రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో 2015లో తగ్గిన నేరాల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 30: రంగారెడ్డి జిల్లాలో గత రెండేళ్ల కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి వెల్లడించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నేరాల వివరాలను తెలిపారు. ఈ సంవత్సరంలో జిల్లాలో 2958 కేసులు నమోదవగా 2014లో 3749, 2013లో 3644 కేసులు నమోదయ్యాయని చెప్పారు. హత్యలు ఈ సంవత్సరం 61 జరిగాయని పేర్కొన్నారు. ఆస్తి కోసం జరిగిన నేరాలు ఈసంవత్సరం 10 చోటు చేసుకోగా గత ఏడాది రెండు మాత్రమే జరిగాయని వివరించారు. అత్యాచారాలు ఈసంవత్సరం 32, గత ఏడాది 51 జరిగాయని అన్నారు. ఈసంవత్సరం 227 మంది మృతిచెందిన 210 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా గత ఏడాది 279 మంది మృతిచెందిన 250 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 283 మంది గాయాలపాలైన రోడ్డు ప్రమాదాల కేసులు ఈసంవత్సరం 170 నమోదు కాగా గత ఏడాది 398 మంది గాయపడి 226 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద ఈ సంవత్సరం 51 కేసులు నమోదవగా 41 నిజమైనవిగా తేల్చామని, గత ఏడాది 53 నమోదవగా 30 నిజమైనవిగా తేల్చామని వివరించారు. మహిళలకు సంబంధించిన కేసులు ఈ ఏడాది 305 నమోదవగా, గత ఏడాది 434 నమోదయ్యాయని అన్నారు. ఆత్మహత్యలు ఈ సంవత్సరం జిల్లాలో 307 నమోదవగా, గత ఏడాది 325 నమోదయ్యాయని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఈ సంవత్సరం 82 మంది ఆత్మహత్యలకు పాల్పడగా గత ఏడాది 66 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. గుర్తుతెలియని మృతదేహాల లభ్యం కేసులు ఈ ఏడాది 55 నమోదవగా అందులో 25 మంది గుర్తించామని, గత ఏడాది 28 గుర్తుతెలియని మృతదేహాలు లభించగా తొమ్మిది మందిని గుర్తించారని వివరించారు. తప్పిపోయిన కేసులు గత ఏడాది 147 నమోదవగా 94 మంది దొరికారని, గత ఏడాది 135 మంది అదృశ్యమవగా 114 మంది గుర్తించబడ్డారని చెప్పారు. ఈ సంవత్సరం జిల్లాలో మట్కా కేసులు 18 నమోదవగా 69 మందిని అరెస్ట్ చేసి రూ.70480ను సీజ్ చేశామని పేర్కొన్నారు. 60 గాంబ్లింగ్ కేసులు నమోదవగా 315 మందిని అరెస్ట్ చేసి రూ.3.03 లక్షల రూపాయలను సీజ్ చేశామని తెలిపారు.
మోటారు వాహనాల చట్టం కింద ఈ సంవత్సరం 28656 కేసులు నమోదు చేసి రూ.56.88లక్షల రూపాయల జరిమానా విధించామని, బహిరంగ ధూమపాన నిరోధక చట్టం కింద 162 కేసులు నమోదు చేసి రూ.18800 జరిమానా వసూలు చేశామని, మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై 104 కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసుల్లో కోర్టు శిక్ష విధించబడిన కేసుల శాతం ఈసంవత్సరం 17 కాగా, గత ఏడాది 18 శాతమని అన్నారు. సొమ్ము పోగొట్టుకున్న కేసులు జిల్లాలో ఈ సంవత్సరం 241 నమోదవగా 172 కేసులు పరిష్కరించి రూ.96.31లక్షలకు రూ.55.97 లక్షల విలువ గల సొమ్ము రికవరీ చేశామని తెలిపారు. గత ఏడాది 385 కేసులు నమోదవగా 259 కేసులను పరిష్కరించి రూ.84.57 లక్షలకు రూ.40.83 లక్షల సొమ్ము రికవరీ చేయబడిందని వివరించారు. వికారాబాద్ మహిళా పోలిస్‌స్టేషన్‌లో గృహహింస, భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించి ఈ సంవత్సరం 90 కేసులు నమోదవగా, గత ఏడాది 120 కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు.
2016లో నేరాల సంఖ్య తగ్గేందుకు చర్యలు
రంగారెడ్డి జిల్లాలో నూతన సంవత్సరంలో నేరాల సంఖ్య మరింతగా తగ్గేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. బాలిక, మహిళల రక్షణ కోసం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, 60 రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు రెస్పెక్ట్‌రోడ్, లైసెన్స్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ధారూర్‌లో నిర్వహించబడిన మెథడిస్ట్ జాతరకు భారీబందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. బంట్వారంలో జరిగిన బాలిక హత్య, అత్యాచారం, పరిగి ప్రాంతంలో బోర్‌బావిలో పడిన పాపను రక్షించడంలో చాకచక్యతను పోలీసు సిబ్బంది ప్రదర్శించిందని గుర్తుచేశారు. జిల్లాలో షీటీంలను ఏర్పాటు చేసి అక్కడక్కడ నిఘా పెట్టించామని, దాన్ని మరింత పటిష్టపర్చి నిఘాను పెంచుతామని స్పష్టం చేశారు. కానిస్టేబుల్, ఎస్‌ఐల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ రానున్న తరుణంలో చేవెళ్లలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామని, మానవతా దృక్పథంలో కెజిబివి, ఇతర ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేశామని, విద్యార్థులకు ఎలంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అపుడపడు హాస్టళ్లను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు.
డిటిసి మరమ్మతు పనులనకు ప్రతిపాదనలు
జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్, జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో లీకేజీలు, ఫ్లోరింగ్, వైరింగ్ మరమ్మతు పనులకు 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని వివరించారు. సమావేశంలో తాండూర్ ఎఎస్పీ చందన దీప్తి, వికారాబాద్, చేవెళ్ల డిఎస్పీలు టి.స్వామి, రంగారెడ్డి, ఎఆర్ డిఎస్పీ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.