రంగారెడ్డి

18 సంవత్సరాలు నిండిన వారికి ఎపిక్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 19: జాతీయ ఓటరు దినోత్సవం జనవరి 25 సందర్భంగా బూత్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో 18 సంవత్సరాలు నిండిన వారిక ఎపిక్ కార్డులను పంపిణీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సూచించారు. గురువారం సచివాలయం నుండి నిర్వహించిన ఓటరు దినోత్సవంపై చీఫ్ ఎలక్షన్ అధికారి విడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా సబ్‌కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దివ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఇవో మాట్లాడుతూ ఓటరు దినోత్సవం సందర్భంగా జనవరి 21న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని చెప్పారు. ఏడవ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్తఓటర్లు, వయోవృద్ధులకు సన్మానం, వయోజనులు (18సంవత్సరాలు నిండిన వారికి) ఇంటింటికీ ఎపిక్ కార్డుల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. ఫారం 6, 7, 8, 8(ఎ) సంబంధించిన ఓటరు నమోదు మార్పులు, పేరుమార్పిడి, పోస్టల్ మార్పులు వెంటనే బూత్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలని అన్నారు. ఇల్లా స్థాయిలో జనవరి 21న ఓటు ప్రాముఖ్యతపై పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో జనవరి 25న రంగోలి, ర్యాలీ, మానవహారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు, వయోవృద్ధులకు సన్మానం నిర్వహిస్తామని చెప్పారు. ఫారం 7, 8, 8(ఎ) త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఉత్తమ బూత్ స్థాయి అధికారి, ఎఇఆర్‌వో, ఇఆర్‌వో(ఎన్నికల రిటర్నింగ్ అధికారి) పేర్లను పంపిస్తామని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్, తాండూర్, పరిగికి సబ్‌కలెక్టర్, వికారాబాద్‌కు డిఆర్‌వోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, డిఆర్‌వో సంధ్యారాణి, డిఆర్‌డివో జాన్సన్ పాల్గొన్నారు.

శాస్ర్తియపరంగా విభజన ప్రక్రియ చేపట టలేదు
షాద్‌నగర్, జనవరి 19: జిల్లాలను, మండలాలను శాస్ర్తియ పరంగా విభజన చేపట్టలేదని టిజెఏసి చైర్మన్ కోదండరాం ఆరోపించారు. మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలు గురువారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. దీక్షకు టిజెఏసి చైర్మన్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం పద్ధతి ప్రకారం మండలాలను ఏర్పాటు చేయకుండా ఇష్టారాజ్యంగా విభజన ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. మొగిలిగిద్ద గ్రామ పంచాయతీలో 30వేల జనాభా ఉన్నప్పటికి మండల కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజకీయ నేతల నిర్లక్ష్య వైఖరితోనే మొగిలిగిద్ద మండల కేంద్రం కాలేకపోయిందని ఆరోపించారు. 100రోజులుగా శాంతియుతరంగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న ఒక్క అధికారి కూడా రాకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలనే పూర్తిగా విస్మరిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో మొగిలిగిద్ద లాంటి మరికొన్ని మండలాలు ఉన్నాయని, వాటన్నింటిపై త్వరలోనే హైదారాబాద్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేయనున్నట్లు హెచ్చరించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో టిఆర్‌ఎస్ వెనకడుగు వేస్తే టిజెఏసి మాత్రం ముందడుగు వేసి తెలంగాణను సాధించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మనమే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. సమైఖ్య ఆంధ్రా రాష్ట్రంలో ఆంధ్రులను తిట్టేవారం.. కానీ, స్వరాష్ట్రంలో మనకు మనమే తిట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. రాష్ట్రం రావడమే సంతోషం కాదు.. ప్రజలకు సురక్షితమైన పాలన అందిస్తేనే సంతోషమని పేర్కొన్నారు. మొగిలిగిద్దను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
మండల కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తా
మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తానని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం రిలే నిరహార దీక్షలు చేస్తున్న శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిజెఏసి అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రాఘవచారి, టిజి శ్రీనివాస్, సర్పంచ్ బాలమణి, శ్యాంసుందర్, అన్మారి వెంకటయ్య, కక్కునూరి వెంకటేష్‌గుప్త, లింగం, సూర్యప్రకాష్, అందె బాబయ్య పాల్గొన్నారు.