రంగారెడ్డి

టిఆర్‌ఎస్ చేసింది శూన్యం: ఉమా మాధవరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 17: ఎల్బీనగర్ నియోజకవర్గంలో టిడిపి, బిజెపి అభ్యర్థులు విజయం సాధించి తమ సత్తాను చాటడం ఖాయమని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మన్సురాబాద్ డివిజన్ టిడిపి అభ్యర్థి కొప్పుల నర్సింహ్మారెడ్డిని గెలిపించాలని డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్ అభ్యర్థిగా ఐదు ఏళ్లు పనిచేసిన అపారమైన అనుభవం కలిగిన కొప్పుల నర్సింహ్మారెడ్డిని గెలిపించాలని కోరారు. హైదరాబాద్ నగరం టిడిపి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందే తప్పా టిఆర్‌ఎస్ పార్టీ చేసింది ఏమీలేదని చెప్పారు. కొప్పుల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఐదు ఏళ్ళకాలంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. కార్పొరేటర్ అయ్యే వ్యక్తికి అవగాహన ఉంటే కాలనీల అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. తాము నిర్వహిస్తున్న ప్రచారంలో స్థానిక ప్రజలు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ రంగారెడ్డి, అశోక్ అప్ప, రమేష్, కోటయ్య, డా. లక్ష్మిలు పాల్గొన్నారు.
బిసిలను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు: కృష్ణయ్య
ఇబ్రహీంపట్నం, జనవరి 17: తెరాస ప్రభుత్వం ఎన్నికలకు ముందు బిసిలకు ఇచ్చిన హామీలను ఈ ఆర్థిక సంత్సరంలోనైనా నెరవేర్చాలని, అలా కాదని బిసిలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ బిసి ఫ్రంట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను బిసి ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్‌యాదవ్‌తో కలిసి ఆదివారం నగరంలోని బిసి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి సమస్యల పరిష్కారం, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల నెరవేర్పును ముఖ్యమంత్రి చేతల్లో చూపించాలని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బిసిల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం బిసిలకు ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 112 బిసి కులాలు, 52 శాతం జనాభా కలిగిన బిసిలకు కేవలం 2,172 కోట్ల రూపాయలు కేటాయించి బిసిలకు మొండిచెయ్యి చూపించారని ధ్వజమెత్తారు. బిసిలకు పదివేల కోట్ల రూపాయలతో బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు బిసిలకు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చాలని, లేని పక్షంలో ఈ యేడు బిసిల పక్షాన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి ఫ్రంట్ నాయకులు గుజ్జ కృష్ణ, బోడ శ్రీనివాస్, ర్యాగ రమేష్, జె శ్రీనివాస్‌గౌడ్, నరేష్, వెంకటాచారి, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.

అల్వాల్‌లో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్‌లు
అల్వాల్, జనవరి 17: అల్వాల్ సర్కిల్ 16 పరిథిలో నామినేషన్‌ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అందరు నామినేషన్‌లు వేశారు . పూర్తిస్థాయిలో అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవటంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ముగ్గురు నలుగురు చొప్పున అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. 133 మచ్చబొల్లారం ఎస్సీ జనరల్ 12 మంది, 134 అల్వాల్ మహిళ జనరల్‌లో 11 మంది, 135 వెంకటాపురం ఎస్సీ జనరల్‌లో 13 మంది మొత్తం 36 మంది 61 సెట్‌ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 133 మచ్చబొల్లారంలో ఎ. శ్రీకాంత్, సిఎల్.యాదగిరి, యస్ భానుప్రకాష్, ఎన్.లక్ష్మీకాంత్, ఎన్.చిట్టిబాబు, యస్‌బి.ప్రవీణ్, సి.్భగ్యవతి, ఎంవి.సూర్యకిరణ్