రంగారెడ్డి

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 14: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతోన్న నకిలీ ఏజెంట్‌ను రాచకొండ ఎస్‌వోటి (స్పెషల్ ఆపరేషన్ టీం) పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్న షేక్ అస్లాం పాషా అనే నకిలీ ట్రావెల్ ఏజెంట్ వద్ద నుంచి 5 పాస్‌పోర్టులు, 2 పాన్ కార్డులు, రూ. 90 వేల నగదుతోపాటు 10సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వద్ద దుబాయి, మలేసియా, బ్యాంకాక్‌కు చెందిన మరో పది సిమ్‌కార్డులు దొరికాయి. ఈనెల 6న ఎల్‌బినగర్‌కు చెందిన సాయికిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ ట్రావెల్స్ ఏజెంట్ బాగోతం బయటపడింది. నిందితుడు అస్లాం ఆస్ట్రేలియా, కెనడాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఐదుగురి నుంచి రూ. 28 లక్షలు వసూలు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
బోగస్ సంస్థలను నమ్మొద్దు..
నిరుద్యోగులు ఉద్యోగాల పేరుతో వెలుస్తున్న బోగస్ సంస్థలను నమ్మొద్దని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారు బోగస్ కన్సల్టెన్సీల ఆధారపడకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా..నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సిపి మహేశ్ భగవత్ తెలిపారు.

నగర సమగ్రాభివృద్ధికి తక్షణమే కార్యాచరణ

ఉప్పల్, ఫిబ్రవరి 14: హైదరాబాద్‌తో పాటు పరిసరాల సమగ్రాభివృద్ధికి తక్షణమే కార్యాచరణ చేపట్టాలని భారతీయ జనతా పార్డీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్‌ను పునసమీక్షించి, వచ్చే ఆదాయంలో సగం స్థానిక సంస్థలకు కేటాయించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్‌రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్.నరోత్తంరెడ్డి మంగళవారం హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులుకు వినతి పత్రం అందజేశారు. 7257 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏడు జిల్లాలలో 65 మండలాలు, 848 గ్రామాలను కలిపి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండిఏ ఆచరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రణాళికబద్ధమైన అభివృద్థి ఏమో గాని అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్, ఎన్‌ఓసిలు, అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలతో సమన్వయం లేక అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందన్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలో పెద్దగా ఉండటం తగిని సిబ్బంది లేక ఉన్న సిబ్బందిపై అధనపు భారం మోపినా ఫలితం లేక ఆదాయంలో వాటా లేకపోవడంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం తప్ప క్షేత్రస్థాయిలో జరుగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్థి జరుగడంలలేదన్నారు. హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరుగడంలేదని ఆరోపించారు. ఔటర్ రింగ్‌రోడ్డులో ఎన్నో లోపాలున్నాయని, హైదరాబాద్‌కు మణిహారం లాంటి అభివృద్థి సంస్థను మరింత అభివృద్థి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హెచ్‌ఎండిఏ స్థానిక సంస్థల మధ్య సమన్వయం ఉండాలని, ఎన్‌ఓసిలు, అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వులలో జాప్యం చేయరాదని, ఘట్‌కేసర్, గౌడెల్లి, నాగులపల్లి, శంషాబాద్‌ల వద్ద ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వేలైన్లపై వచ్చిన ప్రదేశాల్లో బ్రిడ్జీలను నిర్మించాలని, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, పటాన్‌చెరువు, శంభీపూర్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని, నార్సింగి, పటాన్‌చెరువు, దుండిగల్ జంక్షన్ల పరిధిలో ఇంకా కొనసాగుతున్న కార్మాగారాలు, ఇతర నిర్మాణాలను హెచ్‌ఎండిఏ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేసి, లైట్లను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని, టోల్ వసూలు పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని, రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని నేతలు వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.