రంగారెడ్డి

కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి: కేటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 20: నగరంలోని కాలనీలలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు హామీనిచ్చారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీతోపాటు కోర్టు వివాదంలో వున్న 9 కాలనీలకు చెందిన కాలనీవాసులు టిఆర్‌ఎస్ నాయకుడు వాసు ఆధ్వర్యంలో సిఎం క్యాంప్ ఆఫీసులో మంత్రి కెటిఆర్‌ని కలిసారు. అయ్యప్ప సొసైటీ, రవీంద్ర సొసైటీ, కాకతీయ హిల్స్, సైబర్‌హిల్స్, మెగాహిల్స్, అరుణోదయ కాలనీ, మాతృశ్రీ నగర్, గోకుల్ ఫ్లాట్స్, గురుకుల్ ఫ్లాట్స్ వాసులు తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. తమ కాలనీలలో స్థానికేతరులు విద్యావంతులు అధికంగా ఉన్నారని మాదాపూర్ డివిజన్ పరిధిలో తమ కాలనీలు వున్నాయని మంత్రికి సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఎంతో బాగున్నాయని రాబోవు గ్రేటర్ ఎన్నికల్లో అందరం జగదీశ్వర్‌గౌడ్‌ని గెలిపిస్తామని తెలిపారు. గురుకుల్ ట్రస్ట్‌లో వున్న అయ్యప్ప సొసైటీ కాలనీలో వసతులు మెరుగుపరచాలని మంత్రిని కోరారు. నగరంలో శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేస్తున్నామని రెండు మూడు నెలల సమయం పడుతుందని మంత్రి తెలిపారు. కాలనీలో విద్యుత్, నీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యతోపాటు అధికారులతో మాట్లాడి ఇండ్లను క్రమబద్ధీకరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపి సీతారామ్‌నాయక్ మాదాపూర్ డివిజన్ కాలనీలకు చెందిన భరత్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కె.వి.రావు, కోటేశ్వరరావు, కావూరి అనిల్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.