రంగారెడ్డి

నీటి సమస్య పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మార్చి 23: కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్ వివరించారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాలను సందర్శించి నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మార్చి 17వ తేదిన‘గొంతెండుతోంది మహాప్రభో’ అనే వార్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపిపి మాట్లాడుతూ కస్తూర్బాలో నెలకొన్న తాగునీటి సమస్య విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. త్వరలోనే నూతనంగా బోరు వేయించనున్నట్లు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న నీటి సంప్‌ను త్వరగా నిర్మించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో వీధిదీపాలు వేసేందుకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఎంపిడివో జ్యోతి ఆదేశించారు.
రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
కొత్తూరు రూరల్, మార్చి 23: సిసి రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్ అన్నారు. గురువారం నందిగామ మండలం చేగూరు గ్రామంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిసి రోడ్డు నిర్మాణం పనులు మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో నిధులు వెనక్కి వెళ్లే అవకాశాలు ఉంటాయని అన్నారు. సిసి రోడ్ల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అండర్‌గ్రౌండ్ మురుగు కాలువల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాండయ్య, సింగిల్ విండో చైర్మన్ విఠల్ ముదిరాజ్, ఎంపిడివో జ్యోతి, కార్యదర్శి చక్రదర్ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ నేత విష్ణుచారికి సత్కారం
మేడ్చల్, మార్చి 23: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు సానాల విష్ణుచారి తన జన్మదిన వేడుకలను గురువారం మేడ్చల్ అభిమానులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. విష్ణుచారిని శాలువాలతో సత్కరించి పుష్ఫగుచ్ఛాలను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ సంబరాలు జరిపారు.

బ్యాంకులు, ఎటిఎంలలో
కరెన్సీ కొరత
* ఇబ్బందుల్లో ఖాతాదారులు*
తీరని క్యాష్ కష్టాలు
షాద్‌నగర్, మార్చి 23: బ్యాంకులు, ఏటిఎంలలో డబ్బుల కొరత కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న వివిధ బ్యాంకుల్లో విత్‌డ్రాలు అధికంగా ఉంటున్నాయని, డిపాజిట్లు మాత్రం తగినన్నిగా రావడం లేదని, దీంతో బ్యాంకుల్లో డబ్బుల కొరత కొంతవరకు ఉన్నమాట వాస్తవమేనని అధికారులు తెలుపుతున్నారు. సేవింగ్ ఖాతా, కరంటు ఖాతా ఖాతాదారులు నియమ నిబంధనల ప్రకారం చెక్కులు రాసినప్పటికీ పాస్ చేయడం లేదు. కేవలం బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బులకు అనుకులతను బట్టి ఖాతాదారులకు చెక్కులు పాస్ చేస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తొలగించినప్పటికీ సరిపొను డబ్బులు లేవని, వచ్చే నెలలో ఆర్‌బిఐ నుండి డబ్బు నిల్వ రాగలదని, వచ్చిన తరువాత డబ్బుల కొరత ఉండదని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సేవింగ్ ఖాతాదారులకు రూ.20వేల నుండి రూ.30వేలు, కరంటు ఖాతాదారులకు రూ.50వేల నుండి రూ.75వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఏటిఎంలలో దాదాపు 70శాతం వరకు డబ్బు నిల్వలు లేవని, కేవలం 30శాతం ఏటిఎంలు పనిచేసినప్పటికీ క్యూలో నిలబడిన వినియోగదారులకు పూర్తి స్థాయిలో డబ్బులు లభించడం లేవని, క్యూలో నిలిచిన సగం మందికి మాత్రమే డబ్బులు లభిస్తున్నాయని, మిగతా వారికి డబ్బులు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బుల కొరత తీర్చుటకు ఆర్‌బిఐ అధికారులు చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.