రంగారెడ్డి

నాగారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 4: నాగారం గ్రామంలో అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండిఏ అధికారులు శనివారం కూల్చివేసారు. ఎస్‌వి నగర్, దమ్మాయిగూడ రోడ్డులోని వాటర్‌ట్యాంకు వద్ద నిర్మించిన బహుళ అంతస్తును పాక్షికంగా కూల్చివేసారు. గ్రామంలో మొత్తం 10 బహుళ అంతస్తుల నిర్మాణాలు అక్రమమని పేర్కొన్నారు. మిగిలిన వాటిని త్వరలోనే కూల్చివేస్తామని హెచ్చరించారు. హెచ్‌ఎండిఏ నుండి అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ అధికారులు ఉమాశంకర్, రజిని, శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.
మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి రిమాండ్
ఉప్పల్, ఫిబ్రవరి 4: పీర్జాదిగూడ బుద్ధానగర్‌లో నివసిస్తున్న కవిడ కుమార్ (25) బోడుప్పల్‌కు చెందిన ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారన్న అభియోగంపై అరెస్టు చేసి శనివారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ జగన్నాధ్‌రెడ్డి తెలిపారు.
శివస్వాముల మహాపడిపూజ
కొందుర్గు, ఫిబ్రవరి 4: జ్యోతిర్లింగ మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామంలో గురుస్వామి కమ్మరి భూపాలచారి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ మహాపడిపూజను నిర్వహించారు. మహాపడిపూజలో శివనామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్వాములు యాదయ్య, యాదవరెడ్డి, నర్సింలు, సత్తయ్య, రాజులతోపాటు భక్తులు పాల్గొన్నారు.
పౌష్టిక ఆహారం పంపిణీ
కొందుర్గు, ఫిబ్రవరి 4: చిన్నారులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. శనివారం చౌదరిగూడ మండలం గాలిగూడెం గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మీ చిన్నారులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. చిన్నారులకు బాలామృతం, గుడ్లు అందజేశారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారని అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం సక్రమంగా పంపిణీ చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. గర్భిణిలు, బాలింతలకు గుడ్లు, చిన్నారులకు బాలామృత పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐ అరెస్టు
హయత్‌నగర్, ఫిబ్రవరి 4: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు శనివారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామానికి చెందిన అనంత రామేశ్వరిదేవి కుమార్తె స్వప్నారెడ్డికి కూకట్‌పల్లికి చెందిన లింగారెడ్డికి 2003లో వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద అతనికి బంగారం, నగదుతో పాటు ఒక ప్లాట్‌ను ఇచ్చాడు. వివాహం అనంతరం భార్యతోకలిసి అమెరికా వెళ్లి స్థిరపడిన లింగారెడ్డి కొద్ది రోజలు తర్వాత అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు భరించలేక స్వప్న అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసునమోదు చేసిన పోలీసులు లింగారెడ్డి కోసం గాలిస్తుండగా తప్పించుకొని నగరానికి వచ్చాడు. నగరానికి వచ్చిన లింగారెడ్డి దివ్య అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకొని కూకట్‌పల్లిలో ఉంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. స్వప్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు లింగారెడ్డి కోసం మూడు సంవత్సరాలుగా గాలిస్తున్నారు. పక్కా సమాచారంతో శనివారం మధ్యాహ్నం లింగారెడ్డి కూకట్‌పల్లిలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

రెండున్నరేళ్ళలో చారిత్రక అభివృద్ధి

తాండూరు, ఫిబ్రవరి 4: తెలంగాణలో మొట్టమొదటి టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపేర్కొన్నారు. శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కల్సి తాండూరు పట్టణ, పరిసరాలలో ముఖ్యమైన రోడ్లు, రహదారులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాహితం కోసం పనిచేసే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మంత్రి తుమ్మల అన్నారు. ఇంతకాలం అభివృద్ధికి అర్థం తెలియని పాలకుల వల్ల రాష్ట్రం ఎంతో వెనుకబడి పోయిందని, అందుకు అభివృద్ధి ప్రణాళికల కన్నా తమ సొంత ప్రయోజనాలే మిన్నగా చూసుకున్న పాలకుల వల్లే తెలంగాణ ప్రాంతం వెనకబాటుకు గురయిందన్నారు. గడచిన రెండున్నరేళ్ళ సిఎం కేసిఆర్ పాలనలో చారిత్రక అభివృద్ధిని సాధించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రహదారులతో పాటు, అంతర్రాష్ట్ర రహదారులు, రాష్ట్రం పరిధిలో ఉన్న జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, పట్టణాల మధ్య ఉన్న రహదారులన్నింటికీ మహర్దశ పడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రోడ్ల అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం దిశగాకొత్తజిల్లాలు ఏర్పాటు చేశామని, అదే క్రమంలో జిల్లాలతో అన్ని పట్టణాలకు రహదారులు అనుసంధానం చేస్తామని వివరించారు. గతంలో ఉన్న 10 జిల్లాల స్థానంలో నేడు 31 జిల్లాలు ఏర్పాటు సిఎం కేసిఆర్ సాహాసోపేత నిర్ణయంగా తుమ్మల అభివర్ణించారు. అందుకు అనుగుణంగా రహదారులు, రవాణా వ్యవస్థ మెరుగు పడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగులైన్ల రహదారుల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేవలం 600 కోట్లు కేటాయింపులు జరిగితే, నేడు టిఆర్‌ఎస్ పాలనలో ఒక్క పాత రంగారెడ్డి జిల్లా అంటే రంగారెడ్డి, మేడ్చల్ వికారాబాద్ మూడు జిల్లాలకు కలిపి రూ. 2,150 కోట్లుకేసిఆర్ కేటాయించినట్టు మంత్రి తుమ్మల వివరించారు.
మొట్టమొదటి సారిగా తాండూరు పట్టణంలోరూ. 80కోట్ల నిధులు వెచ్చించి రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టడం తమ ప్రభుత్వ రికార్డుగా మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు రింగ్ రోడ్ ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. తాండూరు నుండి వికారాబాద్‌కు రూ.50 కోట్లతో ఫోర్‌లైన్ రహదారి నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామన్నారు. అదే విధంగా పాత తాండూరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న పాత తాండూరు రైల్వే ఫ్లైవోవర్ బ్రిడ్జినిర్మాణం పనులకు రూ 51 కోట్లు వెచ్చించి నేడు పనులకు శంకుస్థాపన చేసినట్టు మంత్రులు వెల్లడించారు. తాండూరు రింగ్ రోడ్ పనులకు సంబంధించి భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రూ. 30కోట్లు నష్టపరిహారం కింద చెల్లింపులకు నిధులు మంజూరయినట్టు తెలిపారు. తాండూరు పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మంత్రి మహేందర్‌రెడ్డి సిఎం కేసిఆర్, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటిఆర్‌లతోకలిసి విన్నపాలు చేయడంతోపాటు, తనకు తన తాండూరు ట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులు రాబట్టడంలో పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతారని, అలాంటి మంత్రి పట్నం మీకు లభించడం తాండూరు ప్రజల అదృష్టం అంటూ మంత్రి తుమ్మల కితాబు ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లాకలెక్టర్ డి.దివ్య, జాయింట్ కలెక్టర్ సురేష్ పోద్దార్, తాండూరు సబ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బి.సునీతా సంపత్, జడ్పీటిసి రవిగౌడ్, అన్నిపార్టీల మున్సిపల్ కౌన్సిలర్‌లు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.