రంగారెడ్డి

ఇద్దరు ఎస్‌ఐల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం,్ఫబ్రవరి 17: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈనెల 14న సెలవుపై ఇద్దరు ఎస్‌ఐలు తోట మహేష్ గౌడ్, ధరవత్ విజయ్ సూర్యాపేట జిల్లాలోని జూరాయి పల్లి జాతరకు వెళ్లారు. అక్కడ జాతరలో డ్యూటీలో ఉన్న ఒక ఎస్‌ఐతో పాటు పోలీసులతో గొడవపడ్డారు. అంతే కాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అక్కడి పోలీసులు చివ్యెంల పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ఎస్‌ఐలపై ఫిర్యాదు చేశారు. వీరిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయింది. అక్కడ జరిగిన విషయాలను తెలుకున్న రాచకొండ సిపి మహేష్ భగవత్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో ఘర్షణ పెట్టుకున్నందుకు చట్ట పరమయిన చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.