రంగారెడ్డి

పాఠశాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 12: దూలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని దూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నవీన్‌కుమార్ అన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణపు పనులను నవీన్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సంఘం కేవలం రైతులు, వ్యవసాయమే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో ముందుందని చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణానికి వ్యవసాయ సహకార సంఘం ముందుకు వచ్చిందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో తాము అదనపు గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్‌చైర్మన్ జనార్దన్‌రెడ్డి, డైరెక్టర్ దేవెందర్, సిఇఓ ప్రసాద్‌రావు, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, యుటిఎఫ్ నాయకుడు లాలయ్య పాల్గొన్నారు.
సిడిఎంఏ అడిషనల్ డైరెక్టర్ పర్యటన
ఉప్పల్, మే 12: సిడిఎంఎ అడిషనల్ డైరెక్టర్ అనురాధ శుక్రవారం బోడుప్పల్‌లో పర్యటించారు. కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, శానిటేషన్ అధికారి జనార్ధన్‌రెడ్డి, ఎఇ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి లక్ష్మీనగర్ రోడ్డు, అంబేద్కర్ వగ్రహం చౌరస్తా, వర్మీ కంపోస్టు తయారీ కేంద్రం వంటి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
19వ రోజుకు చేరిన వెటర్నరీ విద్యార్థుల ఆందోళన
రాజేంద్రనగర్, మే 12: రాజేంద్రనగర్‌లోని పివి నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారానికి 19వ రోజుకు చేరింది. విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులపై మొసలి కన్నీరు కారుస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక నేటివరకు ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో కాంట్రాక్టు ప్రాతిపదిక ఉద్యోగాలంటూ నిరుద్యోగాల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలకు దిగి వచ్చి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.