రంగారెడ్డి

యార్డ్‌ను వదిలి.. రోడ్డుపైనే డంపింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమ్లెట్ల, అక్టోబర్ 17: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల నుండి సేకరించే చెత్తను డంపింగ్ చేయడానికి జిహెచ్‌ఎంసి అధికారులు హెచ్‌ఎంటి ఖాళీ ప్రదేశంలోని రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. రెండెకరాలు కాస్త నాలుగైదు ఎకరాలకు డంపింగ్ యార్డ్‌గా విస్తరించింది. జగద్గిరిగుట్ట నుండి షాపూర్‌నగర్ వరకు పైపులైన్ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ చెత్తను, వేస్టేజ్ పదార్థాలను, వ్యర్థాలను, కెమికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. అధికారులు కేటాయించిన రెండెకరాలలో డంపింగ్ చేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు టిప్పర్ వాహనాలతో జవహర్‌నగర్‌కు తరలించాలి. కానీ, కొన్ని రోజులుగా చెత్తను తరలించకపోవడంతో డంపింగ్ యార్డ్‌లో కుప్పలు, తెప్పలుగా చెత్త పేరుకుపోయింది. ఇక ఆటో ట్రాలీలలో తీసుకువస్తున్న చెత్తను రోడ్డునుపైనే డంపింగ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌లో వేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో చుట్టు ప్రక్కల బస్తీలన్నీ చెత్త కంపుకొడుతున్నాయి.
చుట్టు ప్రక్కల బస్తీలలో నివసించే వారంతా తలుపులు వేసుకుంటే తప్ప జీవించలేని దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఆటో ట్రాలీల నుండి తీసుకువస్తున్న చెత్తను రోడ్డుపైనే డంపింగ్ చేయడంతో ఓ వైపు ట్రాఫిక్ సమస్య, మరో వైపు దుర్వాసనతో వాహనదారులు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హెచ్‌ఎంటి పైపులైన్ రోడ్డు మధ్య ట్యాంక్ వద్ద రోడ్డు అతి చిన్నగా ఉంది. అక్కడే కిలోమీటర్ పొడవునా వాహనాలు ఉదయం, సాయంత్రం నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఆటో ట్రాలీలు సైతం రోడ్డుపైనే వాహనాలను ఆపి చెత్తను డంపింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా జఠిలంగా మారుతుంది. జిహెచ్‌ఎంసి అధికారులు కళ్లు తెరుచుకుని డంపింగ్ చేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని, రోడ్డుపై డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.