రంగారెడ్డి

గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌లో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 7: అర్థరాత్రి పూలమార్కెట్‌లో షార్టు షార్యూట్‌తో మంటలంటుకుని 16షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదం నగరంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రంలో గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ అతి పెద్దది. ఈ పూలమార్కెట్‌కు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పూలను తెచ్చి విక్రయిస్తారు. అయితే పండుగ సీజన్‌లో అయితే ఇసుకపోస్తే రాలనట్టుగా రద్దీగా ఉంటుంది. కాగా ప్రతిరోజు మాదిరిగానే బుధవారం రాత్రి మార్కెట్‌లోని షాపుల యాజమానులు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. అయితే అర్థరాత్రి దాటిన తర్వాత మార్కెట్‌లోని దివంగత పి.ఇంద్రారెడ్డి విగ్రహాం సమీపంలో ఉన్న రేకుల షాపులకు షార్టుసర్క్యూట్ జరిగి, వరుసలోని ఉన్న షాపులు రెండు వైపుల దుకాణాలకు నిప్పంటుకుంది. అక్కడ పడుకొని ఉన్న వారు లేచి చూసేసరికి దుకాణాలకు నిప్పుఅంటుకుని మంటలు చెలరేగుతున్నాయి. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు లేచి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు అగ్నిమాపక వాహనాలను కూడా రప్పించారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది. అప్పటికే 16షాపులకు నిప్పుఅంటుకుంది. ఈ ప్రమాదంలో తమ షాపులలో ఉన్న ఫర్నిచర్‌తో పాటు పూలు కూడా కాలి బూడిదయ్యాయని షాపుల యాజమానులు లబోదిబోమన్నారు. క్లూస్ టీమ్ పోలీసులు వచ్చి పరిశీలించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు షార్టు షార్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.
సుమారు ఐదులక్షల నష్టం ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో గురువారం ఉదయం మార్కెట్ ఉన్నతాధికారులు కూడా వచ్చి పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

బోడుప్పల్‌లో ఘరానా మోసం
రు.4కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి
ఉప్పల్, జనవరి 7: అమాయక ప్రజలను మోసం చేసిన రూ.4కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారి ఉదంతం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం..బోడుప్పల్ మారుతీనగర్‌లో నివసిస్తున్న నల్లగొండ జిల్లా రాజపేట మండలం, నమిలె గ్రామానికి చెందిన చేర్యాల ఉపేందర్ గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. దాదాపు రు.5లక్షల వరకు చిట్టీలను నడుపుతూ గత కొంతకాలంగా వ్యవధి ముగిసినప్పటికీ చిట్టీల డబ్బును తిరిగి ఇవ్వకపోగా గత పదిరోజుల నుంచి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. గురువారం సుమారు 40 మంది బాధితులు ఉపేందర్ ఇంటిముందు ఆందోళన చేసి చివరకు న్యాయం కోసం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు.

విద్యుత్‌లో మిగులు రాష్ట్రంగా తెలంగాణ

వనస్థలిపురం, జనవరి 7: 2019 సంవత్సరం నాటికి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరెంట్ మిగులు రాష్ట్రంగా తయారుచేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎల్‌బినగర్‌లోని ఎం.ఇ.రెడ్డి గార్డెన్‌లో గురువారంనాడు ఏర్పాటు చేసారు. సంఘం అధ్యక్షులు బి.సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలలో వెలుగులు నింపడానికి తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మిగిలిపోయిన అనేక సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేయడానికి తమప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెడుతుందని మంత్రి చెప్పారు. కార్మిక సంఘాలు ధర్నాలు, బంద్ పిలుపులకు అవకాశం లేకుండా చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు.
బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనిస్తున్న రాష్టమ్రుఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి నూతన ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకరరావు, ఉన్నతస్థాయి అధికారులు రఘుమారెడ్డి, వెంకట్ నారాయం, ఎమ్మెల్యే వీరేశం, వర్కింగ్ అధ్యక్షులు రామకృష్ణం రాజులు పాల్గొన్నారు.