రంగారెడ్డి

యాడారంలో అక్రమ లేఔట్ల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 27: మేడ్చల్ మండలంలోని యాడారం, గౌడవెళ్లి గ్రామాలలో బుధవారం అధికారులు అక్రమ లేఔట్లను కూల్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కూల్చివేతకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కుత్భుల్లాపూర్ మండల ఇఓపిఆర్డీ జ్యోతిరెడ్డి నేతృత్వంలో ఆరుగురు కార్యదర్శులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. బృందం బుధవారం ఉదయం నేరుగా గౌడవెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని గ్రామ పరిధిలోని అక్రమ లేఔట్లను, అనధికార నిర్మాణాల వివరాలను పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని అనధికార అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై స్పష్టత లేకపోవడంతో కార్యదర్శి సునీతపై ప్రత్యేకాధికారి జ్యోతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో వివరాలు లేకపోవడంతో పాటు ముందస్తు తాఖీదులు కూడా జారీ చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుండి మధ్యాహ్న అధికారుల బృందం యాడారం గ్రామానికి చేరుకుంది. గ్రామ పరిధిలోని సర్వే 197, 198, 200, 211 నుండి 221లో ఏర్పాటు చేసిన మిత్రా ఎన్‌క్లేవ్, సర్వే నెంబర్లు 75, 119, 125, 126,127, 135, 138, 140 నుండి 147 వరకు గల వాటిలో నిర్మించిన ఎంబిఆర్ లేఔట్, సర్వే నెంబరు 31, 34లో ఏర్పాటు చేసిన సత్యవతి లేఔట్లలో కూల్చివేతల కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఆయా వెంచర్లలో హద్దురాళ్లను, ప్రహరీగోడలను తొలగించారు.

రైతు బజార్ పార్కింగ్
టెండర్‌లో ‘గోల్‌మాల్’
ఎల్‌బినగర్, ఏప్రిల్ 27: ఆర్కేపురం డివిజన్ ఎన్‌టిఆర్‌నగర్‌లోని గడ్డిఅన్నారం రైతు బజార్ పార్కింగ్ టెండర్‌లో పారదర్శకతను పక్కనబెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా టెండర్లను వేసి అవకతవకలకు పాల్పడి మార్కెట్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
2015-16 సంవత్సరానికి సంబంధించి పార్కింగ్‌కు మార్కెట్‌లో రూ.1.40లక్షల టెండర్ ఉండగా ప్రస్తుతం కేవలం రూ.80వేలు మాత్రమే పార్కింగ్‌కు టెండరు రావడం పట్ల అధికారులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత సంత్సరానికి ప్రస్తుతానికి రూ. 72 వేల తేడాతో ఆదాయం కోల్పోయింది. టెండరు పూర్తయ పది రోజులు గడిచినా రీకాల్ చేయకుండా అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సగం ధరకే ఎందుకు టెండర్‌ను ఇస్తున్నారని కొందరు మార్కెటింగ్ శాఖ జాయింట్ కలెక్టర్, ఎస్‌జీఎస్‌లను ప్రశ్నించినప్పటికీ ఈ విషయం తమ దృష్టికి రాలేదని దాటవేసే ధోరణితో వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో టెండర్‌లకు ఎవరిని ఆహ్వానించారు? ఎవరి ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం కొందరికి లబ్ధి చేకూర్చేందుకే టెండర్ల విషయంలో గోల్‌మాల్ చేస్తూ మార్కెట్ ఆదాయానికి గండి కొట్టి సొంత జేబులు నింపుకొంటున్నారని, దానిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.