రంగారెడ్డి

అప్రకటిత కరెంటు కోతలతో పరేషానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 29: తాండూరు పట్టణంతోపాటు డివిజన్‌లోని గ్రామీణ ప్రాంతం అంతటా సమయపాలన లేకుండా అప్రకటిత కరెంటు కోతలతో వినియోగదారులు పరేషాన్ అవుతున్నారు. వారం రోజులుగా తాండూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయని వినియోగదారులు బెంబేలు పడుతున్నారు. వ్యాపారులు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల నిర్వహకులు, పిండి మరలు, నూనెమిల్లుల యజమానులు, గృహ వినియోగదారులు, కరెంటు ఆధారిత ఇంటర్‌నెట్, మీ-సేవా సంస్థ నిర్వాహకులు అప్రకటిత కరెంటు కోతలతో తమ వ్యాపారాలు సన్నగిల్లుతున్నట్లు ఏకరువు పెడుతున్నారు. ఎందుకు కరెంటు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయో స్థానిక విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం అధికారులు, ట్రాన్స్ కో సిబ్బంది తెలపటం లేదన్నారు. ముందస్తు సమాచారం లేకుండా తాండూరు విద్యుత్ శాఖ అధికారులు జవాబుదారీతనం లేకుండా తమ ఇష్టా రాజ్యంగా వ్యవహరించటంపై వినియోగదారులు మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో కనబడటం లేదు. ప్రతి గంటకు మూడు నాలుగు పర్యాయాలు కరెంటు సరఫరాలో అంతరాయాలు, అప్రకటిత కోతలు విధిస్తుండటంతో అన్ని వర్గాల వృత్తులవారు తాండూరు విద్యుత్ శాఖ అధికారుల పని తీరు పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా కరెంటు బిల్లులు ముక్కుపిండి వసూలు చేయడంతో పాటు ఒక్క నెల ఆలస్యం అయినా అపరాధ రుసుము విధించి బిల్లులు వసూలు చేస్తున్న అధికార యంత్రాంగం.. కరెంటు సరఫరాను సక్రమంగా కొనసాగించటంలో ఎందుకు విఫలం అవుతున్నారంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తాండూరు పట్టణ డివిజన్ ప్రాంతం నుండి ప్రతి నెలా కోట్లాది రూపాయలు కరెంటు చార్జీల రూపేణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, కరెంటు సక్రమంగా సరఫరా చేయటంలో మాత్రం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తమ నిర్లక్ష్య ధోరణులు ప్రదర్శిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కరెంటు కష్టాలు నిత్యకృత్యంగా మారటం శోఛనీయమని వాపోతున్నారు.

పగటి పూట.. విద్యుత్ వెలుగులు

జీడిమెట్ల, ఏప్రిల్ 29: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పగటిపూట విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల, అపురూపకాలనీలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం 10 గంటలు దాటినా విద్యుత్ స్తంభాలకు విద్యుత్ కాంతులు వెలుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరాయంగా అందిస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో పగటిపూట సైతం వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. పట్టపగలు విద్యుత్ కాంతులు వెలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించాల్సిన అధికారులే ఈ విధంగా నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పగటి పూట విద్యుత్ వెలుగులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.