రంగారెడ్డి

ఘరానా దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 11: నాలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురిని తాండూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 6.92 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విలేఖరుల సమావేశంలో ఎస్పీ టీ.అన్నపూర్ణ కధనం ప్రకారం.. కర్ణాటక జిల్లా గుల్బర్గా జిల్లా బాపునగర్‌కు చెందిన జయశ్రీ, యువరాజ్ కమిడ్లే, దేవరాజ్ కమిడ్లే, సుబ్బబాయి కమిడ్లే బంధువులు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని పట్టపగలు బంగారం, వెండి, నగదును దోచుకెళ్తుంటారు. ముందుగా వారు ఓ పట్టణాన్ని ఎంచుకుని రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్ళను ఎంచుకుంటారు.
ప్లాస్టిక్ కవర్లు ఏరుతున్నట్లుగా నటిస్తూ గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్ళను గుర్తిస్తారు.
ఆ తర్వాత వారిలోని ఓ మహిళ ప్రహరీ దూకి తలుపుకున్న తాళాన్ని వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ లేదా స్కూడ్రైవర్‌తో పగలగొడుతుంది, ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలను వెంట తెచ్చుకున్న తాళం చెవులతో తీసి, అందులోని బంగారు, వెండి నగలు, నగదును తీసుకుని బయటకు వచ్చేందుకు సిద్ధవౌతుంది. బయట ఉన్న వారి సైగల ఆధారంగా ఆమె బయటకు వస్తుంది. దొంగతానికి తెచ్చే రాడ్, స్కూడ్రైవర్, తాళంచెవిలు కనిపించకుండా వాటిపై కూరగాయలు, బట్టలు వేసి కప్పుకుని సంచిలో తరలిస్తుంటారు.
సోమవారం రైల్వేస్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగతుండగా పోలీసులు నలుగురిని పట్టుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడింది.
తాండూర్ పోలిస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఏడు కేసుల్లో రూ 6.92 లక్షల విలువైన 220 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై తెలంగాణలో ఏడు కేసులతో పాటు కర్ణాటకలో ఎనిమిది, మహారాష్టల్రో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తాండూర్ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన సీఐ కే.ప్రతాపలింగం, ఎస్‌ఐ ఎం.సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వీ.వెంకటేశ్, పోలీసు కానిస్టేబుళ్ళు రామకృష్ణ, దస్తప్ప, కృష్ణారెడ్డి, శివకుమార్, అంజప్ప, సుజాత, అనంతమ్మలను అభినందించిన ఎస్పీ రివార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిపై సస్పెక్ట్‌షీట్స్ తెరుస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలకోసారి దొంగతనాలకు పాల్పడతారని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు పాల్గొన్నారు.