రంగారెడ్డి

‘మీర్‌పేట్‌ను దత్తత తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 22: మీర్‌పేట్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.150 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. మీర్‌పేట్ తాను జన్మించిన గ్రామం అయినందున, మీర్‌పేట్‌ను దత్తత తీసుకొని నియోజకవర్గంలోనే ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆదివారం మీర్‌పేట్ నగర పంచాయతీ లెనిన్‌నగర్ కాలనీవాసులకు నూతనంగా నిర్మాణం చేయనున్న సామూహిక మరుగుదొడ్ల పనులను ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా ప్రాంభించారు. లెనిన్‌నగర్ గుడిసెవాసుల కోసం రూ.19 లక్షల నిధులతో 20 టాయిలెట్లను నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. లెనిన్‌నగర్ గుడిసె వాసులకు మరుగుదొడ్లు లేక మల, మూత్ర విసర్జనకు బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నాన్నారని తెలిపారు. దీంతో సమీప పరిసరాలు అపరి శుభ్రంగా మారుతుండంతో, అధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడి ప్రజలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపినట్టు అన్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా మీర్‌పేట్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. లెనిన్‌నగర్ గుడిసెవాసులకు ఇక్కడే ఇళ్లను నిర్మించి ఇస్తామని, కొంతకాలం వేచివుండాలని అన్నారు. మొట్టమొదటగా డబూల్ బెడ్ రూం ఇళ్లను లెనిన్‌నగర్ వాసులకు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మంచినీటి పైపుల మార్చే నిమిత్తం రూ.14 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మహిళల కోసం షీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. మీర్‌పేట్ కమిషనర్ డి.జగన్, ఎఈ ఆర్.రామోహన్‌రావు, ఎంపిటిసి తీగల రంజిత్‌రెడ్డి, లలిత జగన్ గౌడ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ అవినీతిపై రాష్టవ్య్రాప్త ప్రచారం
వనస్థలిపురం, జనవరి 22: రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి కార్యకలాపాలను ప్రజలకు తెలియజేసి తమ పార్టీ విదివిధానాలు ప్రజలకు చేరేవిధంగా ప్రచారం నిర్వహిస్తామని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అన్ని జిల్లాల నుండి నాయకులు హాజరైనారు. రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1నుంచి రాష్టవ్య్రాప్తంగా పర్యటించి 31 జిల్లాలలో జిల్లా, మండల, గ్రామ స్థాయి అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టంగా తయారు చేయనున్నట్లు చెప్పారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టి టిఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్టవ్య్రాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యం చేసి త్వరలో హైదరాబాద్‌లో 30లక్షల మందితో ప్రజాగర్జన మహాసభను నిర్వహించి తమ సత్తాను చాటుతామని రమేష్ అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పుట్టిన తెలంగాణ లేబర్ పార్టీలో కార్మికులు పెద్దఎత్తున చేరి మద్దతును ప్రకటించి గెలిపించాలని పిలుపు నిచ్చారు. కార్యాక్రమంలో లేబర్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షులు డి.జానకి రామారావు, ప్రధాన కార్యదర్శి కండే రామనాథం గుప్తా, బొర్ర సంపత్ కుమార్ గౌడ్, రామగిరి విజయ్ శంకర్, వి.రమణమూర్తి, అగ్రసేన్ రాంబాబు, రాగాల విజయ్ కుమార్, కె.లక్ష్మీనారాయణ, తుమ్మలపల్లి లక్ష్మీ, శేఖర్ గౌడ్, మంద మురళీధర్ ముదిరాజ్, డా.శ్రీరాములు, ఎన్.సురేందర్ పాల్గొన్నారు.