రంగారెడ్డి

ఉపాధి హామీ పథకంతో పెరిగిన కూలి రేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 13: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావడంతో గ్రామాల్లో పేదల కూలీరేట్లు పెరిగాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్టక్రార్యదర్శి ఆర్.వెంకట్‌రాములు అన్నారు. శుక్రవారం స్థానిక రవీంద్ర మండపంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పథకం ఫలితాలు, అవరోధాలు అంశంపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆడ, మగ తేడా లేకుండా సమాన వేతనమైందని చెప్పారు.
ఉపాధిహామీ పథకం రావడంతో గ్రామ పెత్తందార్ల పెత్తనం పేదలపై తగ్గిందని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని పెత్తందారులు ఎమ్మెల్యే, ఎంపి, బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని ఐక్యంగా ఎదుర్కొని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కరవు పరిస్థితుల్లో కూలీలు అడిగినన్ని రోజులు ఉపాధి పనులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. పనిదినాలు 200 రోజులు నిరంతరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పెరిగిన ధరలకనుగుణంగా కరవు పరిస్థితుల కారణంగా దినసరి కూలిని రూ.300లకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో నీరు, నీడ సౌకర్యం కల్పించాలని, గడ్డపారలు, గంపలు ఇవ్వాలని, ఎండదెబ్బకు కూలీలు మృతిచెందితే వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్యూబిక్ మీటర్ రేటు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవు నేపథ్యం దృష్ట్యా అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని, పశుగ్రాసం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉపాధిహామీ పథకాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని, బంగారు తెలంగాణ సాధిస్తానంటున్న సిఎం కేసిఆర్.. కూలీల రేట్లు పెంచకుండా ఎమ్మెల్యే, మంత్రులు జీతాలు పెంచారని విమర్శించారు. కూలీల సమస్యలు పరిష్కరించకుంటే కేసిఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పిడి జాన్సన్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై.మహేందర్, ఎం.వెంకటయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.మహిపాల్, శాంతయ్య, బుగ్గప్ప, అనంతయ్య, శ్రీశైలం, అనసూయ, పద్మ, ఉపాధి కూలీలు, మేట్లు, వికారాబాద్ ఎపివో సురేష్ పాల్గొన్నారు.