రంగారెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీక హస్తకళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, డిసెంబర్ 17: ఎఎస్‌రావునగర్ సొసైటీ గ్రౌండ్‌లో చేనేత, హ్యాండ్ లూమ్ హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ మహిళలను ఎంతగానో ఆకట్టుకొంటోంది. ఎగ్జిబిషన్ డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలకు ఉదయం 10గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ప్రజల ఆభిరుచులకు అనుకూలంగా ఉంటుందని నిర్వాహకులు నవీన్ కుమార్ తెలిపారు. హస్తకళల ఎగ్జిబిషన్‌లో పోచంపల్లి, నారాయణ్‌పేట, ఉప్పాడ, మంగళగిరి, కళంకారీ చీరలు, మహిళలను అమితంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ముఖ్యంగా ఖాదీ, ఫ్యాన్సీ, ఖాదీ కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్, కాంత్ వర్క్ కాటన్ చీరలు, భాగాల్‌పూర్ సిల్క్, బాంద్‌ని సిల్క్, గుజరాత్ డిజైన్, టాప్స్, లక్నో చికన్ వర్క్ డిజైన్ మెటీరియల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రదర్శనలో గృహోపకారణాలకు సంబంధించిన డోర్ కర్టెన్‌లు, డోర్‌మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్‌షీట్స్, రాజస్థానీ ప్రింటెడ్ టాప్స్, జైపూర్ టాప్స్, జైపూర్ బెడ్‌షీట్స్ ఖాదీ షర్ట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళల కోసం వన్‌గ్రామ్ గోల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. హస్తకళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎగ్జిబిషన్‌తో చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి
షాద్‌నగర్, డిసెంబర్ 17: బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో సోషల్ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. గ్రామీణ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటి ప్రాముఖ్యతను గడపగడపకు వివరించేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా అనేది మంచి పనులకు మాత్రమే వినియోగించుకోవాలే తప్పా చెడు పనులకు ఏమాత్రం ఉపయోగించరాదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి, బీజెపీ ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాలచారి, నందిగామ వెంకటేష్, ఎ.నర్సింహ పాల్గొన్నారు.

రెండు ద్వి చక్రాలు ఢీ: ఒకరి మృతి
శామీర్‌పేట, డిసెంబర్ 17: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్వి చక్రాలు ఢీ కొట్టుకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం కొల్తూరు గ్రామానికి చెందిన కృష్ణ (25) మూడు చింతపల్లిలోని పెట్రోల్ పంప్‌కు వెళ్లి వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన నూర్ అహ్మద్ ఎదురుగా వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణ అక్కడిక్కడే మృతి చెందగా నూర్ అహ్మద్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నూర్ అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును శామీర్‌పేట పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.