రంగారెడ్డి

భారంగా మారిన రైతు రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్పల్లి, జనవరి 2: రైతులు అప్పులబారినుండి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఒక లక్ష వరకు రుణాలు మాఫీ చేసిన వడ్డీలు మాత్రం బ్యాంకర్లు బాదుతూనే ఉన్నారు. ఒకవైపు రైతులనుండి ఎలాంటి వడ్డీలు వసూలు చేవద్దని రైతులు చెల్లించి వడ్డీలను ప్రభుత్వమే బ్యాంకులకు జమ చేస్తుందని ఓ వైపు వ్యవసాయశాఖ మంత్రి నెల క్రితమే పత్రికాముఖంగా ప్రకటించినా బాంకర్లు దానిని అమలు చేయటం లేదని మర్పల్లి మండల రైతులు వాపోతున్నారు. విడతల వారీగా రైతుల రుణాలను మాఫీ చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం (2014-15) సంవత్సరం 25 శాతం, ఈ సంవత్సరం 25 శాతం మాఫీచేస్తూ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు జమ చేసింది. కానీ కొంతమంది రైతులు గతంలో వ్యాపారాల నిమిత్తం తీసుకున్న రుణాలు చెల్లించని వారికి ఇప్పుడు పంట రుణమాపీ క్రింద వచ్చిన డబ్బులు నుండి కొంతమొత్తం వసూలుచేస్తూ రైతుల చేతిలో తూతూమంత్రంగా డబ్బులు వేస్తున్నారు. బ్యాంకర్లను ఈ విషయమై అడిగితే మీ వ్యాపార రుణం బాకీవుంది కదా అందుకే మాఫీ అయిన రూపాయలనుండి కట్టించుకుంటున్నామని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మర్పల్లి మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రాబ్యాంకులతోపాటు పట్లూర్‌లో స్టేట్‌బ్యాంక్, కొంశెట్‌పల్లిలో గోల్కొండ గ్రామీణ బ్యాంకులు మరియు మండల కేంద్రంలో ఒక సహకార బ్యాంకులు ఉన్నాయి.
దళారులదే మాట
బ్యాంకుల్లో దళారులు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడం, దళారులు రైతుల అప్పులు కట్టి రెన్యువల్ చేయించి వడ్డీలు వసూలు చేయడంతో బ్యాంకర్లు వారి చేతుల్లో ఆటబొమ్మల్లా మారిపోయారని పలువులరు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రైతులను వేధించకుండా రుణాలు మంజూరు చేయాలని మర్పల్లి మండల రైతులు కోరుతున్నారు.