రంగారెడ్డి

విద్య, వౌలిక వసతుల మెరుగుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 6: రాష్ట్రంలో విద్య, వౌలిక వసతులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని విద్య, వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్ వెల్లడించారు. పదవి పొందిన సందర్భంగా సోమవారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ఆశయాలకనుగుణంగా విద్యలో మార్పులు తెస్తామని చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల వసతులు, సౌకర్యాలు, ల్యాబ్‌లను పరిశీలిస్తామని వివరించారు. అక్షరాస్యులైన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు.
టిఆర్‌ఎస్ మద్దతిస్తున్న కాటేపల్లి జనార్ధన్‌రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కెజిబివి పాఠశాలలకు చెందిన 250 మంది ఉపాధ్యాయులు కాటేపల్లికే మద్దతు పలికారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా కుట్రలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు విజ్ఞతతో జనార్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో నవాబ్‌పేట ఎంపిపి పాండురంగారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా ఉపాద్యక్షుడు నందు, నాయకులు ఎల్లారెడ్డి, దత్తు, గంగులు పాల్గొన్నారు.

మద్యం, డబ్బుతో ఉపాధ్యాయులను కొనాలనుకోవడం నీచ సంస్కృతి

వికారాబాద్, మార్చి 6: ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడి ఎన్నికల్లో మంత్రులు, శాసనసభ్యులు మందబలంతో బయలుదేరి డబ్బులు, మద్యం ఎరవేసి ఉపాధ్యాయులను కొనాలని చూడటం నీచ సంస్కృతికి దారితీస్తోందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. సోమవారం నగేశ్‌గుప్త గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ధన బలానికి, ఉపాధ్యాయుల హక్కులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి, తపస్ ప్రత్యేక పాత్ర పోషిస్తోందని చెప్పారు. విజ్ఞులైన ఉపాధ్యాయులు ధనబలం, అహంకారం గెలుస్తుందా అని అలోచించుకోవాలని సూచించారు. స్వయానా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరే ఉపాధ్యాయ సంఘాలు, మహిళా ఉపాధ్యాయులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, అలాంటపుడు జనార్ధన్‌రెడ్డికి ఓటు వేస్తే కడియం వ్యాఖ్యలకు మద్దతు పలికినట్టేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల గురించి పోరాడిన భూపతిరెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, తప్పుడు విధానం, ధనబలంతో గెలిచి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై వాణి వినిపించే తపస్ అభ్యర్థి భూపతిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జనార్ధన్‌రెడ్డి ఓటమితో టిఆర్‌ఎస్‌కు ముప్పురాకున్నా, రాష్ట్ర ప్రభుత్వం నయానో, బయానో గెలపించిన వారిని పార్టీలో చేర్చుకుని మందబలం ఉందని విర్రవీగుతూ సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఆశయ సాధనే లక్ష్యంగా, హక్కుల సాధనే బాధ్యతగా అహర్నిశలు పోరాడుతూ వృత్తి ధర్మాన్ని కాపాడే భూపతిరెడ్డికి మద్దతివ్వాలని అన్నారు. తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్యాట మల్లేశం మాట్లాడుతూ తపస్ అభ్యర్థి గెలుపు బాటలో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కులానికో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. భూపతిరెడ్డిని గెలిపిస్తే సిపిఎస్ రద్దుపై పోరాటం చేస్తారని తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడుతూ ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. జాతీయ భావాలు గల బిజెపి బలపర్చిన భూపతిరెడ్డి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న రాంచందర్‌రావుకు మరో ఎమ్మెల్సీ తోడైతే ఉపాధ్యాయుల సమస్యలపై గట్టిగా వాణి వినిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనార్ధన్‌రెడ్డి ఓటమితో ప్రభుత్వానికి, సిఎంకు నష్టం లేకపోయినా, ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టవుతుందని వివరించారు. సమావేశంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు జి.పాండుగౌడ్, యు.రమేష్ పాల్గొన్నారు.