రంగారెడ్డి

శ్మశానవాటిక కోసం మృతదేహంతో రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, డిసెంబర్ 7: తాగునీటి సౌకర్యం కోసం.. రోడ్డు సౌకర్యం కోసం.. ఆందోళనలు చేయడం చూశాం... కానీ మృతిచెందిన వ్యక్తి దహనానికి స్థలం కేటాయంచాలని నిరసన చేయడం ఎక్కడా చూసి ఉండం.. అదే జరిగింది వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో.. శ్మశాన వాటిక లేకపోతే దహన సంస్కారాలు ఎక్కడ చేయాలంటూ నిరసన తెలుపుతూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. ధారూర్ మండల పరిధిలోని కెరెళ్ళి గ్రామంలో గురువారం తెల్లవారుఝామున బాయమ్మొల్ల బుచ్చిరెడ్డి (88) అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు స్థలం లేదు. గతంలో దహన సంస్కారాలు నిర్వహించే స్థలం విషయంలో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి హైకోర్టు వరకు వెళ్ళారు. దీంతో హైకోర్టు స్టేటస్‌కో విధించింది. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు, ధారూర్ తహశీల్దార్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ దివ్య స్వయంగా శ్మశానవాటిక స్థలాన్ని పరిశీలించారు. కానీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో గ్రామంలో ఓ వర్గం వారికి శ్మశానవాటిక స్థలం లేకుండా పోయింది. దీంతో గురువారం గ్రామంలో సదరు వర్గానికి చెందిన వారు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వికారాబాద్ - తాండూర్ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ధారూర్ సిఐ ఉపేందర్, గిర్థావర్ యాదయ్యలు వెళ్ళి సముదాయించే ప్రయత్నం చేసినా వినపించుకోలేదు. వికారాబాద్ డిఎస్పీ శిరీష రంగంలోకి దిగి కలెక్టర్‌తో మాట్లాడి దహన సంస్కారాలు గతంలో కేటాయంచిన సర్వే నెంబర్ 17లోనే దహన సంస్కారాలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. మృతదేహాన్ని వారికి కేటాయించిన స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించడంతో కథ సుఖాంతమైంది.

హోటల్ యాజమాన్యాలు బయోడైజస్టర్‌ను వినియోగించాలి

* డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ
హయత్‌నగర్, డిసెంబర్ 7: హోటళ్లలో మిగిలిపోయిన వ్యర్థాల నుండి బయోగ్యాస్‌ను తయారు చేసుకోవాలని ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి హోటల్ నిర్వాహకులు, పెద్ద అపార్ట్‌మెంట్‌వాసులు బయోడైజస్టర్‌ను వినియోగించాలని సూచించారు. గురువారం కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో హోటల్ నిర్వాహకులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులకు బయోడైజస్టర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మాట్లాడుతూ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని గత సంవత్సరమే అమలులోకి తెచ్చిందని.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు.