రంగారెడ్డి

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 11: బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వసంత్‌కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ అత్తాపూర్ డివిజన్ కార్యవర్గ సమావేశం హైదర్‌గూడలోని పార్టీ కార్యాలయంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాబాద విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వసంత్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుంచి కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతోందున్నారు. కానీ వాటిని ప్రశ్నించే నాయకులు లేరని తెలిపారు. అందుకే బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసే ఏ నాయకుడికీ అధికారాన్ని కొనసాగించే అధికారం ఉండదని, అలాంటి నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. బీజేపీతోనే రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధి సాధ్యవౌతుందని, నాయకులు, కార్యకర్తలు బీజేపీని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తూ నాయకులలో ఉత్సాహం నింపాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వై.శ్రీ్ధర్, ఎన్.మల్లారెడ్డి, కొమరయ్య, సులిగె వెంకటేష్, కే. ఉమామహేశ్వరిరెడ్డి, నాగమణి, రాచూరి రాజశేఖర్, గొరిగె రాజు, వినోద్‌కుమార్, జాంగిడ్, రావుల జనార్దన్, లక్ష్మికాంత్ వ్యాస్, సులిగె మల్లేష్, నల్లింగు రమేష్, ఎస్. నరేష్, ఎన్.రాజమల్లయ్య, లక్ష్మణ్‌రావు, రమేష్ శర్మ, కే.జయప్రకాష్‌రెడ్డి, శ్రీకాంత్‌చారి, పంతంరాజు, విమల్‌శర్మ, నరహరి, ఎస్.సతీష్, ఎస్.శ్రావణ్, కే.జగన్నాథ్‌రెడ్డి, వేణు, ప్రవీణ్ పాల్గొన్నారు.

ఫిబ్రవరి నాటికి ఇంటింటికీ తాగునీరు

షాద్‌నగర్, డిసెంబర్ 11: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ సంప్ నిర్మాణం పనులను హైదరాబాద్ ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ సురేందర్‌రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో అధికారులు వేగం పెంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తాగునీటిని అందించేందుకు కృషి చేయాలని అన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతి మంగళవారం అధికారులతో రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ నీటి ట్యాంకుల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. పైపులైన్ నిర్మాణం పనులు ఇప్పటికే 75 శాతం పూర్తి అయ్యాయని, ఫిబ్రవరి నాటికి 25 శాతం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకం పనుల పట్ల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. హైదరాబాద్ ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కమ్మదనం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సంప్ నిర్మాణాలు దాదాతు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. మొదటి ప్రాధాన్యత మిషన్ భగీరథ పథకానికే ఇస్తున్నట్లు, నిరంతరం పనులు కొనసాగుతునే ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ సీఇ కృపాకర్‌రెడ్డి, ఎస్‌ఈలు చిన్నారెడ్డి, ఆంజనేయులు, ఈఈలు సీతారాంరెడ్డి, వెంకట్మ్రణ, డీఈలు పద్మలత, జయశ్రీ, ఫరూఖ్‌నగర్ మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు.