రంగారెడ్డి

ముగిసిన లైబ్రరీ మేనేజ్‌మెంట్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, నవంబర్ 18: వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మెథడిస్ట్ జాతరకు పెద్ద ఎత్తున యాత్రికులు వస్తారని, వారికి వౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఏడు గంటలకు మెథడిస్ట్ జాతరలో పాల్గొని శిలువ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో జరిగే క్రైస్తవుల పెద్ద జాతర రాష్ట్రం నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వస్తారని వారికి అన్ని రకాల వౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణం వసతుల కల్పనకు గాను రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. క్రీస్తు ప్రవచనాలు, శాంతి, ప్రేమ, దయాగుణం, పరోపకారం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని సూచించారు. ధారూర్‌లో జరిగే క్రైస్తవ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యాత్రికులు పెద్ద ఎత్తున తరలివస్తారని అన్నారు.
సుమారు 10 నుండి 12 లక్షల యాత్రికులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందని యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లాలో జరిగే ధారూర్ మెథడిస్ట్ జాతర 95వ జాతరగా జరుపుకొంటున్నామని ఇక్కడ జాతరలో ప్రార్థనలు చేస్తే అన్ని మంచి జరుగుతాయనే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ధారూర్ ఎంపిపి ఉమాపార్వతి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజునాయక్, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు రాములు, దేవుజానాయక్, ఎంపిడిఓ సబిత, సిఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీకొన్న కారు

వికారాబాద్, నవంబర్ 18: ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. పూడూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి (24) కారు నడుపుతూ ఆర్టీవో కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన విష్ణు మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.