రంగారెడ్డి

ప్రపంచం చూపు.. హైదరాబాద్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 28: తెలంగాణలో అవలంభిస్తున్న పారిశ్రామిక విధానంతో ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని ప్రభుత్వ ఐటి శాఖ కార్యదర్శ జయేష్ రంజన్ అన్నారు. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ 4వ సమావేశం రాయదుర్గంలోని జెఆర్‌సి హాల్‌లో జరిగింది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ యాప్‌ను రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు చేసే సంస్థలకు త్వరతిగతిన అనుమతులు ఇవ్వడానికి టిఎస్‌ఐపాస్ ద్వారా మంజురు చేస్తుందని వివరించారు. దీనికి తోడు బలమైన నాయకత్వంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలు కారణమని చెప్పారు. పుణే, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో పరిశ్రమలు ఉన్నప్పటికీ మన నగరంలో వాతవరణ పరిస్థితులు అనుకులంగా ఉండడంతో ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని వివరించారు. నగరంలో ట్రాఫిక్, కాలుష్యంతో నిండిన చెరువులు, పచ్చదనం సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించాల్సి అవసరం ఎంతైన ఉందని తెలిపారు. తను ఇటీవల ఢిల్లీ వెళ్లానని అక్కడ ప్రతి గురువారం.. కారు ఫ్రీ డే ఉంటుందని ఆ రోజు ఎవరూ కారు తీసుకురారని తెలిపారు. హైటెక్ సిటీలోనూ కారు ఫ్రీ డే ఉన్నప్పటికీ ఎవరూ పాటించరని ఆవేదన వ్యక్తం చేశారు.
జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నగరం శుభ్రంగా ఉంటే మంచి పేరు వస్తుందని, అందరూ శుభ్రత పాటించాలని కోరారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో జిహెచ్‌ఎంసి కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. బాగా పనిచేసే కార్మికులను సన్మానిస్తు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సన్‌సైన్ హాస్పిటల్ ఎండి గురువారెడ్డి, ఎఫ్‌ఎం కౌన్సిల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.

రక్షణ రంగాల్లోనూ ఓయూ కీలకం
* విద్యార్థుల పరిశోధనలకు డిఆర్‌డివో, నావిగేషన్ సంపూర్ణ సహకారం
నాచారం, ఏప్రిల్ 28: భవిష్యత్ తరాలకు రక్షణ రంగాల్లో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలే కీలకంగా మారునున్నాయని కేంద్ర రక్షణ మంత్రి ముఖ్య సలహాదారుడు సతీష్‌రెడ్డి అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలో భాగంగా రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విజన్ అనే ఆంశంపై సదస్సు రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఓ ముఖ్య సలహాదారుడు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గోప్ప పరిశోధన రంగాలు, గొప్ప మేధావులకు నిలయంగా ఉస్మానియా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు నావిగేషన్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇంగ్లండ్, భారతదేశం పరిశోధన రంగాలుగా ఉంటున్నాయని తెలిపారు. అందులో ఓయూలో మాత్రం నావిగేషన్‌పై అత్యున్నత పరిశోధనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. 50 విభాగాల ఆంశాలను తీసుకోని పరిశోధనలు చేస్తే దాంట్లో 10 విభాగాలకు సంబంధించిన ఆంశాలను మన ఓయూ విద్యార్థులు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. దేశంలో ఐఐటి చదువుతున్న మొత్తం విద్యార్థులు విదేశీ చదువులపై స్థిరపడాలని ఆలోచిస్తున్నారని.. అదే ఓయూ విద్యార్థులు 95 శాతం దేశానికి సేవ చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఐఐటి చదివిన ప్రతి విద్యార్థి ఒక్క విజన్‌తో రక్షణ రంగాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు. ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు డిఆర్‌డిఏ, నావిగేషన్ సంస్థలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. దేశంలో సైబర్ నేరాలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని సైబర్ పరిశోధనలకు నేటి ఇంజనీరింగ్ యువత ముందుకురావాలని సూచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూ విజన్ 50 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు తీసుకుంటే విజన్‌ను సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయని తెలిపారు.