రంగారెడ్డి

మరో అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 28: జిహెచ్‌ఎంసిలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. కాంట్రాక్టర్‌ను లక్ష రూపాయలు డిమాండ్ చేసి మొదటి విడతగా రూ. 30వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. వివరాలలోకి వెళ్తే.. కరణం కిషన్‌రావు శేరిలింగంపల్లిలోని జిహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. కాగా, పార్కు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టరు అశోక్‌గౌడ్ తనకు రావలసిన ఐదు లక్షల 75 వేలు బిల్లు తయారు చేయాలని కోరాడు. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో వెంటనే ఎంబి రికార్డు పూర్తిచేసి బిల్లు ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. లక్ష రూపాయలు లంచం ఇస్తేనే త్వరగా బిల్లు పెడతానని కిషన్‌రావు తెగేసి చెప్పాడు. ఇంత చిన్న మొత్తానికి లక్ష రూపాయలు ఇవ్వలేనని కాంట్రాక్టరు బతిమాలాడాడు. చివరికి రూ. 75 వేలు రెండు విడతలుగా ఇవ్వమని చెప్పాడు. అధికారి వేధింపులతో ఆ కాంట్రాక్టరు విసిగిపోయి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం... మంగళవారం సాయంత్రం సైఫాబాద్‌లోని కామత్ హోటల్‌కు పిలిపించగా రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

వెలవెలబోయిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు!
బాలాపూర్, మార్చి 28: మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి తెరాస ఉద్యమకారులు దూరం అవుతున్నారా? లేక ఎమ్మెల్యే ఉద్యమకారులకు దూరంగా ఉంటున్నారా? అనేది తెలియడం లేదు. మంగళవారం మీర్‌పేట్ సిద్దాల దశరథ కాంప్లెక్స్‌లో జరిగిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చూస్తే, టిఆర్‌ఎస్‌కు కార్యకర్తలు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉండగా, లేటుగా మధ్యాహ్నం దాదాపు 1:30 గంటలకు ప్రారంభమైంది. ఎమ్మెల్యే తీగల వచ్చిన కార్యకర్తలు ఎవరూ లేక సభ్యత్వ నమోదు వెలవెలబోయంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దాదాపు 20, 25మంది మాత్రమే వచ్చారు. అది కూడా ఎంపిపి తీగల విక్రంరెడ్డి, స్థానికంగా ఉండే నలుగురు ఎంపిటిసిలు, వారి అనుచరులు మాత్రమే హాజరయ్యారు. సభ్యత్వ నమోదుకు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యే ఒకరిద్దరికి మాత్రమే సభ్యత నమోదు పుస్తకాలు ఇచ్చి వెనుదిరిగారు. వారం రోజుల ముందే టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఉందని కార్యకర్తలకు తెలిసిన, ఏ కార్యకర్త సభ్యత్వ నమోదుకు రాకపోవడంపై అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో మహేశ్వరంలో ఉద్యమకారులకు, ఎమ్మెల్యే అనుచరులకు జరిగిన ఘటనతో కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి మొదటి నుంచి తెరాస కార్యకర్తలతో, ఉద్యమకారులతో అంటీ, ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్‌ఎస్ జెండా మోసినప్పుడు నవ్విన నాయకులే నేడు వేదికలపై కూర్చుంటే, మేము వేదిక కింద చివర కూర్చుంటున్నామని జిల్లెలగూడకు చెందిన ఉద్యమకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు భార్య, బిడ్డలకు దూరం ఆయిన, తెలంగాణ వచ్చిందని చాలా సంతోషం పడ్డామని ఉద్యమకారులు తెలిపారు. కానీ నేడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే, తెలంగాణ ఇందుకేనా తెచ్చుకున్నాం దేవుడా.. అనిపిస్తోందని మీర్‌పేట్‌కు చెందిన ఉద్యకారుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ వస్తే మా పాలన మేము చేసుకుంటామంటే, మా పాలన ఏమో కానీ తెలంగాణను అడ్డుకున్న నాటి ద్రోహులే నేడు పాలకులు ఆయ్యారని ఉద్యమకారులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన మాకు నేడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని పలువురు వాపోతున్నారు.