రంగారెడ్డి

ఉద్యమ ఆకాంక్ష మరిచినందుకే ‘కొలువుల కొట్లాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 18: కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్ నిధులను ఖర్చు చేసి అప్పులపాలు చేస్తోందని టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన కొలువుల కొట్లాట సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మరచిందని విమర్శించారు. ప్రజలకు వౌలిక వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం వెనుకబడిందని అన్నారు. ఉద్యోగ కల్పనలో ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉండనే ఉండదని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం లేదని వాపోయారు. రైతు సమన్వయ సమితుల్లో ఒకే పార్టీకి చెందిన వారికి అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారే ఉన్నారని, కేవలం టీఆర్‌ఎస్ పార్టీ వారికే సమితుల్లో అవకాశం కల్పించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. తెలంగాణలోని చాలా జిల్లాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు తేవడంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, వికారాబాద్ జిల్లాలో వనరులున్నా వినియోగించుకోవడం లేదని, సింగూరు డ్యాం నుండి నీరు కిందకు వెళ్ళడంతో సంగారెడ్డికి అన్యాయం జరుగుతోందని, సూర్యాపేట తాగునీటిపై స్పష్టత లేదని, మహబూబ్‌నగర్ జిల్లాలో కాలువలు తవ్వుతున్నా నీరేదని, గద్వాలలోనూ విస్మయ పరిస్థితి అని, మేడ్చల్ జిల్లాకు ఎలాంటి ప్రణాళిక లేదని, లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ పేర ఖర్చు పెడుతున్న కోట్లాది రూపాయల్లో ఎన్నో వృథా అవుతున్నాయని, వృథా ఖర్చును ఆపితే చిన్నచిన్న ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపనందుకే ఈనెల 30న కొలువుల కొట్లాట నిర్వహిస్తున్నామని విద్యార్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సదస్సులో టీజేఏసీ జిల్లా చైర్మన్ సోమశేఖర్, జిల్లా కన్వీనర్ గడ్డం రాంచందర్, రిటైర్డ్ ఇంజనీర్ డి.పెంటారెడ్డి, సీనియర్ న్యాయవాది పి.గోవర్దన్‌రెడ్డి, నాయకులు టి.నర్సింలు, లాలయ్య, జె.రవిశంకర్, ఏపిఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.