రంగారెడ్డి

త్వరలో ట్రాఫిక్ లైవ్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 24: హైదరాబాద్ ట్రాఫిక్ యాప్ మాదిరిగా సైబరాబాద్‌లో కూడా యాప్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య ప్రకటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విబాగంలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో ఉపయోగించే సామాగ్రిని కమిషనరేట్‌లో అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ పోలీసు శాఖలో ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో ఎక్కువ సంబంధం ఉన్న విభాగమని చెప్పారు. సైబరాబాద్ తీసుకొస్తున్న యాప్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకొస్తామన్నారు. సైబరాబాద్ యాప్ విషయంపై వివిధ సంస్థ ప్రతినిధులతో కసరత్తు చేస్తున్నామని వివరించారు. లైవ్ యాప్ ద్వారా పబ్లిక్ ఇంటర్ఫేస్, ఆటోఫేర్ ఎస్టిమేషన్, లైవ్ ట్రాఫిక్, దగ్గరలోని పోలీసు స్టేషన్ వివరాలు తెలసుకోవచ్చునని చెప్పారు. ఈ చలాన్ వివరాలు, వెహికిల్ ఆర్టీఏ స్టేటస్ తదితర వివరాలను తెలుసుకొనే సౌకర్యం ఉంటుందని వివరించారు. ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు తప్పక అందుబాటులో ఉంచుకోవాలని.. అవే కోర్టులో సాక్ష్యాలని అన్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించే సమయంలో వాహనదారులు ఘర్షణకు దిగుతుంటారని.. అయినప్పటికీ సహనంతో విధులు నిర్వహించాలని సూచించారు. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రజల మన్నలు పొందడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వారి మన్నలు పొందాలని సూచించారు. ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు నిజాయితీతో పనిచేయాలని ఎవరో ఒకరు చేసే తప్పుకు ప్రజలు పోలీసు శాఖను అపార్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.