రంగారెడ్డి

అన్ని రంగాల్లో కొడంగల్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, అక్టోబర్ 22: నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రిలో మాట్లాడి ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డికి తెరాస నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న అంబేర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రేగడి మైలారం పంచాయతీ పరిధిలోని మూడుమామిళ్ల తండా రోడ్డును బిటి రోడ్డుగా మార్చేందుకు మూడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనులకు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లడుతూ బొంరాస్‌పేట మండలం జిల్లాలోనే అత్యధిక గిరిజన తండాలున్న మండలంగా పేరుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తండాలన్నింటికి రోడ్డు సౌకర్యం, అర్హత కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులతో పది రోజుల్లోగా సమీక్షా సమావేశం నిర్వహించి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుండి కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలు నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో కలిశాయని, మరో రెండు మండలాలు పాత జిల్లా పరిధిలోనే ఉన్నాయని, జిల్లా పరిధిలోని మూడు మండలాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకు వస్తానని అన్నారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రభుత్వ కళశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. కొస్గిలో పెండింగ్‌లో ఉన్న బస్ డిపో నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ - బీజాపూర్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని అన్నారు. జిల్లాలో తాగునీటి కోసం రూ,500కోట్ల నిధులతో మిషన్ భగీరథ పనులు చేపట్టామని, కొడంగల్ నియోజకవర్గంలో రూ.167 కోట్ల నిధులుతో తాగునీటి పనులు జరుగుతున్నాయని అన్నారు. పనులు మందకోడిగా జరుగడాన్ని గుర్తించి అధికారులతో సమీక్షించామని, గడువులోగా పనులు పూర్తీ చేయాలని ఆదేశించినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పంచాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బి, ఎక్సైజ్ తదితర కార్యాలయాలను ఇక్కడి నుండి పరిగి, తాండూర్‌లకు మార్చారని వాటిని కొడంగల్‌లోనే ఏర్పాటు చేయిస్తానని, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌తో మాట్లడి వీలయినంత త్వరగా కార్యాలయాలను కొడంగల్‌కు రప్పించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎంపిపి మంగమ్మ, జడ్పిటిసి జ్యోతిరెడ్డి, సర్పంచ్ యాదమ్మ, ఎంపిటిసి శేఖరయ్య, టిఆర్‌ఎస్ నాయకులు ముద్దప్ప, విష్ణువర్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, రమణా రెడ్డి, శ్యామలయ్య గౌడ్, టిడిపి నాయకులు తిరుపతి రెడ్డి, రాజేష్ రెడ్డి, నర్సిరెడ్డి, నర్సిములు గౌడ్, రాంచంద్రా రెడ్డి పాల్గొన్నారు.