రంగారెడ్డి

భక్తులతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 8: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఘట్‌కేసర్ మండలంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు వేలాది మంది భక్తులతో ఆదివారం కిటకిటలాడాయి. మండల కేంద్రం బాలాజీనగర్‌లోని గీతామందిర్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, వేమానగర్‌లోని శ్రీవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయం, యంనంపేట్‌లోని శ్రీరంగనాధ వేంకటేశ్వరస్వామి, వెంకటాపూర్ గ్రామంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి, ఎన్‌ఎఫ్‌సినగర్‌లోని శ్రీవిశే్వశ్వరగిరి వేంకటేశ్వరస్వామి, ఎదులాబాద్‌లోని శ్రీగోదా సమేత శ్రీరంగనాయకస్వామి ఆలయాలలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే భక్తులు స్నానమాచరించి నూతన వస్త్రాలు దరించి స్వామి వారికి, పూలు, పండ్లు, పలహారాలు తీసుకువచ్చి సమర్పించారు.ఆలయానికి చేరుకుని ఆలయ ప్రదక్షిణలు జరిపి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. వైకుంఠ ఏకాదశి రోజున నిద్ర నుండి లేచిన శ్రీమన్నారాయణుని ముక్కోటి దేవతలు దర్శిస్తారని, స్వామి మేల్కొనుట గురించి తెలిసిన విష్యక్సేనాదులు వైకుంఠ ద్వారం తెరుస్తారని ఈ ద్వారమునే ఉత్తర ద్వారమని భక్తుల ప్రగాఢ విశ్వాసం, ముక్కోటి దేవతలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం ద్వార దర్శించుకుంటారని, ఈ రోజు స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఒకేసారి ముక్కోటి దేవతలను దర్శించున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, ఎదులాబాద్ సర్పంచ్ మూసి శంకర్, యంనంపేట్ సర్పంచ్ పోలగోని అరుణ శివకుమార్‌గౌడ్, వెంకటాపురం సర్పంచ్ నాగపూరి కృష్ణవేణి నర్సింగ్‌రావు, కొర్రెముల సర్పంచ్ బైనగారి నాగరాజు, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ సర్పంచ్ గొంగళ్ల మాధవి బాలేశం, ఎంపిటిసి లు మేకల నర్సింగ్‌రావు, నర్రి శ్రీశైలం, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ గొంగళ్ల స్వామి, మాజి చైర్మన్ సార శ్రీనివాస్‌గౌడ్, డైరక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, సంస్కృతి టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్‌రావు, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి తరిణే మహింధ్రాచారి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, మండల బిజెపి అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. నాయకులు పత్తెపు పోశేట్టి, శ్రీహరి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
హయత్‌నగర్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లింగోజిగూడ, చంపాపేట్, హయత్‌నగర్‌లోని శ్రీవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఉదయం నుండి ఆలయాల వద్ద భక్తులు ఉత్తర ద్వారంగుండా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. లింగోగూడ డివిజన్‌లోని గ్రీన్‌పార్క్‌కాలనీ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో స్థానిక కార్పోరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. చంపాపేట్ డివిజన్‌లోని గోదాసమేత శ్రీవెంకటేశ్వస్వామి ఆలయంలో కార్పోరేటర్ సామ రమణారెడ్డి స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం పల్లకిసేవలో పాల్గొన్నారు.
జీడిమెట్ల: వైకుంఠ ఏకాదశి కావడంతో దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలు భక్తుల క్యూలైన్లతో కిక్కిరిసిపోయాయి. జగద్గిరిగుట్టపైని శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి, గాజులరామారం, ఉషోదయకాలనీ, చింతల్, వెనె్నలగడ్డ, కుత్బుల్లాపూర్ గ్రామం, సూరారం, పద్మానగర్, షాపూర్‌నగర్, గాంధీనగర్, నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట్, దుందిగల్, బౌరంపేట్, దొమ్మరపోచంపల్లి, గాగిల్లాపూర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయాలు, శివాలయాలు, సాయిబాబా, రామాలయాలు తదితర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఉత్తర ద్వారం నుండి బయటికి వచ్చారు.
షాద్‌నగర్: ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవంగా సాగాయి. ఆదివారం ముక్కోటి ఏకాదశి పర్వదిన సంధర్భంగా ఉత్తర ద్వారం నుండి భక్తులు, ప్రజాప్రతినిధులు ముక్కోటి దేవతలను దర్శించుకున్నారు. షాద్‌నగర్ పురపాలిక సంఘం పరిధిలోని జానంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహబూబ్‌నగర్ ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి, స్థానిక శాసన సభ్యులు ఎల్గనమోని అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింలు ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా పంపించేందుకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా ట్రాఫిక్ నియంత్రించేందుకు ఏఎస్సైతోపాటు సిబ్బందిని ఏర్పాటు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ, చౌదరిగూడ మండలాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే ఏడాది మొత్తం శుభం జరుగుతుందనే ప్రగాఢ నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో ఆయా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. నగరపంచాయతీ పరిధితో పాటు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోని దేవాలయాల్లోభక్తులు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఈశ్వరాంజనేయస్వామి, నృసింహస్వామి, త్రిశక్తి, నరసింహస్వామి దేవాలయాలతో పాటు పలు దేవలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆయా దేవాలయాల్లో హోమాలు, ప్రవచనాలు నిర్వహించారు.
మహేశ్వరం: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మహేశ్వరం మండల పరిధిలోని శ్రీనగర్, అమీర్‌పేట్ గ్రామాలలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి, శ్రీగోదా సమేత పద్మావతీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు చేశారు. శ్రీనగర్‌లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, వి.సుధాకర్‌శర్మ, బోసుపల్లి ప్రతాప్, కె.జంగయ్యయాదవ్, ఆర్.మదన్‌మోహన్‌గుప్త, వెంకటేశ్‌గౌడ్, జి.అశోక్, జి.దేవేందర్, అమీర్‌పేట్ ఆలయ కమిటీ సభ్యులు పి.రామప్ప, శంకరయ్య, చాకలి యాదయ్య, నారాయణ ఉన్నారు.
బాలానగర్: ముక్కోటి ఏకదశి పర్వదినం సందర్భంగా ఫతేనగర్ డివిజన్ పరిధిలొని భరత్‌నగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్, మూసాపేట కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు వేణు, ఉమాపతిగౌడ్, జ్యోతి, విజయలక్ష్మీ, ఉమారాణి, సురేందర్ నాయుడు, రవిగౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కెపిహెచ్‌బికాలనీ: కూకట్‌పల్లి శాఖ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీజగన్నాధ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశృంగదాస్ ఆధ్వర్యంలో హైదర్‌నగర్ భ్రమరాంభ మల్లిఖార్జున ఆలయం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా కెపిహెచ్‌బికాలనీ మెట్రో వరకు కొనసాగింది. యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనేక వేషాదారణలతో శ్రీకృష్ణనామం స్మరించుకుంటూ భక్తిపారవశ్యంతో నృత్యాలు చేశారు. దారి పొడవున అనేక మంది భక్తులు రధం తాళ్లను లాగడానికి పోటీపడ్డారు. జగన్నాధ రథయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరారు. రథయాత్ర అనంతరం పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు.