రంగారెడ్డి

హైదరాబాద్‌కు హైటెక్ సిటీని మేమే తెచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 6: హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని, తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి న్యూహఫీజ్‌పేటలో ఏర్పాటు చేసిన హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్‌ల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగామాట్లాడుతూ హైదరాబాద్‌కు సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. టిడిపి హయాంలోనే హైటెక్ సిటీని నిర్మించి, హైదరాబాద్‌లో ఐటిని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో టిడిపి ఎక్కడుందని కేసిఆర్ ప్రశ్నిస్తున్నారని, తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామని సవాల్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాట యోధుడు కోదండరామ్‌ను, అమరవీరుల కుటుంబాలను మరచిన కేసిఆర్ ప్రజలను కూడా మరిచిపోతున్నారని విమర్శించారు. సాయంత్రం చందానగర్‌లో జరిగిన చందానగర్,మియాపూర్ డివజన్‌ల కార్యకర్తల సమావేశేంలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పార్టీ పరిశీలకుడు వేం నరేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండి రమేశ్, మాజీ కార్పొరేటర్లు రవి ముదిరాజ్, పి.అశోక్‌గౌడ్, నాయకులు బివి రమణగౌడ్, కె.వెంకటేశ్ గౌడ్, ఉరిటి వెంకట్రావు, ఎండి అక్తర్, అక్బర్ ఖాన్, కె.సునీతారెడ్డి, అన్వర్ షరీఫ్, మోహన్ ముదిరాజ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జంగయ్య యాదవ్, వై.శ్రీశైలం యాదవ్, లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా
ఎన్నికల షెడ్యూల్
రాజేంద్రనగర్: గ్రేటర్ ఎన్నికల్లో గెలువాలనే దుర్బుద్ధితో ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ తమకు అనుకూలంగా మార్చుకున్న మాయలమరాఠీ కేసీ ఆర్ అని జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ టీ ఆర్ ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ తెదేపా విస్తృత స్థాయి సమావేశం అత్తాపూర్ ఎస్ ఎన్ ఆర్ గార్డెన్‌లో డివిజన్ తెదేపా అధ్యక్షుడు మిద్దెల సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్, మహబూబ్‌నగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ సర్కిల్ ఎన్నికల ఇంచార్జ్ బక్కని నర్సింహ్ములు పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ గెలుస్తుందని తప్పుడు ప్రచారం, సర్వేలు చేయించి తనకే అనుకూలంగా ఉందని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపాడని ఆరోపించారు. ప్రజలను అయోమయంలో పెట్టి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకున్నడానికి కేసీ ఆర్ కుట్రలు పన్నుతున్నారని, అది సాధ్యం కాదని దాన్ని తిప్పి కొట్టి తెదేపా సత్తా ఏంటో చూపుతామన్నారు. కేసీ ఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ తన క్యాబినెట్‌లోని మంత్రులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ తన గుప్పిట్లో పెట్టుకుని ఆట ఆడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ మహానగరం ప్రపంచంలో గుర్తింపు పొందిందని, కేసీ ఆర్‌కు అభివృద్ధి ఎవరు చేశారో తెలిసి కూడా నిజాం కాలంలో జరిగిందని తప్పుడు కూతలు కూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీ ఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. మిత్రపక్షంతో గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఈ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్, సర్కిల్ తెదేపా అధ్యక్షుడు టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ యాదవ్, మోహన్‌రెడ్డి, మ్యాడం రామేశ్వర్‌రావు, మిద్దెల సురేందర్‌రెడ్డి, ఎస్.వెంకటేష్ కురుమ, కృష్ణగౌడ్, సోమారం రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

మీర్‌పేటలో మిస్సింగ్.. కంచన్‌బాగ్‌లో హత్య
సైదాబాద్, జనవరి 6: రెండు రోజుల క్రితం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మహిళ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలం రెమద్దుల గ్రామానికి చెందిన పానుగంటి ఎల్లమ్మ(42) కొన్ని సంవత్సరాల క్రితం భర్తను వదిలిపెట్టి నగరంలో రోషన్‌దౌలాలోని తన కూతురు కవిత కుటుంబంతో కలిసి ఉంటుంది. సోమవారం ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అల్లుడు రమేష్ మీర్‌పేట ఠాణాలో పిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం బాలానగర్ చౌరస్తా నుండి రోషన్‌దౌలా వెళ్లే దారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో మహిళ మృతదేహం పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఆమె మెడ ముఖం భాగంపై దెబ్బలు ఉండటంతో ఎవరో ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా హత్యకు గురైన మహిళను రెండు రోజుల క్రితం తప్పిపోయిన ఎల్లమ్మగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు.

రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

మేడ్చల్, జనవరి 6: రేషన్ డీలర్లు లబ్దిదారులకు సరుకులను పారదర్శకంగా అందించాలని ఏలాంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని సహయ పౌరసరఫరాల అధికారి (ఎఎస్‌ఓ) దీప్తి హెచ్చరించారు. మేడ్చల్ మండల రేషన్ డీలర్లకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో విధివిధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీలర్లనుద్దేశించి మాట్లాడుతూ డీలర్లు కచ్చితంగా దుకాణాల బయట సమయ పట్టికను ఏర్పాటు చేయాలని, విధిగా సమయపాలన పాటించాలని, నిల్వలు, సరుకులను తెలిపే సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేయడంలో అవతకతవకలకు పాల్పడరాదని సరుకులను నల్ల బజారుకు తరలించినట్లు తెలిసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరుపేదలైనవారే రేషన్ సరుకుల గురించి వస్తారని వారితో మర్యాదగా ప్రవర్తించి మన్నలను చూరగొనాలని కోరారు. క్రమం తప్పకుండా నెలసరి సరుకులను తెలిపే రిజష్టర్‌ను రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాలని, తెచ్చిన సరుకులు పంపిణీ చేసినవి ఎంత, నిల్వ ఉన్నవి ఎంత అన్న సమగ్ర వివరాలను అందులో పొందుపర్చాలని వివరించారు.
కీరిజిష్టర్, స్టాక్ రిజిష్టర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. పారదర్శకంగా సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేసి పౌర సరఫరాల శాఖకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ త్రిపుర చాముండేశ్వరీ, ఆర్‌ఐ శ్రీదేవి పాల్గొన్నారు.
ఘన వ్యర్థాల నియంత్రణలో నగరం ఆదర్శం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: మహానగరాల ముందున్న ప్రధాన సమస్య ఘన వ్యర్థాల నియంత్రణ విషయంలో నగరం అవలంభిస్తున్న శాస్ర్తియ పద్దతులు నేడు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతిరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జిహెచ్‌ఎంసి శానిటేషన్ సూపర్‌వైజర్లు, ఎంటమాలజి సూపర్‌వైజర్లు, పారిశుద్ధ్య కార్మికులకు డస్ట్‌బిన్లు, ఆటో టిప్పర్ల వినియోగంపై బుధవారం అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఐటి శాఖ మంత్రి కెటిఆర్ స్వీపింగ్ కార్మికులతో కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని పాశ్చాత్య దేశాల్లోని నగరాల్లో చెత్తను వేర్వేరుగా సేకరించటం జరుగుతోందని, ఆసియా దేశాల్లో ఏ నగరం కూడా శాస్ర్తియ పద్దతిలో వ్యర్థ పదార్దాలను వేర్వేరుగా సేకరించటం జరగటం లేదని ఆయన స్పష్టం చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చేందుకు దేశంలోనే ఏ నగరంలో కూడా చేపట్టని విధంగా నగరంలో 44లక్షల డస్ట్‌బిన్లను ప్రజలకు పంపిణీ చేయటం జరుగుతోందన్నారు. వీటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు రెండువేల ఆటో టిప్పర్లను సమకూర్చినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని హరిత, సురక్ష, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో బల్దియా కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికులకు స్వచ్ఛంధంగా జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. జిహెచ్‌ఎంసిలో కార్మికులకు 24వేల 442 మంది వర్కర్లకు వేతనాలు పెరిగాయని ఆయన గుర్తుచేశారు. ఇందులో 22394 మంది శానిటరీ, వెటర్నరి, ట్రాన్స్‌పోర్టు, ఎంటమాలజి విభాగాల్లో పనిచేసే వారున్నారని, వారికి రూ. 8500 నుంచి రూ. 12500ల వరకు వేతనాలు పెంచటం జరిగిందని వివరించారు.
అదే విధంగా ఒక్క వెయ్యి 77 మంది శానిటరీ, ఎంటమాలజి ఫీల్డు అసిస్టెంట్లకు రూ. 13వేలు, 978మంది డ్రైవర్లకు రూ. 15వేల వరకు జీతాలు పెంచటం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఇందులో భాగంగా 1872 మంది ఔట్‌సోర్సు ఉద్యోగులకు గణనీయంగా వేతనాలు పెంచటం జరిగిందన్నారు. నగరంలో రోజుకి 5వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రస్తుతం సేకరించటం జరుగుతుందని వివరించారు.
తడి,పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి, వాటి నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేసే పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, కౌసర్ మోహియుద్దిన్, జోనల్ కమిషనర్లు ఉప్పల్ గౌరవ్, హరిచందన, అదనపు కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ‘యుసికాన్ 2016’ కాన్ఫరెన్స్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: నేటి నుంచి నాలుగురోజుల పాటు నగరంలో యుసికాన్ 2016 పేరిట ప్రత్యేక కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. మాదాపూర్‌లోని హోటల్ నొవాటెల్‌లో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సుకు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, స్వీడన్, సింగపూర్, బెల్జియం, న్యూజిలాండ్ సహా అనేక దేశాలకు చెందిన దాదాపు మూడు వేల మంది జాతీయ, అంతర్జాతీయ యురాలజిస్టు వైద్య నిపుణులు హజరుకానున్నట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డా.డి. వ్యాస్ నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ఎస్. జయరాంరెడ్డి, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ఎస్. జయరాంరెడ్డి, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ఎన్.మల్లిఖార్జున్‌రెడ్డి, కోశాధికారి డా.ఏవి.రవికుమార్, హైదరాబాద్ యూరాలజిస్టు సొసైటీ అధ్యక్షులు డి.ఏవిఎస్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ సభకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డిలు అతిధులుగా హజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెరుగైన చికిత్స-అందరికి అందుబాటులో వైద్యం’ అన్నదే ఈ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో కిడ్నీల్లో రాళ్లు, మూత్ర పిండాలు పూర్తిగా చెడిపోవటం, కిడ్నీ మార్పిడి, మూత్రనాళ సంబంధిత సమస్యలు, మగవారిలో సంతానలేని, సక్యెవల్ సమస్యలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడే గర్భస్థ శిశువులకు పుట్టక ముందే వైద్యం చేసే ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేసేందుకు ఉన్న ఆధునిక చికిత్స విధానాలను, ఆయా దేశాలు అనుసరిస్తున్న పద్దతులను నిపుణులు వివరించనున్నట్లు తెలిపారు. మూత్ర పిండాల్లో రాళ్లు ఎలా తయారవుతాయి, వాటిని ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి అన్న విషయంపై కూడా వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు తన అభిప్రాయాలను పరస్పరం పంచుకోన్నుట్లు తెలిపారు.

త్వరలో రాష్ట్రానికి రూ.42వేల కోట్ల ప్యాకేజీ
చార్మినార్, జనవరి 6: కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి ద్వారా రాష్ట్రానికి రూ. 42వేల కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రకటించిందని భారతీయ జనతాపార్టీ మహిళ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారి రాధిక వివరించారు. ఈ విషయాన్ని గుర్తించక నిజామాబాద్ ఎంపి కవిత నగరంలో ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్ సమావేశంలో నగరాకి రూ. 20వేల కోట్ల ప్యాకేజీకి బిజెపి నేతలు రాష్ట్రానికి తీసుకురాగలిగితే తాను బిజెపికే ఓటు వేస్తానని వ్యాఖ్యానించటం పట్ల మహిళా మోర్చా నాయకురాళ్లు స్పందించారు. ఈ మేరకు బర్కత్‌పురాలోని బిజెపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బండారి రాధిక మాట్లాడుతూ రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి, టిడిపి మిత్రపక్షాల అభ్యర్థికి మహిళా మోర్చా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తుందని వివరించారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి రూ 42వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలుసునని, ఆయనే సాక్ష్యమని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం కవిత బిజెపికి ఓటు వేసి, బిజెపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బండారి రాధిక వ్యాఖ్యానించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేసి, ప్రజలందరిచే ఓట్లు వేయిస్తే మున్ముందు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్యాకేజీలే కాకుండా, డబుల్ ధమాకా ప్యాకేజీలు కూడా తీసుకువస్తామని రాధిక అన్నారు. ఈ సమావేశంలో మహిళా నేతలు అమృత, విజితారెడ్డి, గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు దేవుళ్లతో సమానం: వివిఎస్ లక్ష్మణ్
గచ్చిబౌలి, జనవరి 6: సమాజంలో వైద్యులు దేవుడితో సమానమని అందుకే వైద్యోనారాయణ హరి అన్నారని ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అన్నారు. మాదాపూర్ పత్రికనగర్‌లోని మాక్స్‌క్యూర్ అడ్వాన్స్‌డ్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రిప్లేస్‌మెంట్ సెంటర్‌ను లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డాక్టర్ల సేవలు ఎనలేనివని వైద్యులు దేవుడితో సమానమన్నారు.