రంగారెడ్డి

వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 6: వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు శ్రీ రంగనాథస్వామి దేవస్థానం అర్చకులు శేషాచారి తెలిపారు. కార్వాన్ నియోజకవర్గం జియాగూడ శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రంగనాథస్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈనెల 8న వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని స్వామివారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సుమారు రెండునుంచి మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఏకాదశి పండుగ పురస్కరించుకుని దేవాలయంలో అన్ని ఏర్పాట్లను వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో లైటింగ్, పువ్వులు, పండ్లతో దేవాలయం ఆలంకరణ భారీఎత్తున చేస్తున్నట్టు తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ప్రతి ఒక్కరూ క్యూలైన్లు పాటిస్తే అందరికీ స్వామి దర్శనం అవుతుందని పేర్కొన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం అని తెలిపారు. కాగా స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారని, అందుకోసం స్వామివారి దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఆలయంలోని ఏర్పాట్లు విషయంపై వచ్చి సమీక్షించారని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు కూడా దేవాలయానికి వచ్చి ఏర్పాట్ల విషయంపై ఇప్పటికే చర్చించినట్టు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా దేవాలయం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా స్థానిక ఇన్‌స్పెక్టర్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారని పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
మేడ్చల్, జనవరి 6: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న జీఓ 123 ద్వారా భూములు సేకరించరాదని తాజగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి చిట్టిమిల్ల రాగజ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మేడ్చల్‌లో మాట్లాడుతూ ఇక మీదట భూసేకరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 2013 జీఓ ప్రకారం మాత్రమే భూసేకరణ జరుపాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు జీఓకు అనుగుణంగా బాధితులకు పరిహారం చెల్లించాలని సూచించిందని వివరించారు. హైకోర్టు తాజ ఆదేశాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆమె సూచించారు. మొండిగా పంతానికి పోకుండా 2013 జీఓ ద్వారా భూసేరకణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూములు కోల్పోతున్న రైతులకే కాకుండా ఆ భూములపై ఆధారపడ్డ కూలీలకు న్యాయం జరిగే విధంగా చట్టం రూపొందించారన్నారు. భూసేకరణ చట్టం రూపొందించబడిన సమయంలో ఎంపిగా సమర్ధించిన కెసిఆర్ ఇప్పుడు ఈ చట్టాన్నికాదని 123 జీఓ తెచ్చి భూకరణ చేపట్టాలని చూడటం దుర్మార్గమని ఆమె దుయ్యబట్టారు. 123 జీఓ రైతులు, రైతుకూలీల పాలిట శాపంలాంటిదని విమర్శించారు.
ఇది పూర్తిగా రైతుల విజయమని భూములను బలవంతంగా లాక్కోవడాన్ని కాంగ్రెస్ మొదటి నుండి వ్యతిరేకిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ప్రభుత్వం చేసే భూసేకరణ పద్ధతులకు మాత్రమే వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే ఏ ప్రభుత్వానికైనా ఎదురుదెబ్బలు ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా కళ్లుతెరిచి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి వారి మనోభావాలకనుగుణంగా పని చేయాలని ఆమె హితవు పలికారు.