.ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఊళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 23: దసరా పండుగను పురస్కరించుకుని ఇతర ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఘట్‌కేసర్, ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో శనివారం అటోలో తిరుగుతూ మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఊర్లకు వెళ్లేటప్పుడు విలువైన బంగారం, అధిక డబ్బులు ఇంట్లో ఉంచరాదని, గేటు వేసిన తాళం కనపడకుండా లోపలి నుండి వేయాలని, ఊరికి వెళ్లే ముందు పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఊర్లకు వెళ్ళే ముందు ఇంటి పక్కన వాళ్లకు పక్కా సమాచారం ఇవ్వాలని కోరారు. మైకు ద్వారా ప్రచారం చేయటంతో దొంగతనాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రచురించిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్‌తో పాటు ఎస్సైలు చంద్రశేఖర్, శోభన్‌బాబు, శేఖర్‌లతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.