రంగారెడ్డి

ఓట్ల కోసం రిజర్వేషన్లు పెంచితే ప్రజలే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఏప్రిల్ 16: మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు అదివారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని బిజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఇంద్రాసేనారెడ్డి అన్నారు. అదివారం తెలంగాణ అసెంబ్లీలో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు బిల్లును ప్రవేశపెట్టడం ముందస్తుగానే అదివారం ఉదయమే స్థానిక లంగర్‌హౌస్ బిజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ముందస్తుగానే వేకువజామునే పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌పై మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలుపేందుకు బిజేపీ పార్టీ పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అందుకు ముందుస్తుగానే తమను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయడం ఏమిటని అయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిరసనలు తెలిపే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని అయన అన్నారు. అనంతరం బిజేపీ సీనియర్ నాయకుడు పూర్ణ చందర్‌రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిసి ప్రజలు కెసీఆర్‌కు బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం సమాంజసం కాదని అన్నారు. కావాలని ఓట్లు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బిజేపీ పార్టీ అని టీఆర్‌ఎస్ పార్టీ గుర్తించుకోవాలని అయన తెలిపారు. పలువురు బిజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేయడంతో ఠాణాలోనే బిజేపీ నాయకులు నిరసన తెలిపారు.

తెలంగాణకు పట్టిన గబ్బును కాంగ్రెస్ సబ్బుతో కడిగేస్తాం

* మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గబ్బును కాంగ్రెస్ సబ్బుతో కడిగేస్తామని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం దుర్గానగర్‌లోని గ్రాండ్ ఫంక్షన్‌హాల్లో నిర్వహించారు. సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని చెప్పారు. కేబినెట్‌లో మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దురదృష్టకరమని, కవితకు ప్రాధాన్యత తగ్గుతుందనే మహిళలకు కేబినెట్‌లో చోటు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సోనియాగాంధీని కెసిఆర్ కుటుంబ సమేతంగా కలిసిన విషయం మరిచిపోయి నేడు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విస్మయంగా ఉందని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదగబోతుందని, టిఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, టిఆర్‌ఎస్ నీటి మీద బుడగ వలే గొప్పలు చెబుతుందని అన్నారు. బూత్‌స్థాయి కమిటీలను వేసి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ పలు అనుబంధ సంస్థలకు చెందిన కమిటీల నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు కార్తీక్‌రెడ్డి, కొలన్ సుభాష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, దారమోని రమేష్ ముదిరాజ్, ఇఎన్ అశోక్‌కుమార్, సదాలక్ష్మి, మజ్జిగ బాబురావు యాదవ్, చిత్తారీ, బండారి రూప, శ్రీకాంత్‌రెడ్డి, అరుణ్ ముదిరాజ్, కావటి వెంకటేష్ పాల్గొన్నారు.