రంగారెడ్డి

రైతుల ప్రయోజనార్థం పత్తి కొనుగోలు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 23: రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఐనెల్లి మాధవ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో పాత ఎడ్ల బజార్ (కాటిల్ మార్కెట్) ప్రాంగణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన గోదాంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి రైతులు ఇక్కట్లపాలు కాకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరలను కల్పిస్తూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని తాండూరు వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రభుత్వం పత్తి రైతులకు మేలైన ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు రూ.3వేలలోపు ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి గ్రేడ్-1 క్వింటాలుకు రూ.4320 ధరను నిర్ణయించినట్లు, గ్రేడ్-2కు రూ.4220 రూపాయలు ధర నిర్ణయించి రైతుల నుండి పత్తిని కొనుగోలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
తేమ, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుండి పత్తిని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి వాహెద్ మాట్లాడుతూ కొనుగోలు చేసే పత్తిని రైతుల సౌకర్యార్థం యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న మారుతి కాటన్ మిల్లుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
రైతులు పట్టణంలోని పాత ఎడ్ల బజార్ లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రానికి కాకుండా నేరుగా లక్ష్మీనారాయపూర్ చౌరాస్తా సమీపంలో ఉన్న మారుతి కాటన్ మిల్లుకు తరలించి రవాణా వ్యయప్రసాలకు లోనుకాకుండా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో కోట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ బుజ్జమ్మ, తాండూరు మండల వైస్ చైర్మన్ తుప్పుడు శేఖర్, టిఆర్‌ఎస్ నాయకుడు రాజప్ప గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ ఎండి హబీబ్, డిసిఎంఎస్ మేనేజర్ ఎండి షరీఫ్, సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు అమిత్ పాల్గొన్నారు.