రంగారెడ్డి

50మంది బాలబాలికలకు టెన్నిస్ ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, నవంబర్ 23: ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టూర్ విజయవంతంగా కొనసాగుతుంది. మహేష్ భూపతి టెన్నిస్ అకాడమీ సహకరంతో తెలంగాణ సోషల్ వెళ్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సోసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్)కి చెందిన 50 మంది బాలబాలికలతో కూడిన విద్యార్థుల బృందానికి కోండాపుర్‌లోని 10వీకే టెన్నిస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారి బాలబాలికలను టెన్నిస్ క్రీడాలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పలు నగరాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఐఐఎఫ్‌ఎల్ ఫౌండేషన్, మహేష్ భూపతి టెన్నిస్ అకాడమీతో కలిసి నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ఆర్‌ఈఎస్‌కి చెందిన విద్యార్థులకు టెన్నిస్ క్రీడా గురించి వివరించి వారికి తగిన రితీలో శిక్షణనిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ సారిక కుల్‌కర్ణి పర్యవేక్షణలో టెన్నిస్ కోచ్‌లు శరత్ కుమార్, చార్లీ వైట్లీకోల్స్.. బాలబాలికలకు టెన్నిస్‌లో మేలకువలు నేర్పుతున్నారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్ట్ఫికెట్‌లను అందజేశారు. శిక్షణ శిబిరాన్ని పురస్కరించుకుని అండర్-10, 12 విభాగంలో బాలబాలికలకు టెన్నిస్‌లో మ్యాచ్‌లు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి త్వరలో జరుగునున్న ఆసియా చాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.

పర్యాటకులను దోచుకుంటున్న ఐదుగురి అరెస్టు

వికారాబాద్, నవంబర్ 23: పర్యాటకులు, ప్రయాణికులను దోచుకుంటున్న ఐదుగురు యువకులను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌గృహకల్పలో నివాసముండే ఎండీ ఇలియాజ్ (21), మిర్బాస్‌ఖాన్ (22), నదీమ్ (23), అమీర్‌ఖాన్(20), ముజాహిద్ (25) స్నేహితులు. ఈనెల 20, 21, 22 తేదీల్లో అనంతగిరి వైపు వచ్చిన పర్యాటకులను కత్తితో బెదిరించి పది గ్రాముల గొలుసు, ఐదు గ్రాముల ఉంగరం, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. నవంబర్ ఆరో తేదీన ఎన్టీఆర్ కూడలి నుండి వెళ్తున్న బస్సులో మహిళ మెడలోంచి గొలుసును దొంగిలించారు. అనంతగిరి ప్రాంతంలో జరిగిన దోపిడీలపై ఫిర్యాదు రావడంతో గస్తీ పెంచడం, నిఘా పెట్టడం, బ్లూకోట్ పెట్రోలింగ్ పెంచారు. జిల్లా కేంద్రంలోని మహాశక్తి కూడలి వద్ద అనుమానితులున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించడంతో బెదిరించి దోచుకున్నది ఈ ఐదుగురనని తేలింది. 48 గంటల్లోనే దోపిడీకి పాల్పడిన వారిని పట్టుకుని, సొమ్మును రికవరీ చేశారు. ఐదుగురిపై రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
పర్యాటకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళరాదని సూచించారు. అనంతగిరి ప్రాంతంలో 20 సీసీ కెమెరాలతో పాటు పోలీసు అధికారుల నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేసులను ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు కానిస్టేబుళ్ళు శివ, బాలు, సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ సురేష్‌ను అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ సంయుజ్జమ ఉన్నారు.