రంగారెడ్డి

హరిత జిల్లాగా మేడ్చల్: కలెక్టర్ ఎంవి రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి జిల్లాను హరితజిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా పరిమ్రలు - పచ్చదనం అంశంపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో పారిశ్రామికవాడలు భాగస్వాములై పరిశ్రమల్లో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను పెంచాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించే పరిశ్రమలకు ప్రభుత్వం మొక్కలను అందజేస్తుందని తెలిపారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడంతో పాటు ట్రీగార్డులను ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్బన్ ప్రాంతాలలోనే కాకుండా రూరల్ ప్లాంటేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, స్మృతివనాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు భాగస్వామలు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్మశానవాటికలకు వైకుంఠదామంగా నామకరణం చేయడంతో పాటు స్మృతివనాలలో చనిపోయిన తమ ఆత్మీయులకు గుర్తుగా మొక్కలు నాటి సంరక్షించి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. మొక్కలను తమ పిల్లల వలే సంరక్షించాలని, భవిష్యత్తు తరాలకు మనం అందించే ఆస్తి స్వచ్ఛమైన గాలి, కాలుష్య రహితమైన ప్రశాంత వాతావరణమేనని, ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపిఓ సురేశ్‌మోహన్, ఉద్యానవనశాఖ అధికారి సత్తార్ పాల్గొన్నారు.

న్యాయవాద చట్ట సవరణను వ్యతిరేకిస్తూ
న్యాయవాదుల ఆందోళన
రాజేంద్రనగర్, ఏప్రిల్ 21: భారత లా కమిషన్ న్యాయవాద చట్ట సవరణల సిఫార్సు బిల్లు 2017 వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రాల బార్ కౌన్సిల్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన తెలిపారు. శుక్రవారం రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు.. లా కమిషన్ సిఫార్సులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.పవన్‌కుమార్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్.. రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఆందోళన చేశామని వివరించారు. న్యాయవాద వృత్తికి విఘాతం కలిగించే విధంగా ఉన్నందున లా కమిషన్ సిఫార్సులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు కోర్టును బహిష్కరించి బిల్లు కాపీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో రాజేంద్రనగర్ కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు డి.ప్రవీన్‌కుమార్, కె.వరప్రసాద్, బందయ్య, భూపాల్, రియాజ్ పాషా, ఖలీల్ హైమద్, సిద్దేశ్వర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, వౌనిక, సుజాత, లక్ష్మణ్, శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీనివాసులు, బిఎన్ చారి, గణేష్, వెంకటరమణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.