రంగారెడ్డి

ఎంఐఎం ఆధ్వర్యంలో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, నవంబర్ 18: రెండవ భాషగా ఉర్దూను ప్రకటించడంతో ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం కొడంగల్‌లో సంబరాలు జరుపుకొన్నారు. ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు గుల్షన్ సమక్షంలో పట్టణంలోని ప్రదాన రహదారి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో రెండవ భాషగా ఉర్దూను అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అందుకు ప్రభుత్వానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మీసేవా కేంద్రాల ద్వారా పది కోట్ల లావాదేవీలు
కీసర, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాలల్లో ఇప్పటి వరకు పది కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా మేడ్చల్ జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జేసీ ధర్మారెడ్డి, జిల్లా మీసేవా అడిషనల్ డైరెక్టర్ కె.్ధర్మారెడ్డిలు కేక్ కట్‌చేసి, మీసేవా కేంద్రాల నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. జేసీ మాట్లాడుతూ సులభంగా వేగంగా సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించటంలో మీసేవాకేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మేడ్చల్ జిల్లా ఏర్పడిన తరువాత 5.5 లక్షల లావాదేవీలు జరిపినట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలకు సంబందించి, నిర్ణీత గడువుగా అధికారులు పరిష్కరించాలని తెలిపారు. మీసేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం ఐదు లక్షల భీమా సౌకర్యం కల్పించటం అభినందనీయమన్నారు. మీసేవా కేంద్రాల చిరునామాలను త్వరలోనే గూగుల్‌మ్యాప్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ మల్లిఖార్జున్‌రెడ్డి, ఫణీందర్‌రెడ్డి, జిల్లా మీసేవా ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షులు కె.దయాసాగర్, చంద్రశేఖర్, నర్సింహారెడ్డి, సంతోష్‌కుమార్, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.