రంగారెడ్డి

బోడుప్పల్, పీర్జాదిగూడ బిజెపి శ్రేణుల్లో ఐక్యతా రాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 16: క్రమ శిక్షణకు మారుపేరైన భారతీయ జనతా పార్టీ నగర శివారు జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో పట్టుకోసం పాకులాడుతోంది. అధికారం లేకపోయినా పిలిస్తే పలికే పార్టీ శ్రేణుల్లో ఐక్యతా రాగాలు విన్పిస్తున్నాయి. గ్రూపులకు స్వస్తిపలికి పార్టీ నేతలు, కార్యకర్తలను ఏకం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ టిఆర్‌ఎస్ కోటాలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ దిశగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి పార్టీ కార్యకర్తల్లో నూతనుత్తేజాన్ని నింపుతున్నారు. గ్రామ పంచాయతీల నుంచి పురపాలక సంఘాలుగా ఎదిగిన బోడుప్పల్, పీర్జాదిగూడలో జిల్లాల నుంచి వచ్చిన ప్రజలే ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు.
విద్యావంతులు, ఉద్యోగులు, కార్మికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ అభిమానులే ఉన్నారు. ప్రతి ఒక్కరూ బిజెపిలో సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ పార్టీలో చేరుతున్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుబ్బాక విష్ణువర్థన్‌రెడ్డి నేతృత్వంలో పని చేసే పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవులు కూడా వచ్చాయి. బాధ్యతలు స్వీకరించిన నేతలు పురపాలక సంఘాలలోని అన్ని కాలనీలలో పర్యటిస్తూ పార్టీ సభ్యత్వం చేయించి కమిటీలను వేస్తున్నారు. కీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలను నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ విశేష ఆధరణ పొందుతున్నారు. కాంగ్రెస్, టిడిపి నేతల వౌనంతో ఉండటం గమనిస్తూ అధికార పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసికెళ్లుతూ ప్రజల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే చదువు, సంస్కారం, అందర్ని కలుపుకుపోయే సమర్ధవంతమైన నాయకత్వాన్ని తయారు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
బిజెపిలో చేరిన మహిళలు
బోడుప్పల్ బాలాజీహిల్స్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న బి.లీలావతి, సి.సంధ్యారాణి, వి.రాధికారెడ్డి, అనీత, మహాలక్ష్మి, సుజాత, సమాఖ్య మహిళలు బిజెవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి చిట్టొళ్ల జైకిషన్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఉత్సాహంగా వచ్చి పార్టీలో చేరిన వందలాది మంది మహిళలకు పార్టీ కండువాలతో సత్కరించి ఆహ్వానించారు. వీరందరి చేరికతో పార్టీలో నూతన ఉత్జేతజం వచ్చిందని పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిజెపి బోడుప్పల్ పురపాలక సంఘం నాయకులు జి.శ్రీనివాస్, డి.మహేష్, సిల్వేరు శంకర్, మల్లారెడ్డి, కిరణ్, పవన్‌రెడ్డి, రాణి సుధాకర్, సుజాత, గీత పాల్గొన్నారు. మహిళలు ఐక్యంగా నిలిచి హక్కుల కోసం పోరాడితే పార్టీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

కేరళ పంచాయతీ రాజ్
వ్యవస్థ భేష్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: కేరళలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం పూర్తి అధికారాలు బదలాయించడం వలన అక్కడి పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా మారిందని రంగారెడ్డి జిల్లా ప్రాదేశిక సభ్యుల బృందం కితాబునిచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు పరిశీలనకు జెడ్‌పి చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో మూడురోజుల పర్యటన కేసం కేరళ వెళ్లిన జెడ్‌పిటిసిల బృందం మొదటిరోజు కొల్లం జిల్లాలోని కొట్టరకరలోని ఎస్‌ఐఆర్డీ శిక్షణ కేంద్రంలో అక్కడి స్థానిక ప్రభుత్వ పనితీరును వివరించారు. అక్కడి నుండి అదే జిల్లాలోని వెట్టి కవల బ్లాక్ పంచాయతీని సందర్శించారు. ఇక్కడ గ్రామ, మండల పంచాయతీలు చేస్తున్న కార్యక్రమాలను అక్కడి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జెడ్‌పి అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన అన్ని అధికారాలు అమలుపరిస్తేనే ఆ వ్యవస్థ అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని అన్నారు.
కేరళ ప్రభుత్వం 26 అధికారాలు పంచాయతీలకు బదలాయించడం వలనే అక్కడి స్థానిక సంస్థలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తుందని తెలిపారు. జెడ్‌పిటిసిల బృందం మరో రెండు రోజులు కెరళలోనే పర్యటించనుంది.
కార్యక్రమంలో జెడ్‌పి సిఈఓ రమణారెడ్డి, వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా శిక్షణ అధికారి రామేశ్వరరావు, జెడ్‌పిటిసిలు పాల్గొన్నారు.