రంగారెడ్డి

విద్య ఉద్యోగానికి కాదు విజ్ఞానం కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 23: విద్య అనేది ఉద్యోగానికి కాదని, విద్య విజ్ఞానం కోసమని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టరర్ సురేష్ పొద్దార్ అన్నారు. స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన వికాస్ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవం, వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ ప్రాంతంలో విద్యాసేవ చేస్తున్న వికాస్ కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. కష్టపడితే సాధించలేనిది ఉండదని, దానికి తన జీవితమే ఆదర్శమని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదగగలిగామని తెలిపారు. ప్రధాన వక్తగా హాజరైన ఎంపిడివో సత్తయ్య మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో సక్సెస్ కావాలంటే క్రమశిక్షణ, కఠినశ్రమ అవసరమని సూచించారు. ఈ తరం విద్యార్థులపై టివి, సెల్‌ఫోన్‌ల దుష్ప్రభావం పడుతోందని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థితికి చేరుతామని, దుర్వినియోగం చేసుకుంటే జీవితమే నాశనం అవుతుందని స్పష్టం చేశారు. నేటి విద్యార్థులకు లక్ష్యం పట్ల స్పష్టత ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదవాలని, మన చరిత్రను, భాషా చరిత్రను, పాఠ్యపుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ నిర్దేశించే శక్తి యువతకు ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ధారూర్ సిఐ జె.ఉపేందర్ మాట్లాడుతూ సాధారణ స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.
పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కష్టపడి ప్రణాళికా బద్ధంగా చదవాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జన్మనిచ్చిన ప్రాంతానికి విద్యాసేవ చేసేందుకు 16 సంవత్సరాల క్రితం కళాశాలను స్థాపించామని, ఆర్ట్స్, కామర్స్‌లలో స్థిరస్థానాన్ని నిలుపుకుని బ్రాండ్ పేరు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. సైన్స్ గ్రూపుల అభివృద్దికి మార్పులు ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎన్.శుభప్రద్‌పటేల్, కళాశాల డైరక్టర్ పి.రాంరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
షాద్‌నగర్, ఫిబ్రవరి 23: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి వివరించారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులో వెలసిన ఉత్తర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ, పూజారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసిపి పద్మజారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా దేవాలయానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతల దృష్ట్యా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 29మంది ఏఎస్‌ఐలు, 69మంది కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు వివరించారు. ఆలయ ఉత్సవాలు ముగిసే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక బస్సులు
* ఆర్టీసి డిపో మేనేజర్ సత్తయ్య
ప్రసిద్ధి చెందిన ఉత్తర రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు షాద్‌నగర్ ఆర్టీసి డిపో మేనేజర్ సత్తయ్య తెలిపారు. ప్రస్తుతం రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలకు ఎనిమిది బస్సులు వేయడం జరిగిందని, భక్తులు పెరిగితే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. దేవాలయానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఆర్టీసి బస్సును వేస్తామని వివరించారు.