రంగారెడ్డి

పెరుగుతున్న బాధితుల ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 22: సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కటకటాల పాలైన సంగతి తెలిసిందే. స.హ.చ అస్త్రంగా చేసుకున్న ఇద్దరు నిందితులకు బాధితులు పెరుగుతున్నారు. ఆర్‌టిఐ కింద ప్రైవేటు పాఠశాలలకు వివరాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. చింతల్‌కు చెందిన ఉపేంద్రచారి, జగద్గిరిగుట్ట డివిజన్ భగత్‌సింగ్ మార్గ్‌కు చెందిన మధుబాబును జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించి రెండు రోజులు గడుస్తున్న తరుణంలో రోజురోజుకి వారి బాధితులు పెరుగుతున్నారు. ఆర్‌టిఐ కింద దరఖాస్తు చేసుకుని డబ్బులను డిమాండ్ చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్‌ను కుత్బుల్లాపూర్ మండల రికగ్నైజ్‌డ్ పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్ సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. సుమారు 82 మంది ప్రైవేటు పాఠశాలలకు ఆర్‌టిఐ కింద దరఖాస్తులను పంపించి తమను బెదిరించినట్లు డిసిపికి వివరించినట్లు కరస్పాండెంట్‌లు తెలిపారు. బాలానగర్ ఏసిపి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట సిఐలకు పలు ప్రైవేటు పాఠశాలల యజమానులు ఫిర్యాదు చేశారు. మధుబాబు వేధించారని పద్మానగర్ ఫేజ్-2లో నిర్భయ హైస్కూల్ యాజమాని పవన్‌కుమార్, వల్లభాయ్ పటేల్ నగర్‌లోని పటేల్ హైస్కూల్ యజమాని వరప్రసాద్ ఆదివారం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మధుబాబు తాను సోషల్ వర్కర్‌నని విరాళాలు ఇవ్వాలని కోరగా కొన్నిసార్లు ఇచ్చామని పవన్ కుమార్ తెలిపారు. ఆ తరువాత 22-11-2016 ఆర్‌టిఐ ద్వారా ఎంఇఓకు స్కూల్‌పై దరఖాస్తు చేశాడని, పిటిషన్ ఉపసంహరణకు రూ.లక్ష ఇవ్వాలని అనుచరుడైన బిక్యానాయక్‌తో కలిసి మధుబాబు ఒత్తిడి చేశాడని పవన్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పటేల్ హైస్కూల్‌పై 22-11-2016 డిఇఓ, ఎంఇఓలకు ఆర్‌టిఐ కింద మధుబాబు అనుచరుడు బిక్యానాయక్‌తో కలిసి పిటీషన్ వేశారని, మరో అనుచరుడు పరమేశ్‌తో 04-01-2017 జిహెచ్‌ఎంసిలో ఆర్‌టిఐ ద్వారా పిటిషన్ వేసి ఉపసంహరణకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని స్కూల్ యజమాని వరప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధుబాబు, అనుచరులను శిక్షించాలని ఎస్సై లింగ్యానాయక్‌కు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండల రికగ్నైజ్‌డ్ పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ ఆర్‌టిఐని ఉపయోగించుకుని మధుబాబు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రైవేటు పాఠశాలల యాజమానులను వేధించడంతో పాటు బిల్డింగ్ నిర్మాణదారులను సైతం బెదిరింపులకు గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనుల పండువగా
విద్యార్థుల నృత్య ప్రదర్శన

* హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు
వనస్థలిపురం, జనవరి 22: వనస్థలిపురం ఎన్‌జిఓస్ కాలనీలోని ఛత్రపతి శివాజి గ్రౌండ్‌లో ఆదివారం ప్రదర్శించిన లావని డాన్స్ అదరహో అనిపించింది. పలు రాష్రాల నుంచి 600మంది విద్యార్థులు ఒకేసారి నృత్య ప్రదర్శనలో పాల్గొన్ని భిన్న సంస్కృతులకు సంబంధించిన లావని డాన్స్‌లు చేశారు. ఈ నృత్యానికి హైరేంజ్ బుక్కు ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కింది. అనూస్ అకాడమీ అధ్యక్షురాలు వేదకీర్తి, నీలిమా నృత్యాంజలి అధ్యక్షురాలు లక్ష్మీ జగదీశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని హైరేంజ్ బుక్కు ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి శ్రీకాంత్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి జయంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ రసమయి బాలకృష్ణ, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గౌడ్ , ఎస్‌ఐ కృష్ణంరాజు హాజరై ప్రసంగించారు. అనంతరం హైరేంజ్ బుక్కు ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు.