రంగారెడ్డి

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, అక్టోబర్ 23: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 44 ఫిర్యాదులు అందాయని తెలిపారు. పంచాయతీ సభ్యుల తీర్మానం లేకుండా పంచాయతీ నిధుల నుండి చేపట్టిన పనులపై విచారణ జరిపించాలని, ఘట్‌కేసర్ మండలం, పోచారం పంచాయతీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పంచాయతీ నిధులు 30 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, పార్కుచుట్టూ ప్రహరీతో పాటు పలు పనులు చేపడుతున్నారని, దీనిపై ప్రశ్నించగా పంచాయతీ సభ్యుల తీర్మాణం అవసరం లేదని, పై అధికారుల అనుమతి ఉందని చెబుతూ ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అక్రమంగా తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ మండలం, డబిల్‌పురాకు చెందిన పి.శ్రీనివాస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. గ్రామంలోని సర్వే నెంబర్ 67 లో 15 ఎకరాలు భూమిని ప్రభుత్వం సాగు చేసుకోవటానికి ఇచ్చిందని, ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగించామని, ఇటీవల అనారోగ్యం కారణంగా వ్యవసాయం చేయలేక పోయామని, దీనిని దృష్టిలో పెట్టుకున్న మాజీ ఎంపిటిసి ఫయాజ్‌అలి అతని కుమారులు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించుకోవటంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, స్ధానిక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తక్షణమే చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి పాల్గొన్నారు.