రంగారెడ్డి

మువ్వనె్నల జెండా రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జనవరి 26:: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని వాడవాడలా మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. గురువారం వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మండల కేంద్రంలోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి కవిత, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ అనీల్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో డిఇఇ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఎఓ వరప్రసాద్‌రెడ్డి, ఐకెపి కార్యాలయంలో ఎపిఓ రవీందర్, అంగన్‌వాడీ కార్యాలయంలో సిడిపిఓ శాంతిశ్రీ, నగరపంచాయతీ కార్యాలయంలో కమీషనర్ ప్రవీణ్‌కుమార్, ఏసిపి కార్యాలయంలో ఏసిపి మల్లారెడ్డి, పోలీస్‌స్టేషన్లో సిఐ స్వామి, ఆర్టీసి డిపోలో మేనేజర్ హేమంత్‌రావు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వివిధ గ్రామాల్లోని గ్రామపంచాయతీల కార్యాలయాలపై ఆయా గ్రామాల సర్పంచ్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్నం మండల పరిషత్ అధ్యక్షులు మర్రి నిరంజన్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
యువత కలిసికట్టుగా దేశ సమగ్రతను ప్రతిభింబించాలని ఎస్‌ఐ ఈరోజీ పిలుపునిచ్చారు. నగరపంచాయతీ పరిధిలో స్ఫూర్తి యువజన సంఘం ఆధ్వర్యంలో జెండావిష్కరణ, జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి యువజన సంఘం అధ్యక్షులు ఎం కార్తీక్‌చారి, కార్యదర్శి చందురెడ్డి, ఇంచార్జీ సురమోని బాబు, సభ్యులు సాయిరాం, జంగారెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
అంబేద్కర్ చిరస్మరణీయుడు
ఎల్‌బినగర్: దేశాభివృద్ధికి రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రగతికి దశ, దిశ చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం 68వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌టిఆర్‌నగర్‌లో నిర్వహించిన జెండా పండుగకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, ఎంఎ సాజిద్, రాజుయాదవ్, గట్ల రవీంద్ర, మధు, అఫ్సర్, దేవేందర్, శివనాయక్, రాజునాయక్, సైదులు, శ్రీనివాస్‌నాయక్, శంకర్‌నాయక్, రాఘవేంద్ర, అక్రం ఉన్నారు.
ఎల్బీనగర్‌లో
వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో 68వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు,ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు, పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు సాంబిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
సెంట్రల్ బ్యాంక్ కాలనీలో..
సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని కాకతీయ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విఠల్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విద్యార్థులు భారి జాతీయ జెండాతో మన్సూరాబాద్ పురవీధులలో ర్యాలీ, సైకిల్ ర్వాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సీతారాంరెడ్డి, వెంకట్ రెడ్డి, డైరెక్టర్ శర్మ, ప్రిన్సిపాల్ శోభారెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు పి.జగదీష్ యాదవ్ పాల్గొన్నారు.
వనస్థలిపురంలో..
వనస్థలిపురంలోని లయోల పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మెన్ రంగినేని వెంకట్‌రావు హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం దేశం కోసం పోరాటం చేసిన మహానుభావుల వేషాలను ధరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్ కోసం చేసిన ఉపన్యాసం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురం లోని కాంప్లెక్స్‌లో జాతీయ జెండాను ఎగర వేశారు. వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి పలు కాలనీలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఎగర వేశారు.
అల్వాల్‌లో
అల్వాల్: అల్వాల్ మున్సిపల్ పరిథిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, మచ్చబొల్లారం కార్పొరెటర్‌లు రాజ్‌జితేంద్రనాథ్, విజయశాంతి రెడ్డి, సబితాకిషోర్, కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ కమిషనరు రమేష్, డిఇ మహేష్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో గణతంత్ర వేడుకలు సిఐ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మచ్చబొల్లారంలో సీనియర్ సిటిజన్స్ నిర్వహించిన కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. గోల్నాక చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

పోలీసుల ఆలస్యంతోనే దినేష్ చౌదరి హత్య
అల్వాల్, జనవరి 26: పోలీసుల ఆలస్యంతోనే దినేష్ చౌదరి మృతిచెందాడని మృతదేహంతో అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా చేశారు. డిసిపి సునీల్ సాయిశేఖర్ వచ్చి చర్చలు చేపట్టి శాఖపరమైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామనీ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. బాధితుల కథనం ప్రకారం ఓల్డ్‌బోయిన్‌పల్లి హస్మత్‌పేటలో చింతల్ పద్మానగర్ కాలనీ సెకండ్ ఫెస్‌లో నివాసం ఉండే దినేష్ చౌదరి(35) మొబైల్ విక్రయం షాపు నడిపిస్తున్నాడు. జనవరి 21న ఉదయం దుకాణం వెళ్లి తిరిగి రాలేదు. అన్ని రకాలైన ప్రయత్నాలు చేసిన తర్వాత బోయిన్‌పల్లి, అల్వాల్, పెట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతడు కనిపించకుండా పోయిన ప్రాంతం అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు వస్తుందని, ఎస్‌ఐ రాంబాబును కలిసి దర్యాప్తు చేయాలని కోరారు. దినేష్ మృతదేహం బుధవారం బోయిన్‌పల్లి నుంచి సుచిత్రా మార్గంలో కనిపించింది. బోయిన్‌పల్లి పోలీసులు బేగంపేట ఏసిపి రంగారావు సందర్శించారు. కానీ అతడు తప్పిపోయిన ప్రాంతం అల్వాల్ కావడంతో సమాచారం అందించారు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం తర్వాత మృతదేహంతో నేరుగా అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నాకు దిగారు. సరిన సమయంలో స్పందించలేదని, కాలయాపన కారణంగానే దినేష్ చౌదరి మృతిచెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ రాంబాబును కలిసి అభ్యర్థించినా పట్టించుకోలేదని అతన్ని సప్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిసిపి సాయి శేఖర్ వచ్చి సమగ్ర విచారణ జరిపించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.