రంగారెడ్డి

అష్ట కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 8: నో క్యాష్.. నో క్యాష్.. డబ్బు తీసుకుందామని బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులకు బ్యాంకు అధికారుల సమాధానం ఇదీ.. ఏటిఎంలలోనే నో క్యాష్ అనుకుంటే బ్యాంకుల్లో సైతం నో క్యాష్ అంటూ అధికారులు కొత్త పల్లవి అందుకోవడంతో ఖాతాదారులు బిక్కమొహలు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా షాద్‌నగర్ ప్రాంతంలోని బ్యాంకుల్లో ఈ పరిస్థితి కొనసాగడానికి కారణం నగదు నిల్వలు బ్యాంకుల్లో లేకపోవడమేనని బ్యాంకుల సిబ్బంది అంటున్నారు. దీనికితోడు ప్రధాన కారణంగా డబ్బులు తీసుకునే వారే తప్ప బ్యాంకుల్లో డబ్బులు వేసే ఖాతాదారుల సంఖ్య తక్కువగా ఉందని బ్యాంకు అధికారులు అంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, తిమ్మాపూర్‌లలో ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. గత కొద్ది రోజులుగా డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్తున్న ఖాతాదారులకు బ్యాంకు అధికారుల నుంచి నో క్యాష్ పల్లవి వినిపిస్తుంది. డబ్బు తీసుకువెళ్లడానికి బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుడు నోక్యాష్.. డబ్బు లేదు.. వేచి ఉండండి.. లేదా బ్యాంకుల్లో ఎవరైనా డిపాజిట్ చేస్తే మీకు డబ్బు ఇస్తాము..అనే సమాధానాలు బ్యాంకు సిబ్బంది నుంచి వినవస్తున్నాయి. ప్రధానంగా ఎటిఎంలలో నో క్యాష్ అనే బోర్డులు దర్శన మిస్తున్న నేపథ్యంలో కనీసం బ్యాంకుల్లోనైనా డబ్బులు తీసుకుందామని వెళ్తున్న ఖాతాదారులకు అక్కడ కూడా నో క్యాష్ అనే సమాధానం ఎదురవుతుంటే బిక్కమొహం వేయక తప్పడం లేదు. సేవింగ్ ఖాతాదారులకు 24వేలు, కరంటు అకౌంట్ ఖాతాదారులకు 50వేల వరకు డబ్బులు ఇస్తున్నారే తప్ప అంతకంటే ఎక్కువ అడిగితే నో క్యాష్ అనే సమాధానం వస్తుంది. బ్యాంకుల్లో నో క్యాష్ సమస్యకు ప్రధాన కారణాలుగా బ్యాంకు శాఖలకు హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు సరఫరా చేయకపోవడం, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే వారే తప్ప డిపాజిట్లు చేసేవారు లేకపోవడమేనని బ్యాంకు అధికారులు సెలవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకు అధికారులు రెగ్యులర్ ఖాతాదారులకు కొంతవరకు డబ్బు సర్దుబాటు చేస్తున్నా ప్రతి ఒక్కరికి డబ్బు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఏటిఎంలలో నో క్యాష్ బోర్డులు
ఎటిఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడం ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోని ఏటిఎంలలో ఇప్పటికీ 90శాతం ఎటిఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక వేళ ఏటిఎంలలో క్యాష్ ఉంటే డబ్బు కోసం బారులు తీరిన లైన్లు దర్శనమివ్వడమే కాక గంటలోపై తిరిగి నోక్యాష్ బోర్డులు తగిలించే పరిస్థితులు ఏటిఎంలలో నెలకొంది. ఏటిఎంలలో ఇలాంటి పరిస్థితులతో విసిగి వేసారుతున్న జనాలకు బ్యాంకుల్లో సైతం నో క్యాష్ అంటూ సమాధానాలు వస్తే ఇక డబ్బు కోసం ఎక్కడి వెళ్లాల్లో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

శుభ్రత పాటించని
హోటల్స్‌పై చర్యలు
గచ్చిబౌలి, ఏప్రిల్ 8: హోటల్స్ యజమానులు శభ్రత పాటించక పోతే చర్యలు తీసుకుంటామని జిహెచ్ ఎసి సర్కిల్ 12ఉప కమిషనర్ మమత హెచ్చరించారు. శనివారం మాదాపూర్‌లోని బావార్చి హోటల్‌లో ఆమె సర్కిల్ ఆరోగ్య అధికారి బిందు భార్గవితో కలసి ఆకస్మిక తనికీ చేశారు. బావార్చి హోటల్‌లోని వంటశాలను పరిశీలించిన మమత నిర్వహణను చూసి నిర్వహుకులపై అగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి స్లాటర్‌హూస్ లనుండి స్టాంపువేసిస మాంసాన్ని తీసుకొచ్చి వంటలు చేయాలని సూచించారు. వంటశాలలో శుభ్రత పాటించాలని తినుబండారలపై ఈగలు వాలకుండా చూడాలని చెప్పారు. నిలువ ఉంచిన, పాడైపోయిన మాంసాహారాలను వడించడం నేరమని నిబంధనలు అతిక్రమించే వారిపై కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాదాపూర్ డివిజన్‌లో శానిటేషన్ పనులను తనికీ చేశారు. ఈకార్య6కమంలో ఎఇ, అనురాగ్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ తోపాటు ఎస్‌ఆర్‌పిలు, ఎస్‌ఎఫ్‌ఎలు పాల్గోన్నారు.

నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు

ఇన్‌చార్జి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
తాండూరు, ఏప్రిల్ 8: తాండూరులో గత మార్చి నెలలో చోటు చేసుకున్న ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడు పోలీసులకు చిక్కిన నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్ నూతన జిల్లా పరిధిలో నేరాలను అదుపు చేయడానికి ఆధునిక శాస్త్ర పరిజ్ణానంతో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ప్రస్తుతం ఎస్పీగా సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నట్లు, ఇన్‌చార్జి ఎస్పీగా వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ రెండు జిల్లాలు కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు, సరిహద్దుల్లో భద్రతా చర్యలు, అక్రమ రవాణా ఆరికట్టడం, అంతరాష్ట్ర నేరగాళ్ళ కదలికలపై దృష్టి సారించటం, వంటి చర్యలకు గాను రెండు రాష్టల్ర పోలీస్ యంత్రాంగం సమన్వయంతో కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే రెండు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికార యంత్రాంగం సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. కాగా, తాండూరు, జహీరాబాద్ వంటి అభివృద్ధి చెందిన పట్టణాలలో బయటి ప్రాంతాల నుండి బతుకు దెరువు పేరిట దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు, కూలీలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ నగర శివార్లు పటన్‌చెరు ముత్తుట్ ఫైనాన్స్ దోపిడీ ఘటనలో నిందితులు తాండూరు మీదుగా కర్నాటక,మహారాష్ట్ర ప్రాంతాలకు పారినట్లు, ఆ కేసును చాకచక్యంగా ఛేదించినట్లు చెప్పారు.
తాండూరు పరిసరాల్లో నిత్యం రాత్రి పోలీస్ గస్తీని ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ చంద్ర శేఖర్‌రెడ్డి వెల్లడించారు. కాగా నైట్ పెట్రోలింగ్, బీట్‌ల పోలీస్ బృందాలకు ఇక ముందు తుపాకీలతో బీట్‌లు తప్పసరి చేస్తున్నట్లు ఎస్పీ పునరుద్ఘాటించారు.