రంగారెడ్డి

దేశానికి పరిశుభ్రతను నేర్పించిన గొప్ప వ్యక్తి గాడ్గేబాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, ఫిబ్రవరి 23: దేశానికి పరిశభ్రతను నేర్పించిన గోప్ప వ్యక్తి గాడ్గేబాబాని అఖిల భారతీయ దోభి మహాసమాజ్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లేశరపు రాజేశ్వరి అన్నారు.
గాడ్గేబాబా 142 జయంతిని పూరస్కరించుకొని సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేటర్ సాముల హేమ చేతులు మీదుగా పెన్నులు, పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేశారు. గ్రామాలు పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం దోరుకుతుందని, ఇంటింటికి శుభ్రతను నేర్పించిన గోప్ప వ్యక్తి గాడ్గేబాబా అని కొనియాడారు. యువతకు గాడ్గేబాబా చరిత్రను గుర్తు చేయలని సూచించారు. గాడ్గేబాబా అంబేద్కర్‌కు స్వయన గురువుగా చెప్పుకున్నా మరుగునపడిన చరిత్రను నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయుడని కొనియడారు.
ఓయులో..
ఓయులో గాడ్గేబాబా జయంతి వేడుకలను రజక విద్యార్థి సంఘల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాడ్గేబాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. గంగధర్, కుమార్, లింగమయ్య, శ్రీకాంత్, సత్తీష్, కైలాస్ నేత, రామారావుగౌడ్, దరువు ఎల్లన్న, శ్రీనివాస్, ధయకర్, సాంబశివగౌడ్, శ్రీను, మహేష్, రామకృష్ణ పాల్గొన్నారు.
నాచారంలో..
గాడ్గేబాబా జయంతిని పూరస్కరించుకొని మాజీ కార్పొరేటర్ నేమలి సురేష్ అధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నేటి యువత గాడ్గేబాబాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రజక నాయకులు వీరస్వామి, శ్రీనివాస్, రవి, మల్లేష్ పాల్గొన్నారు.

పరిశ్రమలో పనిచేసే వారే నిందితులు
కొత్తూరు, ఫిబ్రవరి 23: పరిశ్రమలో పనిచేసే వ్యక్తులే ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడినట్లు శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి వివరించారు. గురువారం కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కొత్తూరు మండల పరిధిలోని పెంచర్ల గ్రామ సమీపంలో ఉన్న అమెజాన్ పరిశ్రమ గోడౌన్‌లో పనిచేస్తున్న మహేష్, రాజు, చంద్రకాంత్, పాండు, కృష్ణ, సునీల్‌కుమార్ అనే కార్మికులు చోరీకి పాల్పడినట్లు వివరించారు. ఆమెజాన్ పరిశ్రమ ప్రతినిధి నాగసుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా గురువారం శంషాబాద్ మండలం పాలమాకుల ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని విచారించినట్లు వివరించారు. రూ.18లక్షల విలువ చేసే 36ల్యాప్‌టాప్‌లకు గాను 33ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో నింధితుడు చంద్రకాంత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
కొత్తూరు పోలీసులు ఎనిమిది రోజుల్లో చోరీ కేసును చేధించడంతో శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి అభినందించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎసిపి శ్రీనివాస్, రూరల్ సిఐ మధుసూదన్, ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

లైంగిక వేధింపులపై పోలీసులను
ఆశ్రయించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 23: అర్ధరాత్రి సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న గుర్తు తెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘట్‌కేసర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్‌షిప్ కాలనీలో నివాసం ఉంటున్న వైశాలి పాండే పోచారం ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైశాలి పాండేకు ప్రతిరోజు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్లు చేస్తూ అసభ్య పదజాలంతో వేధింపులకు పాల్పడుతున్నారని యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని యువకుల ఫోన్ నంబర్లను సేకరించి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా బియ్యం లక్ష్యం మూడు వేల టన్నులు
వికారాబాద్, ఫిబ్రవరి 23: ప్రభుత్వం పేదలకు పంపిణి చేస్తున్న రూపాయికి కిలో బియ్యం ప్రతి నెలా సరిపడా బియ్యాన్ని సిఎంఆర్ ద్వారా సమకూరుస్తున్నట్లు వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ తెలిపారు. గురువారం జెసి చాంబర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా రైస్‌మిల్లర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి జిల్లాకు స్టేట్‌పూల్ టార్గెట్స్ ప్రతిపాదించిందని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు మూడు వేల టన్నుల లక్ష్యం ఇచ్చారని పేర్కొన్నారు.